ఏక్తా సోహిని (జననం 1971 మార్చి 27) భారతీయ నటి. ఆమె నటుడు మోహ్నిష్ బహల్ భార్య. 1980లలో టెలివిజన్ ధారావాహికల ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె 1990లో అర్బాజ్ అలీ ఖాన్ సరసన కమింగ్-ఏజ్ రొమాన్స్ ఫిల్మ్ సోలా సత్ర చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టింది. నామ్‌చీన్ (1991), తహల్కా (1992) వంటి చాత్రాలలో ఆదిత్య పంచోలి సరసన నటించి ప్రసిద్ధిచెందింది. ఆమె కూతురు ప్రనూతన్ బహల్ కూడా నటి.[1]

ఏక్తా సోహిని
జననం
ఆర్తి శర్మ

03 (1971) (age 53)[ఆధారం చూపాలి]
ఇతర పేర్లుఆర్తి బహల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1990–2020
జీవిత భాగస్వామిమొహ్నిష్ బహల్ (m.1992)
పిల్లలుప్రనూతన్ బహల్,
క్రిషా బహల్
తల్లిదండ్రులు
  • అరుణ్ శర్మ (తండ్రి)
  • చంద్రప్రభ శర్మ (తల్లి)
బంధువులుసప్నా (సోదరి)
లెజెండరీ నటి నూతన్ (అత్తగారు)

1991లో కె.వాసు దర్శకత్వంలో వచ్చిన పిచ్చి పుల్లయ్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది. ఈ చిత్రంలో నరేష్ సరసన నటించి మెప్పించింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సోలా సత్ర (1990)
అవ్వల్ నంబర్ (1990)
పాప్ కి కమయీ (1990)
పిచ్చి పుల్లయ్య (తెలుగు 1991)
ఫతే (1991)
నామ్‌చీన్ (1991)
హఫ్తా బంద్ (1991)
సాజన్ (1991)
ఖత్రా (1991)
వంశ్ (1992)
యుద్ధ్‌పత్ (1992)
తహల్కా (1992)
బసంతి తంగేవాలి (1992)
శత్రంజ్ (1993)
నాజర్ కే సామ్నే (1995)
హసీనా ఔర్ నగినా (1996)
తలాషి (1996)
వాస్తవ్ (1999)
గ్యాంగ్ (2000)
వాహ్! లైఫ్ హో తో ఐసీ! (2005)
అమన్ కే ఫరిష్టే (2016)

టెలివిజన్ కార్యక్రమాలు

మార్చు
దిల్ మిల్ గయ్యే
ఇతిహాస్
సంజీవని 2
మర్డర్, షీ రోట్ (Murder, She Wrote) సీజన్ 2 ఎపిసోడ్ 1

మూలాలు

మార్చు
  1. "What Pranutan Bahl misses the most about her mother on outdoor shoots - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 16 February 2022.