ఏడు తరాలు తెలుగులో ఒక అనువాద రచన దీనిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. దీని ఆంగ్ల మూలం ఎలెక్స్ హేలీ రచించిన రూట్స్ (Roots). ఈ పుస్తకం మూలం (రూట్స్‌) లో 688 పేజీలున్నాయి. తెలుగు అనువాదము లో 264 పెజీలు వున్నాయి ఈ పుస్తకం రూపు దిద్దుకోవటానికి ఎంతో శ్రద్ధతో, బాధ్యతతో శ్రమించి తెలుగు అనువాదాన్ని స్వర్గీయ సహవాసి అందించారు. ప్రథమ ముద్రణ 1980 తరువాత సుమారు పది పునర్ముద్రణలు (1983, 1990, 1994, 1997, 1999, 2001, 2005, 2006, 2007) పొందింది ఈ గొప్ప యథార్థ కథాచరిత్ర.[1][2]

ఏడు తరాలు
కృతికర్త: ఎలెక్స్ హేలీ
అనువాదకులు: సహవాసి
ముద్రణల సంఖ్య: 9
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
విడుదల: 1980


రచయిత వివరాలు

మార్చు
 
ఆంగ్ల మూలం ఎలెక్స్ హేలీ రచించిన రూట్స్ (Roots) పుస్తకం

ఏడు తరాలు తెలుగులో ఒక అనువాద రచన. దీని ఆంగ్ల మూలం ఎలెక్స్ హేలీ రచించిన రూట్స్ (Roots). ఈ పుస్తకం మూలం (రూట్స్‌) లో 688 పేజీలున్నాయి. ఈ పుస్తకం రూపు దిద్దుకోవటానికి ఎంతో శ్రద్ధతో, బాధ్యతతో శ్రమించి తెలుగు అనువాదాన్ని స్వర్గీయ సహవాసి అందించారు. అమెరికాలో రెండవ ప్రపంచయుద్ధం విరుచుకుపడే నాటికీ అతని వయసు 17 సంవత్సరాలు. అమెరికా తీర రక్షణాదళంలో భోజనశాలలో పనికి చేరి సృజనాత్మక రచనావ్యాసాంగం వంటపట్టించుకున్నాడు. తరువాత పత్రిక రచయితగా పేరుపొందాడు. ఆరుతరాల వెనుక అట్లాంటిక్ మహా సముద్రాన్ని కావల ఆఫ్రికా చీకటి కాండంలో తన వంశమూల పురుషుని పుట్టు పూర్వోత్తరాలు వెతికి వెలుగులోకి తేవాలనే సంకల్పం ఆయనకి 1962లో కలిగింది. 12 సుదీర్ఘ సంవత్సరాల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధనల ఫలితం రూట్స్ గా రూపొందింది. ప్రపంచవ్వాప్తంగా ఈ పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది.


కుంటా కింటే అనే నల్లజాతి యువకుడు పశ్చిమ ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందినవాడు. అతడు ఓ రోజున గిటార్ లాంటి వాయిద్యాన్ని తయారుచేసుకోడానికి కలప కోసం అడవికి వెళ్ళాడు. హఠాత్తుగా కొంతమంది అతనిపై దాడి చేసి వలేసి పట్టుకుని గొలుసులతో బంధించి ఓడలో అట్లాంటిక్ మీదుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తీసుకుపోయారు. అక్కడ మాసా జాన్ వేలర్ అనే తోటల యజమానికి బానిసగా అమ్మేశారు. అతను కుంటా కింటేకు టోబీ అని పేరుపెట్టాడు. కుంటా కింటే తప్పించుకుని పారిపోవడానికి నాలుగుసార్లు విఫల యత్నం చేశాడు. అతనింక ఆ ప్రయత్నం చేయకుండా ఒక పాదాన్ని నరికేసారు. వైద్యవృత్తిలో ఉన్న వేలర్ సోదరుడు విలియం వేలర్ కొంత మానవత్వం ఉన్నవాడు. అతడు సోదరుడి చర్యను గర్హిస్తూ కుంటా కింటేకు వైద్యం చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. సోదరునినుంచి తనే అతణ్ణి కొనుక్కుని గుర్రపు బండి నడపడానికి నియోగించాడు. తను ఏ విధంగానూ తన జన్మస్థానానికి వెళ్లలేనని గ్రహించిన కింటే పరాయి నేలలో ప్రవాసజీవితంతో క్రమంగా రాజీపడ్డాడు.

