కె-4 అణ్వాయుధ యుత, మధ్యంతర పరిధి, జలాంతర్గామి ప్రయోగిత,  బాలిస్టిక్ క్షిపణిభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ క్షిపణిని అరిహంత్ తరగతి జలాంతర్గాముల కోసం అభివృద్ధి చేస్తోంది.[1] ఈ క్షిపణికి 3500 కిమీ పరిధి ఉన్నట్లు తెలుస్తోంది.[2]

అభివృద్ధి మార్చు

INS అరిహంత్ లో అమర్చేందుకు అగ్ని-3 క్షిపణి పొడవును తగ్గించడానికి అనేక సమస్యలు ఎదుర్కొన్నాక, కె-4 అభివృద్ధిని చేపట్టారు. కె-4 పరిధి అగ్ని-3 పరిధికి సుమారుగా సమానం. పొడవు మాత్రం 12 మీటర్లు మాత్రమే ఉంటుంది (అగ్ని-3 పొడవు 17 మీటర్లు). కె-4 కోసం డిజైను చేసిన గ్యాస్ బూస్టర్‌ను 2010 లో సముద్ర గర్భంలో ఒక పాన్‌టూన్ నుండి విజయవంతంగా పరీక్షించారు.[3]

వివరణ మార్చు

ఈ క్షిపణి పొడవు 12 మీ. వ్యాసం 1.3 మీ. బరువు 17 టన్నులు. 2 టన్నుల వార్‌హెడ్‌ను మోసుకు పోగలదు. ఉన్నతమైన కచ్చితత్వాన్ని సాధించడమే ఈ క్షిపణి  లక్ష్యమని DRDO వెల్లడించింది.

పరీక్ష మార్చు

2013 సెప్టెంబరులో ఈ క్షిపణిని సముద్రంలో 50 అడుగుల లోతున ఒక పాన్‌టూన్ పై నుండి పరీక్షించాల్సి ఉంది. కానీ అది పైకి చెప్పని కారణాల వలన ఆలస్యమైంది.[4][5] ఈ కారణాన మొదటి పరీక్ష 2014 మార్చి 24 న విశాఖపట్నం తీరాన 30 మీ లోతున పాన్‌టూన్ పై నుండి పరీక్షించారు. ఆ పరీక్షలో క్షిపణిని 3,000 కిమీ పరిధికి విజయవంతంగా పరీక్షించారు. గ్యా జనరేటరు క్షిపణిని పాన్‌టూన్ పై నుండినీటిపైకి తోసింది. గాల్లోకి లేచిన కె-4 క్షిపణి లక్ష్యం వైపు తిరిగి 3,000 కిమీ దూరం వెళ్ళి, హిందూ మహా సముద్రంలో పడిపోయింది.[6]

2014 మే నాటికి, క్షిపణిని పాన్‌టూన్ లపైనా, జలాంతర్గాముల పైనా పరీక్షించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.[7][8][9][10][dated info]

2016 మార్చి 7 న [11] కె-4 బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో ఒక ప్లాట్‌ఫారంపై నుండి ప్రయోగించారు, అది ఘన విజయం సాధించిందని DRDO వర్గాలు చెప్పాయి,[12] అయితే, ఈ పరీక్ష గురించి DRDO నుండి గాని, భారత ప్రభుత్వం నుండి గానీ అధికారిక ధ్రువీకరణ లేదు.[13]

2016 మార్చి 31 న క్షిపణిని విశాఖపట్నం నుండి 45 నాటికల్ మైల్స్ దూరాన, INS అరిహంత్ నుండి  విజయవంతంగా పరీక్షించినట్లు ఏప్రిల్ లో ప్రకటించారు. క్షిపణిని 20 మీ లోతు నుండి ప్రయోగించగా, 700 కిమీ దూరంలోని లక్ష్యాన్ని చాలా కచ్చితత్వంతో, సున్నా వర్తుల దోష పరిధితో ఛేదించింది.[11][14][15][16][17]

బయటి లింకులు మార్చు

  1. K-4 క్షిపణి పరీక్ష వీడియో

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు వనరులు మార్చు

  1. Diplomat, Ankit Panda, The. "India Inches Closer to Credible Nuclear Triad With K-4 SLBM Test". The Diplomat. Retrieved 2016-03-26.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  2. "India successfully test-fires underwater missile". The Hindu. 27 January 2013. Retrieved 27 January 2013.
  3. The Hindu, DRDO plans another K-15 missile launch
  4. Indian Express, Longest Range Ballistic Missile All Set for Undersea Launch Archived 2016-05-01 at the Wayback Machine, accessed 2015-01-04
  5. "India's K-4 SLBM awaits first launch". Jane's. 27 August 2013. Retrieved 10 December 2013.
  6. Panda, Ankit (May 13, 2014). "India Inches Closer to Credible Nuclear Triad With K-4 SLBM Test". TheDiplomat.
  7. "Success on debut for undersea launch of missile". The Hindu. 8 May 2014. Retrieved 8 May 2014.
  8. "India tests new underwater nuclear missile". The Times of India. 26 March 2014. Retrieved 26 March 2014.
  9. "India tests 3,000 km range n-missile in secret". The Sunday Guardian. 10 May 2014. Archived from the original on 20 మే 2015. Retrieved 11 May 2014.
  10. India’s Nuclear Triad Finally Coming of Age
  11. 11.0 11.1 "EXPRESS EXCLUSIVE: Maiden Test of Undersea K-4 Missile From Arihant Submarine". The New Indian Express. Archived from the original on 2016-04-08. Retrieved 2016-04-12.
  12. "K-4 Missile Test A Roaring Success". The New Indian Express. Archived from the original on 2016-04-20. Retrieved 2016-03-27.
  13. "India successfully tests new K-4 submarine-launched ballistic missile". Naval Technology. Archived from the original on 2016-04-24. Retrieved 2016-04-12.
  14. "India tests most ambitious nuclear missile". indiatoday.intoday.in. Retrieved 2016-04-13.
  15. "Nuclear-capable K-4 ballistic missile tested from INS Arihant - Firstpost". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-04-13.
  16. Diplomat, Ankit Panda, The. "India Successfully Tests Intermediate-Range Nuclear-Capable Submarine-Launched Ballistic Missile". The Diplomat. Retrieved 2016-04-13.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  17. "DRDO's nuclear capable K-4 underwater missile test-fired again, this time from INS Arihant: Report". International Business Times, India Edition (in ఇంగ్లీష్). Retrieved 2016-04-13.