ఏర్పుల నరోత్తం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 08 సెప్టెంబర్ 2023న రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2]

ఏర్పుల నరోత్తం

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
08 సెప్టెంబర్ 2023 - 07 డిసెంబర్ 2023[1]
ముందు బండా శ్రీనివాస్

వ్యక్తిగత వివరాలు

జననం 1965 ఏప్రిల్ 19
పస్తాపూర్‌ గ్రామం, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా, కరీంనగర్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు చంద్ర‌మ్మ‌, న‌ర్స‌య్య
సంతానం ఇద్ద‌రు పిల్ల‌లు
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభ్యాసం మార్చు

ఏర్పుల నరోత్తం తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌ గ్రామంలో జన్మించాడు. ఆయన ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు జహీరాబాద్‌లోనే చదివి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1987లో సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీని పూర్తి చేశాడు.

వృత్తి జీవితం మార్చు

ఏర్పుల నరోత్తం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో నీటి పారుద‌ల శాఖ‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, శ్రీశైలం ప్రాజెక్టు కాలువ‌ల డిజైన్ల‌లో కీలకంగా పని చేశాడు. ఆయన అనంతరం వికారాబాద్‌లో మైన‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించి, ప్ర‌జా సేవ చేయాల‌నే ఉద్దేశంతో 2008లో త‌న ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

ఏర్పుల నరోత్తం ప్ర‌జా సేవ చేయాల‌నే ఉద్దేశంతో 2008లో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి అనంతరం 2009లో తెలుగుదేశం పార్టీ లో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. న‌రోత్త‌మ్‌ 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి కాంగ్రెస్ పార్టీని వీడి[3], 2023 జులై 6న ప్రగతిభవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. ఆయనను రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ 08 సెప్టెంబర్ 2023న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4][5]

మూలాలు మార్చు

  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (9 September 2023). "నరోత్తంకు సముచిత స్థానం". Archived from the original on 9 September 2023. Retrieved 9 September 2023.
  3. Mana Telangana (6 July 2023). "కాంగ్రెస్‌కు ఊహించని షాక్". Archived from the original on 9 September 2023. Retrieved 9 September 2023.
  4. Andhra Jyothy (8 September 2023). "ఎన్నికల ముందు కేసీఆర్ మరో ప్లాన్.. బీఆర్ఎస్‌లో చేరిన కొద్ది రోజులకే 'ఆయన'కు కీలక పదవి". Archived from the original on 9 September 2023. Retrieved 9 September 2023.
  5. Namasthe Telangana (8 September 2023). "తెలంగాణ ఎస్సీ కులాల స‌హ‌కార అభివృద్ధి కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఏర్పుల న‌రోత్త‌మ్". Archived from the original on 9 September 2023. Retrieved 9 September 2023.