ఏఱు
(ఏరు నుండి దారిమార్పు చెందింది)
ఏరు లేదా ఏఱు అనగా చిన్న నది. ఇది సామాన్యంగా ఒక పెద్ద నదికి ఉపనదిగా ఉండి చివరికి సముద్రంలో కలిసిపోతుంది. ఇవి సామాన్యంగా తక్కువ లోతు ఉంటాయి.
కొన్ని ఏరులు
మార్చుసామెతలు
మార్చుఏఱు మీద కొన్ని తెలుగు సామెతలు.[1]
- ఏఱు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
- ఏఱు దాటే దాకా ఓడ మల్లయ్య ఏఱు దాటాక బోడి మల్లయ్య
- ఏటికి ఎన్ని నీళ్ళు వచ్చినా కుక్కకు గతుకునీళ్ళే
- ఏటీతకూ లంకమేతకూ సరి
- ఏటొడ్డు చేనూ నూతొడ్డు బిడ్డా
- ఏట్లో వేసినా ఎంచి వేయాలి
- ఏఱు ఎన్ని వంకలు బోయినా సముద్రంలో కలవక తప్పదు
- ఏఱు పోయిందే పల్లం, ఏలిక చెప్పిందే న్యాయం
- ఏఱు ముందా ? ఏకాదశి ముందా ?
మూలాలు
మార్చు- ↑ జాతీయ సంపద, తెలుగు నేర్చుకునేవారికి సామెతలు, జాతీయాలు, భవిష్యనిధి వివరణలతో, ఆరి శివరామకృష్ణయ్య, 2008.