ఏ మంత్రం వేసావె
ఏ మంత్రం వేసావె 2018 మార్చి 9 న విడుదలైన తెలుగు చిత్రం. శ్రీధర్ మర్రి దర్శకత్వంలో గోలీసోడా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శివాని నటించారు..[1][2]
కథ
మార్చునిఖిల్ (విజయ్ దేవరకొండ) ఆన్లైన్ గేమింగ్‌కు బానిసైన యువకుడు. ఇంటి నుండి బయటకు రాకుండా ఆన్లైన్ గేమ్స్‌లోనే కాలం గడుపుతుంటాడు. ఓ రోజు అతడికి రాగ్స్ అలియాస్ రాగమాలిక (శివానీ సింగ్) పరిచయం అవుతుంది. నిఖిల్ కి పేరు చెప్పకుండా అతన్ని ఆట పట్టిస్తుంటుంది. రాగ్స్తో స్నేహం చేయాలనుకుంటాడు నిఖిల్ . అయితే తనని కలవాలంటే నిజ జీవితంలో ఓ ఆట ఆడి గెలవాలనే షరతు పెడుతుంది రాగ్స్. తన నిబంధనలకు ఒప్పుకున్న నిఖిల్ .. ఆమెను కలుసుకునే ప్రయత్నంలో రాగ్స్కు ఓ ప్రమాదం ఉందని తెలుసుకుంటాడు. రాగ్స్‌ను కాపాడే ప్రయత్నంలో నిఖిల్ చాలా సమస్యలను ఎదుర్కొంటాడు. ఆ సమస్యలేంటి? చివరికి నిఖిల్ , రాగ్స్ ఒకటయ్యారా? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.
తారాగణం
మార్చు- విజయ్ దేవరకొండ
- శివానీ సింగ్
- శివన్నారాయణ
- ఆశిష్ రాజ్
- ప్రభావతి
- దీపక్
- తిరువీర్
పాటల జాబితా
మార్చు- ఏవేళ చూశానో కానీ, యాజీన్ నిజార్
- గో లేడీ గాగా, లీప్సిక , సాహితి , రమ్య బెహరా, స్వీకార్ అగస్తి
- నువ్వంటులేని లోకం , దినకర్
- సుదూరాల తీరాల పాట , ప్రణవి
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణ సంస్థలు: గోలిసోడా ఫిలింస్, సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్
- సంగీతం: అబ్బత్ సమత్
- కెమెరా: శివారెడ్డి
- నిర్మాత, దర్శకత్వం: శ్రీధర్ మర్రి
మూలాలు
మార్చు- ↑ "Vijay Deverakonda's Ye Mantram Vesave First Look Poster". Chitramala (in Indian English). 2017-10-20. Archived from the original on 2018-07-05. Retrieved 2017-10-30.
- ↑ Telugu Filmnagar (2017-10-19), Ye Mantram Vesave First Look Teaser | Vijay Deverakonda | Shivani | #YeMantramVesave, retrieved 2017-10-30