తుకారాం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తుకారాం (Tukaram) (1608 - 1649) మహారాష్ట్రకు చెందిన మహాభక్తుడు. విఠోబాను పూజించే వాడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రథమైన పండరీని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీ లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు మరణించాడు. శివాజీ ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను అభంగాలు అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని తుకారాం భావించాడు.
జీవితంసవరించు
తుకారం తన జీవితంలో ఎక్కువ భాగంలో దేహూ అనే గ్రామంలో నివసించాడు. ఇది మహారాష్ట్రలోని పూనాకు దగ్గర్లోని చిన్న పట్టణం. తుకారాం మొదటి భార్య వారి పెళ్ళయిన కొద్ది రోజులకే మరణించింది. ఆయన రెండో భార్య జీజీబాయి. వారికి నలుగురు సంతానం. మహదేవుడు, విఠోబా, నారాయణ అనే ముగ్గురు కొడుకులు, భాగీరథి అనే కూతురు ఉన్నారు.
కొన్ని సూక్తులుసవరించు
- సాధువులు దీపావళి, దసరా పండుగలలో మన ఇండ్లకు వస్తారు. వారి రాక వైకుంఠం కలివచ్చినట్లే వుంటుంది.
- మనసుకు కొంచెంగా దైవభక్తి రుచి గనుక చూపిస్తే అది దానిని ఇంక వదలనే వదలదు.
- విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించు, అది అక్కడే పూజలందుకుంటుంది.
- దశరథ పుత్రుడు రాముడు మొన్నటివాడు కాగా, ఆత్మారాముడు శాశ్వతుడు.
మూలాలుసవరించు
బయటి లింకులుసవరించు
- తుకారాం ఆన్ లైన్.
- తుకారాం కథ మరాఠీ భాషలో
- తుకారాం (1608-1649), దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.