వావిలి
ఒక ఔషధ మొక్క
(సింధువార నుండి దారిమార్పు చెందింది)
వావిలి (సంస్కృతం: సింధువార; ఆంగ్లం: Five-leaved chaste tree; హిందీ: Nirgundi) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo). దీని ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది.[2] ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో లభిస్తుంది.
Vitex negundo | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | వి.నెగుండొ
|
Binomial name | |
విటెక్స్ నెగుండొ |
వ్యాప్తి
మార్చుసాధారణముగా నీటి వనరులు ఉన్న గట్ల మీద ఆంధ్రప్రదేశ్ అంతటా బంజరు భూముల్లో పెరుగుతుంది.
లక్షణాలు
మార్చుఆయుర్వేదంలో
మార్చుఈ సింధువార పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
ఉపయోగాలు
మార్చు- వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.[3]
- దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు, గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
- ఆయుర్వేద, సిద్ధ వైద్యంలో మొక్కలోని అన్ని భాగములకు తిక్తకషాయ, కటురసం, కటువిపాకం, ఉష్ణవీర్య, కఫహర, లఘు గుణములు ఉన్నాయని, దీని ఔషధ ఉపయోగం ఈ విధంగా ఉదహరించి ఉన్నారు. వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమావాతానికి, కడుపులో పురుగులకు, పుండ్లకు, చెవి వ్యాధులకు, మలేరియాకు, కఫాన్ని తగ్గించడానికి ఉపయోగకరము.
- కంటిచూపు మెరుగవడానికి ఈ ఆకురసాన్ని ఐడ్రాప్స్ గా శ్రీధరీయం ఆయుర్వేద పద్ధతిలో (నయన ఐడ్రాప్స్) వాడతారు.
- వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.
- వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.
- పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల క్రింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే తలనొప్పి, జలుబు మటుమాయం అవుతుందని అంటారు. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిదగడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంటగలగర, కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా వూస్తారు. పత్రాల రసంలో అల్లంరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
- వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.
మూలాలు
మార్చు- ↑ "Vitex negundo information from NPGS/GRIN". www.ars-grin.gov. Archived from the original on 2011-06-05. Retrieved 2008-03-13.
- ↑ "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ సింధువార - వావిలి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 119.
వెలుపలి లంకెలు
మార్చుLook up వావిలిచెట్టు in Wiktionary, the free dictionary.
- మందుమొక్క - ఆదివారం ఆంధ్రజ్యోతి