విలియం ఇంట్లో వంటమనిషిగా ఉన్న మరో బానిస బెల్ ను అతను పెళ్లి చేసుకున్నాడు. వారికి కూతురు పుట్టింది. ఆమెకు కిజ్జీ అని పేరుపెట్టారు. ఆమెకు వయసు వచ్చాక మాసా లీ అనే మరో బానిస యజమానికి విలియం అమ్మేశాడు. మాసా లీ బలాత్కారంగా తనను అనుభవించడంతో కిజ్జీ గర్భవతి అయింది. ఆమెకు కొడుకు పుట్టాడు. అతని పేరు చికెన్ జార్జి. అతను పెరిగి పెద్దయ్యాక మటిల్డా అనే మరో బానిసను పెళ్లిచేసుకున్నాడు. అతని మూడో కొడుకు టామ్. అతనికి ఇరేన్ అనే అమ్మాయితో పెళ్లయింది. వారి కుమార్తెలలో ఒకరైన సింథియాకు విల్ పామర్ అనే అతనితో వివాహం జరిగింది. వారి కూతురు బెర్తా, సైమన్ అలెగ్జాండర్ హేలీ అనే అతన్ని పెళ్లిచేసుకుంది. వారి కొడుకే రూట్స్ రచయిత ఎలెక్స్ హేలీ. కుంటా కింటేనుంచి అతనిది ఏడో తరం.

రచన నేపథ్యం

మార్చు

ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసల్ని కొనితేవటం 1619లో ప్రారంభమైంది. కేవలం ఇరవై మందితో మొదలైన బానిసల సంఖ్య 1810 నాటికి పది లక్షలు దాటింది. వాళ్లలో బలాత్కారంగా చెరబట్టి తెచ్చిన వాళ్ల సంఖ్యే ఎక్కువ. నల్ల బానిసలు లేనిదే తెల్లవాళ్లకు తెల్లవారని పరిస్థితి యేర్పడింది. నల్ల తల్లుల స్తన్యం తాగి తెల్ల శిశువులు పెరిగారు. నల్లవాళ్ల నెత్తురు, చెమటల్లో తడిచి తెల్లవాళ్ల పొలాలు విరగపండాయి. తెల్లవాళ్లు తమ లాభాల కక్కుర్తి, లైంగిక కుతి నీగ్రో మగ, ఆడ బానిసలతో తీర్చుకున్నారు. ఎవరి శ్రమ తామనుభవించే వైభవోపేతమైన జీవితాన్ని ప్రసాదించిందో, వాళ్లని మానవ మాతృలుగా కూడా పరిగణించలేదు తెల్లవాళ్లు. పైగా మేం నాగరికులం, సంస్కృతీపరులం అని తమకు తాము ఓ క్రూరమైన అబద్ధం చెప్పుకున్నారు.

ఈ భయంకరమైన బానిస వ్యవస్థని బద్దలు కొట్టడానికి అనేక తిరుగుబాట్లు లేచాయి. వేలాది నల్ల బానిసల్ని విమోచన లక్ష్యం వైపు కదిలించిన, విప్లవాదర్శం వేపు నడిపించిన గేబ్రియల్‌, డెన్మార్క్‌ వెసీ, నాట్‌ టర్నర్‌ మొదలైన వాళ్లు తెల్లవాళ్లకి పట్టుబడి ఉరికంబాలెక్కారు. 1852లో హారియట్‌ బీచర్‌ స్టోవ్ నవల ...అంకుల్ టామ్స్ క్యాబిన్... అమెరికాలో అపూర్వ సంచలనం రేపింది. అదే సంవత్సరం ఫ్రెడరిక్‌ డగ్లస్‌ అనే నీగ్రో నాయకుని ప్రసంగాలు నల్లజాతి ప్రజల్ని కదిలించివేసాయి; మునుముందుకు నడిపించాయి....

1865 ఏప్రిల్‌ 9న అమెరికా అంతర్యుద్ధం ముగిసింది. అబ్రహాం లింకన్‌ బానిసత్వ నిర్మూలనను ప్రకటించాడు. అది నల్లవాళ్ల గుండెల్లో దీపాలను వెలిగించింది. అయితే అంతర్యుద్ధం ముగిసిన ఆరు రోజులకే అబ్రహాం లింకన్‌ని ఓ తెల్ల జాత్యహంకారి దారుణంగా కాల్చి చంపాడు. తెల్లవాళ్ల దాస్యం నుంచి విముక్తులయిన నల్లజాతి ప్రజలకు అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో భయంకరమైన వర్ణ వివక్ష ఎదురైంది.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక అమెరికాలో వర్ణ సంఘర్షణలు విజృంభించాయి. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో నల్ల తెల్ల రెండు జాతుల మధ్య స్పర్థలు, వైషమ్యాలు మరింత పెరిగాయి. తెల్ల ప్రభుత్వ చెరసాలలు, ఉరికొయ్యలు నల్లజాతి ప్రజల సమతా కామనని తుడిచిపెట్టలేకపోయాయి. మౌంట్‌ గోమరీ ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం వారిని జాగృతం చేసి అనేక విజయాలను అందించాయి. జాత్యహంకారాన్ని ప్రతిఘటించందే, సమాన హక్కుల కోసం పోరాడందే అమెరికాలో నల్లజాతికి విముక్తి లేదని చరిత్ర స్పష్టం చేసింది. తెల్లవాళ్లు దాతలుగా, నల్లవాళ్లు గ్రహీతలుగా వుండే వ్యవస్థ పోయి సమాన భాగస్వాములుగా వుండే సామాజిక వ్యవస్థ కోసం అమెరికాలో నల్లజాతి పోరాడుతోంది. ఆ పోరాట ప్రతిధ్వనులను ఎలెక్స్‌ హేలీ ఏడుతరాల లో వినవచ్చు.[3][4]

