నిజాం కళాశాల
నిజాం కళాశాల హైదరాబాదు నగరంలో పేరొందిన ఉన్నత విద్యా సంస్థ, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం. నిజాం కళాశాల 1887లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రాంతంలో ఉంది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
నిమ్స్ | |
రకం | సార్వత్రిక |
---|---|
స్థాపితం | 1887 |
స్థానం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
అనుబంధాలు | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
జాలగూడు | అధికారిక జాలగూడు |
నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. సంవత్సరం పొడుగునా జరిగిన ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్థి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
చరిత్ర
మార్చుప్రస్తుతం ఉన్న ప్రధాన కళాశాల భవనం హైదరాబాదు నగర ప్రముఖులలో ఒకడైన ఫక్రుల్ ముల్క్ II మహలు. హైదరాబాదు పాఠశాల (నోబుల్ పాఠశాల), మద్రసా-ఏ-ఆలియాలను కలిపి నిజాం కళాశాలను స్థాపించాడు. కళాశాల స్థాపకుడు, విద్యావేత్త అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, సరోజినీ నాయుడు తండ్రి అయిన డా. అఘోరనాథ్ ఛటోపాధ్యాయను ఏరికోరి కళాశాల తొలి ప్రిన్సిపాలుగా నియమించాడు.
అనుబంధాలు
మార్చుప్రారంభంలో ఇది మద్రాస్ విశ్వవిద్యాలయానికి 60 సంవత్సరాలు అనుబంధంగా ఉంది. 1947 ఫిబ్రవరి 19 న, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంద కళాశాలగా మార్చబడింది.[1] ఈ కళాశాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో నేటి రాజకీయ నాయకులు, వైద్యులు చాలా మంది ఈ చారిత్రక కళాశాల నుండి వెళ్ళారు.[2]
కొత్త భవనాలు
మార్చుకళాశాలలో డిగ్రీ విద్యార్థులకు వసతి కల్పించకపోవడంపై 2022 అక్టోబరు- నవంబరులో నిజాం కళాశాల విద్యార్థులు కళాశాలలో ఆందోళన చేపట్టారు. దాంతో రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చాడు.[3] వసతి నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు.[4]
ఇచ్చిన మాట ప్రకారం, కళాశాలలో వసతి, కొత్త భవనాలకు 2023, ఆగస్టు 12న మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎల్.రమణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, విశ్వవిద్యాలయ వీసీ డి.రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.[5][6]
ప్రముఖ పూర్వవిద్యార్ధులు
మార్చు- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
- సురేష్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్
- నందమూరి బాలకృష్ణ - సినీనటుడు
- రాకేశ్ శర్మ - వ్యోమగామి
- కె.జి.రామనాథన్ - గణితశాస్త్రవేత్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
- టి.సుబ్బరామిరెడ్డి - రాజ్యసభ సభ్యుడు
- అబ్బూరి ఛాయాదేవి - కథా రచయిత్రి.
- బూర్గుల రామకృష్ణారావు - హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
- సీతారాం యేచూరి - పార్లమెంటు సభ్యుడు, సి.పి.ఎం. నాయకుడు
- శ్యాం బెనగళ్ - భారతీయ సినిమా దర్శకుడు
- ఖండవల్లి లక్ష్మీరంజనం - సాహిత్యవేత్త, పరిశోధకులు
- సూరి భగవంతం - శాస్త్రవేత్త
- టీవీ నారాయణ - సామాజిక, విద్యారంగ నిపుణుడు.
- రాజారావు - ఆంగ్ల రచయిత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.
- లక్ష్మీ ప్రాతూరి - భారతీయ పారిశ్రామికవేత్త, క్యూరేటర్, ఉపన్యాసకురాలు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Nizam College Hyderabad - Institution in Hyderabad, Attractions in Hyderabad Andhra-Pradesh". web.archive.org. 2016-01-30. Archived from the original on 2016-01-30. Retrieved 2021-01-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Nizam College, Nizam College, Hyderabad". web.archive.org. 2011-09-01. Archived from the original on 2017-12-10. Retrieved 2021-01-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Today, Telangana (2022-11-08). "KTR responds to Nizam College students protest, urges Education Minister to address issues". Telangana Today. Archived from the original on 2022-11-08. Retrieved 2023-08-17.
- ↑ "ఆ విద్యార్థుల సమస్యకు వెంటనే ముగింపు పలకండి: మంత్రి కేటీఆర్". ETV Bharat News. 2022-11-08. Archived from the original on 2023-08-17. Retrieved 2023-08-17.
- ↑ "KTR lays foundation for Nizam College boys hostel". www.deccanchronicle.com. 2023-08-13. Archived from the original on 2023-08-13. Retrieved 2023-08-17.
- ↑ Today, Telangana (2023-08-12). "KT Rama Rao lays foundation stone for classroom complex and boys hostel at Nizam College". Telangana Today. Archived from the original on 2023-08-12. Retrieved 2023-08-17.