జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం

మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో జహీరాబాదు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

  • జహీరాబాద్
  • కోహీర్
  • న్యాల్కల్
  • ఝారసంగం

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1989 పట్లోళ్ల నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాంలింగం ధశరతరెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 జె. గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏర్పుల నరోత్తం తెలుగుదేశం పార్టీ
2014 జె. గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.మాణిక్‌రావు తె.రా.స
2018 కె.మాణిక్‌రావు తె.రా.స జె. గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ

1983 ఎన్నికలు మార్చు

1983 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరుమల లక్ష్మారెడ్డిపై సుమారు 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. బాగారెడ్డికి 34,861 ఓట్లు రాగా, లక్ష్మారెడ్డికి 24,964 ఓట్లు లభించాయి.[1]

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జహీరాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెంగల్ బాగన్న పై 12863 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఫరీదుద్దీన్‌కు 60273 ఓట్లు రాగా, బాగన్నకు 47410 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున జె.గీతారెడ్డి పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున సరోత్తమ్, ప్రజారాజ్యం పార్టీ నుండి డి.వసంత్ కుమార్, భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్‌కుమార్, లోక్‌సత్తా తరఫున ప్రతాప్‌కుమార్ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది జనవరి 7, 1983
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009