ఏనుగుల వెంకట వేణుగోపాల్

ఏనుగుల వెంకట వేణుగోపాల్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

ఈవీ వేణుగోపాల్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-

వ్యక్తిగత వివరాలు

జననం (1967-08-16) 1967 ఆగస్టు 16 (వయసు 56)
మంకమ్మతోట, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు బాలాకుమారి, రాజేశ్వరరావు
పూర్వ విద్యార్థి నిజాం కాలేజీ, హైదరాబాద్

జననం, విద్యాభాస్యం మార్చు

ఈవీ వేణుగోపాల్‌ 1967 ఆగస్టు 16న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో బాలాకుమారి, రాజేశ్వరరావు దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి చేనేత, వస్త్ర పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు. వేణుగోపాల్‌ కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో 1992లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాడు.[3]

వృత్తి జీవితం మార్చు

ఈవీ వేణుగోపాల్‌ లా పూర్తి చేశాక న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది రాంజఠ్మలానీ వద్ద జూనియర్‌గా పని చేసి ఆ తరువాత కరీంనగర్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆయన రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేసి వివిధ విభాగాల్లో రిట్‌ పిటిషన్లు, రిట్‌ అప్పీళ్లలో వాదించాడు. ఆయన 2021లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందాడు. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[4]

2022 ఆగస్టు 16న హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ సమక్షంలో న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాడు.[5]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (26 July 2022). "హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  2. Eenadu (26 July 2022). "హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  3. Sakshi (26 July 2022). "హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు!". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  4. Andhra Jyothy (25 July 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  5. telugu, NT News (2022-08-16). "హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.