ఏకనాథుడు (సంత్ ఏకనాథ్) వార్కరీ సాంప్రదాయానికి చెందిన మరాఠీ పండితుడు, కవి. విఠోబాను ఆరాధించాడు. మరాఠీ సాహిత్యంలో ముందు తరం వారైన జ్ఞానేశ్వరుడు, నామదేవుడు మొదలైన వారికీ, తరువాతి తరం వారైన తుకారాం, సమర్థ రామదాసుకీ ఒక వారధిగా నిలిచిన వాడు.

Eknath 2003 stamp of India.jpg
ఏకనాథుడు - 2003 స్టాంపు

జీవితం సవరించు

ఏకనాథుడి జీవించిన కాలం కచ్చితంగా తెలియదు. ఆయన 16వ శతాబ్దం చివరిలో జీవించినట్లు పండితులు అంచనా వేస్తున్నారు. పురాణాల ప్రకారం ఈయన మహారాష్ట్ర లోని పైఠాన్ అనే ప్రాంతంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు అతను చిన్నతనంలో ఉండగానే మరణించారు. అతని తాత, వార్కరీ సాంప్రదాయంలో ముఖ్యుడు అయిన భానుదాస్ ఇతన్ని పెంచి పెద్దచేశాడు. [1] మరి కొన్ని ఆధారల ప్రకారం భాను దాస్ అతని ముత్తాత అయి ఉండవచ్చు.[2] అతని గురువైన జనార్ధన్ స్వామి ఒక సూఫీ సన్యాసి అయిఉండవచ్చని కొంతమంది పండితులు భావించారు.[3]

రచనలు సవరించు

ఏకనాథుడు భాగవత పురాణాన్ని ఏకనాథ భాగవతం పేరుతో తిరగరాశాడు.[4] అలాగే రామాయణాన్ని కూడా భావార్థ రామాయణం అనే పేరుతో తిరగరాశాడు. ఇంకా రుక్మిణీ స్వయంవరం, శంకరాచార్యుడు సంస్కృతంలో రాసిన 14 శ్లోకాల హస్తామలకం అనే రచనను 764 పద్యాలతో తిరగరాశాడు.

సుఖాష్టకం (447 పద్యాలు), స్వాత్మ-సుఖా (510 పద్యాలు), ఆనంద లహరి (154 పద్యాలు), చిరంజీవ పద్ (42 పద్యాలు), గీతా సార్, ప్రహ్లాద విజయం మొదలైనవి ఏకనాథుని ఇతర రచనలు. ఇంకా మరాఠీ సాహిత్యంలో భరూద్ అనే కొత్త రకం సాహిత్యాన్ని సృజించాడు. ఈ రచనలు సుమారు 300 దాకా ఉన్నాయి.[4]

సూచనలు సవరించు

  1. Novetzke (2013), pp. 141–142
  2. Schomer & McLeo (1987), p. 94
  3. Novetzke (2013), p. 142
  4. 4.0 4.1 Keune, Jon Milton (2011). Eknāth Remembered and Reformed: Bhakti, Brahmans, and Untouchables in Marathi Historiography. New York, NY, USA: Columbia University press. p. 32. Retrieved 9 March 2016.[permanent dead link]

మూలాలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఏకనాథుడు&oldid=3440848" నుండి వెలికితీశారు