ఏవండీ ఆవిడ వచ్చింది

1993 సినిమా

ఏవండీ ఆవిడ వచ్చింది ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 1993లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇద్దరు హీరోయిన్ సినిమాల హీరోగా పేరు గల శోభన్ బాబు నడివయసు దాటిన పాత్రలు వేసే రోజుల్లో కూడా ఇద్దరు హీరోయిన్‌ల హీరోగా ఈ సినిమా తీసి విజయం సాధించాడు.[1]

ఏవండీ ఆవిడ వచ్చింది
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం బి. శివరామకృష్ణ
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ,
శారద,
రంభ,
హరీష్,
సత్యనారాయణ,
బ్రహ్మానందం
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి శోభన్‌బాబుకు వాణిశ్రీ, శారదలు భార్యలుగా నటించారు. సినిమా ఫ్లాష్ బ్యాక్‌లోకి ముందుగా వెళితే శోభన్ బాబును చేసుకోవాలని అతని ఇద్దరు మరదళ్ళు (తండ్రి వైపు మామకూతురు, తల్లివైపు మామ కూతురు) పట్టుపట్టి పెళ్ళి చేసుకొంటారు. వారంలో మూడు రోజులు ఒక భార్య వద్ద, మూడు రోజులు మరొక భార్య వద్ద, ఒక రోజు తల్లిదండ్రుల వద్ద శోభన్ బాబు గడుపుతుంటాడు. వాణిశ్రీ ఆరోగ్యం కాపాడుకోవడానికి వాణిశ్రీకి పుట్టిన బిడ్డను శారదకు పుట్టిన బిడ్డగా శోభన్‌బాబు చెబుతాడు. అలా శారద వద్ద పెరిగిన ఆడబిడ్డ (రంభ), వాణిశ్రీ మేనల్లుడిని పెళ్ళి చేసుకొని వాణిశ్రీ ఉండే ఇంటికి కాపురానికి వెళుతుంది. సవతి తల్లి పట్ల ఉన్న మాత్సర్యం కారణంగా రంభ ఆమెను కించపరచడం మొదలుపెడుతుంది. ఈ గందరగోళంలో ఉత్పన్నమయిన అనేక సమస్యలు ఒక కొలికికి చేరుకోవడమే ఈ సినిమా కథ.

తారాగణం మార్చు

  • శోభన్ బాబు
  • వాణిశ్రీ
  • శారద
  • రంభ
  • హరీష్
  • సత్యనారాయణ
  • బ్రహ్మానందం
  • ఐరన్ లెగ్ శాస్త్రి

పాటలు మార్చు

ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.[2]

పాట పాడిన వారు రాసిన వారు
భామ భామ చిత్రా. ఎస్పీ బాలు. భువన చంద్ర
గంగను చూస్తే గౌరికి మంట S.P. బాలు గారు భువన చంద్ర
గుచ్చి గుచ్చి చిత్ర.ఎస్పీ బాలు భువన చంద్ర
హత్తుకోమన్నాది మనో, చిత్ర,S.P. శైలజ భువన చంద్ర
ఓ ప్రియా ప్రియా ఎం రమేష్, మనో, హనుమంతరావు, రాధిక,మురళీధర్ భువన చంద్ర

మూలాలు మార్చు

  1. Admin. "Evandi Avida Vachindi Telugu Movie". thecinebay.com. The Cine Bay. Archived from the original on 11 ఆగస్టు 2016. Retrieved 5 August 2016.
  2. "ఏవండీ ఆవిడ వచ్చింది పాటలు". naasongs.com. naasongs.com. Archived from the original on 1 డిసెంబరు 2016. Retrieved 18 December 2016.

బయటి లింకులు మార్చు