ప్రథమ ముద్రణ 1980 తరువాత సుమారు పది పునర్ముద్రణలు (1983, 1990, 1994, 1997, 1999, 2001, 2005, 2006, 2007) పొందింది ఈ గొప్ప యదార్ధ కథాచరిత్ర. ఈ నవల చదివిన కొలది ఇంకా ముందుకు తీసుకోని వెళ్తుంది. ఆఫ్రికా అంటే చీకటి ఖండం అక్కడ మనుసులు అడవులలో మృగాల మద్య తిరిగే రాబ్బరులు. వాళ్ళు నాగరికత, సంస్కృతి,చరిత్ర , వారసత్వం లేని వారు.అమెరిక స్వతంత్ర స్వర్గసీమ. ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసల్ని కొని తేవడం 1619 లో మొదలయింది 20 మందితో మొదలిన బానిస సంఖ 1810 నాటికీ 10 లక్షలకు చేరుకుంది. ఈ భయంకర బానిష వ్వవ్యవస్థను బద్దలు కొట్టడానికి అనేక తిరుగుబాట్లు లేచాయి.1852 లో హారియట్ భిచార్ స్ట్తోవే నవల అంకుల్ టామ్స్ క్యాబిన్ అమెరికాలో సంచలనాన్ని రేపింది. అదె సంవత్సరం ఫ్రెడరిక్ డగ్లస్ అనే నీగ్రో నాయకుని ప్రసంగాలు నల్ల జాతి ప్రజలను ముందుకు నడిపించాయీ.

           1865 ఏప్రిల్ 9 న అమెరిక అంతర్ యుద్ధం ముగిసింది.

విశిష్టత

మార్చు

ప్రపంచవ్వాప్తంగా ఈ పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది. ఒక్క అమెరికాలోనే 25 లక్షల మేలిప్రతులు అమ్ముడయ్యాయి. ప్రాన్స్, జర్మని ,ఇటలి, జపాన్, దేశాలలో 10 లక్షల ప్రతులు చొప్పున ఖర్చయ్యాయి. 30 దేశాలు ఈ పుస్తక ప్రచురణ హక్కులు కొనుక్కున్నాయి. దేశాదేశాల కోట్లాది పాటకుల ఆదరణకు ఇంతకూ మించిన నిదర్శనం వేరేలేదు

        స్వేచ్ఛనుంచి సంకెళ్ళ దాకా, సంకెళ్ళనుంచి విముక్తికి సాగిన ఒక ప్రస్థానం "ఏడు తరాలు"

ఆరు తరాల వెనక అట్లాంటిక్‌ మహా సముద్రాని కావల ఆఫ్రికా చీకటి ఖండంలో తన వంశమూల పురుషుని (బానిస వ్యాపారులైన మానవ మృగాలకు చిక్కి బానిసగా మారి అమెరికాకు తీసుకు రాబడ్డ ...కుంటా కిం ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది. ఒక్క అమెరికాలోనే 25 లక్షల మేలి ప్రతులు అమ్ముడయ్యాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ దేశాలలో పది లక్షల ప్రతుల చొప్పున ఖర్చయ్యాయి. 30 దేశాలు ఈ పుస్తక ప్రచురణ హక్కులు కొనుక్కున్నాయి. అమెరికాలో చదవటం వచ్చిన ప్రతి నల్ల వ్యక్తీ యీ పుస్తకం కొన్నాడు. చదువు రాని ప్రతి నల్ల మనిషీ దీన్ని కొని బైబిల్లా భద్రంగా దాచుకున్నాడు. తమ పూర్వులు చేసిన పాపాలకు కృంగిపోయి తలవాల్చుకున్న ప్రతి తెల్లవాని కళ్లూ ఈ పుస్తకంలో కూరుకుపోయాయి. ఆఫ్రికాలో కుంటా కుంటే పుట్టిన జపూరును గాంబియా ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నంగా గౌరవించింది.

మూలాలు

మార్చు
 1. నమస్తే తెలంగాణ, ఏడు తరాలు (11 February 2018). "కదిలించే గ్రంథాలు". ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి. Retrieved 12 February 2020.
 2. సాక్షి, వేదిక (23 December 2016). "ఆ తూర్పు తలుపు తెరుచుకోనీ!". Retrieved 12 February 2020.
 3. Thompson, Krissah (14 November 2017). "Her mother said they descended from 'a president and a slave.' What would their DNA say?". The Washington Post. Retrieved 12 February 2020.
 4. సాక్షి, ఫ్యామిలీ (15 October 2018). "ఏడు తరాలు". పి.శాలిమియ్య. Archived from the original on 12 ఫిబ్రవరి 2020. Retrieved 12 February 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఏడు_తరాలు&oldid=3881682" నుండి వెలికితీశారు