ఐఎన్ఎస్ అరిఘాత్
ఐఎన్ఎస్ అరిఘాత్ అనేది అరిహంత్-తరగతి జలాంతర్గాముల్లో ఉన్నతీకరించిన రకం.[9][10][11] అణు జలాంతర్గాములను నిర్మించడానికి చేపట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటివి) ప్రాజెక్టులో భాగంగా భారతదేశం విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రంలో తయారు చేసిన రెండవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఇది.[12] దీనికి కోడ్ పేరు S3.[3][13][14]
అరిహత్ తరగతి జలాంతర్గామి - చిత్రకారుని ఊహ
| |
History | |
---|---|
భారతదేశం | |
పేరు: | ఐఎన్‌ఎస్ అరిఘాత్ |
నిర్మాణ సంస్థ: | నౌకానిర్మాణ కేంద్రం (SBC), విశాఖపట్నం[1] |
నిర్మాణం మొదలైనది: | 2011[2] |
జలప్రవేశం: | 2017 నవంబరు 19[3] |
కమిషనైనది: | 2024 ఆగస్టు 29 |
స్థితి: | క్రియాశీలంగా ఉంది |
సాధారణ లక్షణాలు | |
తరగతి, రకం: | అరిహంత్-class బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి |
రకం: | బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి |
డిస్‌ప్లేస్‌మెంటు: | 6,000 టన్నులు |
పొడవు: | 111.6 మీ. |
బీమ్: | 11 మీ. |
డ్రాఫ్ట్: | 9.5 మీ. |
స్థాపిత సామర్థ్యం: | 1 x CLWR-B1 కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టరు,[4][5] 83 MW[3] |
ప్రొపల్షన్: | 1 × ప్రొపెల్లర్ షాఫ్టు, న్యూక్లియర్ మరీన్ ప్రొపల్షన్ |
వేఘం: |
తేలినపుడు: 12–15 knots (22–28 km/h) మునిగినపుడు: 24 knots (44 km/h) |
పరిధి: | ఆహార సరఫరాల కోసం తప్పితే అపరిమితం |
మనుగడ: | నిర్వహణ, ఆహార సరఫరాల కోసం తప్పితే అపరిమితం |
పరీక్షా లోతు: | 300 మీ. (980 అ.) నుండి 400 మీ. (1,300 అ.) దాకా[6] |
సెన్సార్లు, ప్రాసెసింగ్ వ్యవస్థలు: |
|
ఆయుధాలు: |
అరిఘాత్‌ను 2017 లో గోప్యంగా జలప్రవేశం చేయించారు. దాని సామర్థ్యాల గురించీ, స్థితి గురించీ బహిరంగంగా పెద్దగా ప్రకటించలేదు. ఈ జలాంతర్గామిని మొదట ఐఎన్ఎస్ అరిదమన్ అని పిలిచేవారు. కానీ జలప్రవేశం తర్వాత ఐఎన్ఎస్ ఆరిఘాత్ అని పేరు మార్చారు. 2021 ప్రారంభంలో విడుదల చేసిన నివేదికల ప్రకారం, 2021 చివరిలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాటు దాన్ని కమిషన్ చేయవలసి ఉంది.[15]
వివరణ
మార్చుఈ పడవలో ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ (పిడబ్ల్యుఆర్) ద్వారా శక్తినిచ్చే ఏడు-రెక్కల ప్రొపెల్లర్ ఉంది. ఇది ఉపరితలంపై ఉన్నప్పుడు గరిష్టంగా 12-15 నాట్లు (′ID2] km/ మునిగినప్పుడు 24 నాట్లు (44 km/h) వేగాన్ని సాధించగలదు.[16][17][18] పిడబ్ల్యుఆర్ అనేది ఐఎన్ఎస్ అరిహంత్ కు శక్తినిచ్చే రియాక్టరుకు ఉన్నతీకరించిన రూపం. మునుపటి తరం కంటే పిడబ్ల్యుఆర్ చాలా తక్కువ శబ్దం చేస్తుంది. తద్వారా శత్రు నౌకలకు దీన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది.[19]
ఐఎన్‌ఎస్ అరిహంత్ మాదిరిగానే ఇందులో కూడా, దాని హంప్ లో నాలుగు క్షిపణి ప్రయోగ గొట్టాలున్నాయి. ఇందులో 12 కె-15 సాగరిక క్షిపణులను (750 కి.మీ పరిధి), లేదా నాలుగు కె-4 క్షిపణులను (3,500 కి.మీ పరిధి) వరకు మోసుకెళ్లగలదు.[3][20]
స్థితి
మార్చుఐఎన్ఎస్ అరిఘాత్ 2017 నవంబరులో జలప్రవేశం చేసింది.[3] దీన్ని 2021 లో కమిషను చేస్తారని తొలుత భావించారు.[3][21] అయితే, హిందూస్తాన్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఈ కమిషన్ ను 2024 కి వాయిదా వేశారు.[22][23] విస్తృతమైన పరీక్షలు, నవీకరణల తరువాత ఐఎన్ఎస్ అరిఘాత్‌ను 2024 ఆగస్టు 29 న భారత నావికా దళంలో చేర్చారు (కమిషను చేసారు). విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఈ కమిషన్ వేడుక జరిగింది.[24][25][26]
ఐఎన్ఎస్ అరిహంత్ కంటే ఐఎన్ఎస్ ఆరిఘాత్‌లో ఎక్కువ స్వదేశీ కంటెంటు ఉంది. దానికంటే గణనీయంగా మరింత అధునాతనమైనది. 750 కిలోమీటర్ల శ్రేణి క్షిపణులు మాత్రమే ఉన్న అరిహంత్‌కు ప్రతిగా, అరిఘాత్‌లో కె-15 సాగరిక, కె-4 క్షిపణులు ఉన్నాయి.[27]
మూలాలు
మార్చు- ↑ S. Anandan (14 January 2012). "Second nuclear submarine headed for year-end launch". The Hindu. Retrieved 2 June 2013.
