రంభ, హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుని సభలోని 32 మంది అప్సరసలలో ఒకరు.ఈమె సౌందర్యవతి. అందాలకు రాణి లాంటిది.దేవలోకంలోని ఇంద్రుని సభలో ఉన్న అప్సరసలలో నాట్యం, సంగీతం కళలలో ఆమె సాధించిన విజయాలలో ఆమె ఘనత చెప్పలేని ఘనత వహించింది.ఆమె గంధర్వుడు తుంబురు భార్య అని పురాణాల ద్వారా తెలుస్తుంది.రంభ క్షీరసాగర మథనం నుండి ఉద్బవించిన ఒక దేవదూత. అనగా సముద్రుడు తనయ.రంభ సహచరులు ఊర్వసి,మేనక.రంభ సోదరి లక్ష్మి, సోదరుడు జలంధరుడు.

పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.

చరిత్ర

మార్చు

పురాణాలు, వేదాల ప్రకారం రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి అనేక మంది అప్సరలు గురించి ప్రస్తావించబడ్డాయి. వీటి గురించి చాలా భిన్నమైన కథలు కూడా ఉన్నాయి. ఈ అప్సరసలలో రంభ ప్రముఖమైందిగా చెప్పుకోవచ్చు.కానీ ఆమెను విశ్వమిత్ర ఒక సందర్బంలో శపించాడు.[1]పురాణాలలో రంభ సముద్రం నుండి జన్మించిదని తెలుస్తుంది. ఆ తర్వాత ఇంద్రుడు రంభను చూసి, తన రాజ్యసభలో రంభకు చోటు ఇచ్చాడని పురాణాలలో చెప్పబడింది.రంభ ఇంద్రదేవుడు ఇంట్లో ఎప్పుడూ ఉండేది.రంభ చాలా అందంగా ఉండేదని చెప్పబడింది. కానీ ఇంద్రుడు ఒకసారి విశ్వమిత్రుడు బ్రహ్మరుషిగా మారటానికి చేసే తపస్సును భంగపరచడానికి రంభను ప్రయోగించాడు.[2]రంభ విశ్వామిత్రుని తపస్సును భంగపరచటానికి ప్రయత్నించినప్పుడు, విశ్వామిత్రుడు కోపంతో రంభను ఒక బ్రాహ్మణుడు ఆమెను శాపం నుండి విముక్తి కలిగించేంతవరకు 1000 సంవత్సరాలు రాయిగా మారతావని శపిస్తాడు.ఆరకంగా రంభ శిలగా మారుతుంది.

ఈ శాపం నుండి బయటపడటానికి రంభ శివ-పార్వతిని ఆరాధించింది. చాలా సంవత్సరాల తరువాత ఈ శాపం నుండి రంభకు శివ-పార్వతిల ద్వారా శాప విముక్తి పొందినట్లుగా కథనం.వాల్మీకి రామాయణం ప్రకారం విశ్వామిత్రుని శాపం నుండి రంభను ఒక బ్రాహ్మణుడు ద్వారా విముక్తి పొందినట్లు మరొక కథనం ద్వారా తెలుస్తుంది.రావణ సంహితలో రంభ గురించి ప్రస్తావించబడింది. "ఒకసారి రావణుడు రంభతో శక్తిని ఉపయోగించాలని అనుకున్నాడు.దానితో రంభ కోపంతో రావణుడిని శపించినట్లు పురాణ కథనం.అర్జునుడు స్వర్గానికి వెళ్లినప్పుడు అర్జునుడిని రంభ నాట్యంతో స్వాగతించింది.[1]

భారతీయ శిల్పకళలో అప్సరసలు

మార్చు

భారతదేశంలో హిందూ మతం, బౌద్ధమతం ద్వారా ప్రభావితమైన దక్షిణ, ఆగ్నేయాసియాలోని ప్రాంతాలలో శిల్పకళ, చిత్రలేఖనంలో అప్సరసల ఊహా ప్రతిమల శిల్పాలు అందంగా చిత్రీకరించబడ్డాయి. భారతదేశంలోని అజంతా, శ్రీలంకలోని సిగిరియా వద్ద 5 వ - 6 వ శతాబ్దపు కుడ్యచిత్రాలు, కంబోడియాలోని ఆంగ్‌కార్ వాట్ దేవాలయంను అలంకరించే శిల్పాలు దీనికి ముఖ్యమైన ఉదాహరణలు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Rambha came out of Samudramanthan, Vishwamitra cursed her". News Track (in English). 2020-05-26. Retrieved 2020-08-11.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "ramayana - Who freed Rambha from Vishwamitra's curse?". Hinduism Stack Exchange. Retrieved 2020-08-11.
  3. "Apsara | Indian religion and mythology". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-08-11.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రంభ&oldid=3966047" నుండి వెలికితీశారు