ఏకవింశతి పత్రపూజ
(ఏకవింశతి పత్రములు నుండి దారిమార్పు చెందింది)
ఏకవింశతి పత్రపూజ అనేది ఏకవింశతి అనగా 21 విధముల పత్రములతో చేయు పూజ. వినాయక వ్రతకల్పము లో ఈ పూజ ప్రధానమైనది. ఈ పత్రాలన్నింటిలో అనేక ఔషధగుణాలు కలిగివుంటాయి. ఆయా కాలాలలో వచ్చే రోగాలను కాలానుగుణంగా నయం చేయడం ఈ పత్రాల ప్రత్యేకత. గణనాథుని పూజించే నెపంతో మన పూర్వికులు 21 రకాల పత్రాలలోని ఔషధ గుణాలను మనకు సూచించారు.
ఏకవింశతి పత్రములు
మార్చు- మాచి పత్రము
- బృహతి పత్రము
- బిల్వపత్రము
- దూర్వ పత్రము
- దత్తూర పత్రము
- బదరి పత్రము
- ఆపామార్గ పత్రము
- తులసి పత్రము
- చూత పత్రము
- కరవీర పత్రము
- విష్ణుక్రాంత పత్రము
- దాడిమ పత్రము
- దేవదారు పత్రము
- మరుతక పత్రము
- సింధువార పత్రము
- జాజి పత్రము
- గలడలి పత్రము
- శమి పత్రము
- అస్వత్థ పత్రము
- అర్జున పత్రము
- అర్క పత్రములు.
వినాయకుని ఏకవింశతి పత్రపూజ
మార్చు- సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
- గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
- ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
- గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
- హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
- లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
- గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।
- గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
- ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
- వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
- భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
- వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
- సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
- ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
- హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
- శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
- సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
- ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
- వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
- సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
- కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
- శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.
పత్రాల విశేషాలు
మార్చు- మాచీపత్రం : దీన్ని దవనం అని కూడా అంటారు. ఇది కుష్ఠు సంబంధ వ్యాధులను, బొల్లివంటి చర్మవ్యాధులను, నరాల సంబంధవ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఈ పత్రాలున్న పరిసరాల్లో ఎటువంటి సూక్ష్మక్రిములు దరిచేరవు.
- బృహతీపత్రం : దీని వాకుడాకు అంటారు. ఇది ఆయాసాన్ని, దగ్గును, మలబద్దకము, అతివిరేచనాలను తగ్గిస్తుంది. బాలింతలకు ఈచెట్టు ఒక వరం. ఇది అనేక దివ్యౌషధాల తయారీకి ఉపయోగపడుతుంది.
- బిల్వపత్రం : దీన్ని మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది.
- దూర్వారయుగ్మం : దీన్ని గరిక అంటారు. ఇది దేహంలో రక్తాన్ని శుద్ధిచేస్తుంది. అధికరక్తస్రావాన్ని, రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలోని హానికర సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. అజీర్ణవ్యాధిని, అధిక ఆమ్లస్రావాన్ని తగ్గిస్తుంది. సకలచర్మరోగాలను, సోరియాసిస్ లాంటి వ్యాధులను తగ్గిస్తుంది. దుస్స్వప్నాలను నివారిస్తుంది.
- దత్తుర పత్రం (ఉమ్మెత్త) :- ఊపిరితిత్తులను వ్యాకోచింప చేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.
- బదరి పత్రం (రేగు ఆకు) :- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
- అపామార్గ పత్రం (ఉత్తరేణి) : -దగ్గు, ఉబ్బసంకి బాగా పనిచేస్తుంది.
- తుర్యా పత్రం (తులసి) :-శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు, దగ్గు వంటివి దరి చేరవు.
- చూత పత్రం (మామిడి ఆకు) :-నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.
- కరవీర పత్రం (గన్నేరు ఆకు) :-గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు, బెరడు వాడతారు
- విష్ణు క్రాంతం (పొద్దు తిరుగుడు ఆకు) :-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.
- దాడిమ పత్రం (దానిమ్మ ఆకు) :- వాంతులు, విరేచనాలు, అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
- దేవదారు (దేవదారు ఆకు) :-శరీర వేడిని తగ్గిస్తుంది.
- మరువాకం (మరువం ఆకు) :-మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
- సింధువార పత్రం (వావిలాకు) :-కీల్లనోప్పులకు మంచి మందు.
- జాజి పత్రం (జాజి ఆకు) :- చర్మ రోగాలు, స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.
- గండకి పత్రం (అడవి మొల్ల యుధిక) :- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
- శమీ పత్రం (జమ్మి చెట్టు) :-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.
- అశ్వత పత్రం (రావి ఆకు) :-చాల ఓషధగుణాలు ఉన్నాయి.
- అర్జున పత్రం (మద్ది ఆకు) :-రక్త స్తంభనం, గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
- అర్క పత్రం (జిల్లేడు ఆకు) :-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.