- ↑ PETR TOPYCHKANOV (15 July 2015). "Indo-Russian naval. cooperation: Sailing high seas". Russia&India Report. Retrieved 15 July 2015.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "A peek into India's top secret and costliest defence project, nuclear submarines". India Today. 7 December 2017. Archived from the original on 20 April 2019. Retrieved 11 December 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "launched" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Founder's Day Speech, Director, BARC" (PDF). Bhabha Atomic Research Centre. 30 October 2018. Retrieved 21 March 2021.
- ↑ "DAE Excellence in Science, Engineering & Technology Awards 2010" (PDF). BARC Newsletter (322): 33. September–October 2011. Archived from the original (PDF) on 15 May 2013. Retrieved 21 March 2021.
- ↑ "Arihant-class submarines". Defence News. Archived from the original on 2014-08-26. Retrieved 23 June 2021.
- ↑ Pike, John (27 July 2009). "Advanced Technology Vessel (ATV)". globalsecurity.org. Archived from the original on 29 August 2011. Retrieved 24 January 2011.
- ↑ "Needed, a nuclear triad". Sunday-guardian.com. Archived from the original on 3 May 2014. Retrieved 2 June 2013.
- ↑ General, Lt. "Indian Navy's Capability Perspective – SP's Naval Forces". Spsnavalforces.net. Archived from the original on 3 July 2013. Retrieved 23 June 2013.
- ↑ "India To Construct Two More Arihant Nuclear Submarines For Navy". Defence Now. 28 February 2012. Archived from the original on 12 July 2015. Retrieved 2 June 2013.
- ↑ "Ensuring India's Qualitative Military Edge". SHARNOFF'S GLOBAL VIEWS. 10 April 2013. Retrieved 9 June 2013.
- ↑ Anandan, S. (2014-12-20). "INS Arihant may be of limited utility". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-06-30.
- ↑ "India's Nuclear Triad is now Fully Operational". Vivekananda International Foundation (in ఇంగ్లీష్). 2018-12-11. Retrieved 2019-07-02.
- ↑ Gupta, Shishir (2021-03-10). "Eye on China, India's plan for 6 nuclear-powered attack submarines back on track". Hindustan Times. New Delhi. Retrieved 2021-03-11.
- ↑ "INS Arighaat: How a second nuclear submarine boosts India's strategic reach". India Today (in ఇంగ్లీష్). 2024-08-31. Retrieved 2024-09-10.
- ↑ "India to commission second Arihant-class submarine in 2021". Default (in ఇంగ్లీష్). 2020-12-22. Retrieved 2024-09-10.
- ↑ "How Refined 83 MW PWR on INS Arighat Boosts its Stealth and Endurance Compared to INS Arihant". Defence.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-09-08. Retrieved 2024-09-10.
- ↑ "INS Arihant returned yesterday from 20-day deterrent patrol". India Today (in ఇంగ్లీష్). 5 November 2018. Retrieved 2019-10-13.
- ↑ Pubby, Manu (2020-02-21). "India's Rs 1.2 lakh crore nuclear submarine project closer to realisation". The Economic Times. Retrieved 2020-02-21.
- ↑ Shishir Gupta (19 February 2023). "Aircraft carrier INS Vikramaditya is back on high seas". Hindustan Times. Archived from the original on 19 February 2023. Retrieved 16 April 2023.
- ↑ Redacción (2024-05-29). "The Indian Navy is preparing to commission the second of its new nuclear-powered ballistic missile submarines". Zona Militar (in స్పానిష్). Retrieved 2024-05-29.
- ↑ "India commissions INS Arighat: Know all about Navy's 2nd nuclear-powered submarine". The Times of India. 2024-08-29. ISSN 0971-8257. Retrieved 2024-08-29.
- ↑ "INS Arighaat: All About India's 2nd Nuclear Ballistic Submarine". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-29.
- ↑ "Second Arihant-Class submarine 'INS Arighaat' commissioned into Indian Navy in the presence of Raksha Mantri in Visakhapatnam". Press Information Bureau. 2024-08-29. Retrieved 2024-08-30.
- ↑ "INS Arighaat fitted with 3,500 km strike range missiles, 70 pc indigenous content". ANI. 2024-09-06. Retrieved 2024-09-07.