ఏ‌.ఎస్. మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో చిత్తూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఏ.ఎస్. మనోహర్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
చిత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

రాజకీయ జీవితం మార్చు

మనోహర్ 1994 తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన చిత్తూరు పట్టణ టీడీపీ కన్వీనర్‌గా పని చేస్తున్న సమయంలో 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సి.కె. బాబు చేతిలో ఓడిపోయాడు. ఆయన 1995లో జరిగిన చిత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచాడు. మనోహర్ 1999 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయి తరువాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సి.కె. బాబు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఏ‌.ఎస్. మనోహర్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి రాష్ట్ర విభజన అనంతరం 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయనకు 2014 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ రాకపోవడంతో పార్టీకి దూరంగా ఉండి 2019 ఎన్నికల ముందు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరాడు. మనోహర్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. చిత్తూరు నియోజకవర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆయన 4 జూన్ 2020లో తేడుగుదెశం పార్టీకి రాజీనామా చేశాడు.[1][2]

మూలాలు మార్చు

  1. TV9 Telugu (4 June 2020). "చంద్రబాబుకు ఊహించని షాక్‌.. కీలక నేత సడన్‌ రాజీనామా..!". Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhrajyothy (5 June 2020). "వ్యక్తిగత కారణాలతోనే టీడీపీకి రాజీనామా". Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.