అరిహంత్ తరగతి జలాంతర్గామి
అరిహంత్, అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల తరగతి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికిల్ ప్రాజెక్టు కింద భారత్ ఈ జలాంతర్గాములను తయారుచేస్తోంది. ఈ తరగతి లోని ముఖ్య జలాంతర్గామి INS అరిహంత్‌ను 2009 లో ప్రారంభించారు. విస్తృత సముద్ర పరీక్షల తరువాత, 2016 ఫిబ్రవరి 23 న ఇది ఆపరేషన్‌లకు సిద్ధంగా ఉందని నిర్ధారించారు.[9][10] ఐక్యరాజ్యసమితిభద్రతా మండలి శాశ్వత సభ్యులైన ఐదు కాకుండా, ఇతర దేశాలు తయారుచేసిన మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి, అరిహంత్.[11]
అరిహంత్ తరగతి జలాంతర్గామి చిత్రం
| |
తరగతి అవలోకనం | |
---|---|
పేరు: | అరిహంత్ |
నిర్మాణ సంస్థ: | నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నం[1] |
ఆపరేటర్లు: | Indian Navy |
పనిలో ఉన్న కాలం: | 2016 - ప్రస్తుతం |
నిర్మాణంలో: | 1[2] |
పూర్తైనవి: | 4 |
పనిలో ఉన్నవి: | 2 |
సాధారణ లక్షణాలు | |
రకం: | అణు చోదిత, అణ్వాయుధ సహిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి |
డిస్‌ప్లేస్‌మెంటు: | |
పొడవు: |
అరిహంత్ & అరిఘాత్: 111 మీ. (364 అ.);[5] S-4: 130 మీ. (430 అ.)[5][6] |
బీమ్: | 11 మీ. (36 అ.) |
డ్రాఫ్ట్: | 10 మీ. (33 అ.) |
స్థాపిత సామర్థ్యం: | 1 × ప్రెజరైస్‌డ్ వాటర్ రియాక్టర్[7] *83 MW (111,000 hp) |
ప్రొపల్షన్: | 1 × ప్రొపెల్లర్ షాఫ్ట్ *న్యూక్లియర్ మెరైన్ ప్రొపల్షన్ |
వేఘం: | నీటిపైన: 12–15 knots (22–28 km/h) *నీటి అడుగున: 24 knots (44 km/h) |
పరిధి: | ఆహార సరఫరాల కోసం తప్ప అపరిమితం |
పరీక్షా లోతు: | 300 మీ. (980 అ.) |
Complement: | 95 |
సెన్సార్లు, ప్రాసెసింగ్ వ్యవస్థలు: |
|
ఆయుధాలు: |
|
చరిత్ర
మార్చు1971 డిసెంబరులో, భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అమెరికా, టాస్క్ ఫోర్స్ 74 అనే తన బలగాలను USS ఎంటర్‌ప్రైస్ నాయకత్వంలో బంగాళాఖాతంలో మోహరించింది. భారత్‌ను హెచ్చరించేందుకు అమెరికా ఈ పనిచేసింది.[12][13] దీనికి ప్రతిగా సోవియట్ యూనియన్ అణ్వాయుధాలతో కూడిన తన జలాంతర్గామిని అమెరికా టాస్క్ ఫోర్స్ వెనుకనే పంపించింది.[14] అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ప్రాముఖ్యత ఎంతటిదో ఈ సంఘటనతో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి తెలియవచ్చింది.[15] 1974 నాటి స్మైలింగ్ బుద్ధ అణు పరీక్ష తరువాత, డైరెక్టర్ ఆఫ్ మెరీన్ ఇంజనీరింగ్ (DME) దేశీయ అణు చోదిత వ్యవస్థను నిర్మించడమై, సాధ్యాసాధ్యాల పరిశీలనను చేపట్టారు. (Project 932).[16] అణు జలాంతర్గామికి రూపకల్పన చేసి నిర్మించే, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెస్సెల్ ప్రాజెక్టు 1990 ల్లో రూపుదిద్దుకుంది.[17] 1998 లో నాటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఈ ప్రాజెక్టు ఉనికిని ధ్రువీకరించాడు.[18] ప్రాజెక్టు తొలి ఉద్దేశం, వేగంగా దాడి చేసే అణు చోదిత జలాంతర్గామిని నిర్మించడం. అయితే 1998 అణు పరీక్షల తరువాత, భారత్ మొదటి-దాడి-చెయ్యను విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్టు లక్ష్యాలను మార్చి, బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని నిర్మించాలని నిశ్చయించారు. ఇది భారత అణుత్రయ ప్రణాళికలో ఒక భాగం.[19][20][21]
వివరణ
మార్చుఅరిహంత్ తరగతి జలాంతర్గాములు అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు. వీటి నిర్మాణాన్ని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెస్సెల్ (ATV) ప్రాజెక్టులో భాగంగా చేపట్టారు.[22][23][24][25][26][27] ఇవి భారత్ నిర్మించిన మొదటి అణు చోదిత జలాంతర్గాములు.[28] ఈ జలాంతర్గాములు 112 మీ పొడవు, 11 మీ బీమ్‌తో, 10 మీ డ్రాట్‌తో, 6000 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి సముద్రంలో 300 మీ లోతు వరకు వెళ్తాయి. 95 మంది సిబ్బంది ఉంటారు.[29] ఈ జలాంతర్గాములు 83 మెగావాట్ల ప్రెజరైజ్‌డ్ వాటర్ రియాక్టరుతో నడుస్తాయి. నీటిపైన 12-15 నాట్ల వేగంతోను, నీటి లోపల 24 నాట్ల వేగంతోనూ ప్రయాణిస్తాయి.[29]
ఈ జలాంతర్గాములకు నాలుగు క్షిపణి ప్రయోగ ట్యూబులు ఉన్నాయి. దీనిలో 12 సాగరిక క్షిపణులను గానీ (750 కి.మీ. పరిధి) లేదా 4 K-4 క్షిపణులను గానీ (3,500 కి.మీ. పరిధి) మోహరించవచ్చు.[30][31] ఈ జలాంతర్గాములు రష్యాకు చెందిన అకులా తరగతి జలాంతర్గాముల కోవకు చెందినవి.[29] భారత నావికా దళం తన సైనికులకు అకులా తరగతికి చెందిన INS చక్రలో శిక్షణ ఇస్తుంది..[32][33]
అభివృద్ధి
మార్చుఈ జలాంతర్గాములకు శక్తి, ప్రెషరైస్‌డ్ వాటర్ రియాక్టరు నుండి లభిస్తుంది. ఈ రియాక్టరు హైలీ ఎన్‌రిచ్‌డ్ యురేనియాన్ని ఇంధనంగా వాడుతుంది.[34][35] ఈ రియాక్టరును భాభా అటామిక్ రీసెర్చి సెంటర్ (BARC) రూపకల్పన చేసి, నిర్మించింది. దీన్ని ఇందిరాగాంధి అణు పరిశోధన కేంద్రం, కల్పాక్కం లో నిర్మించారు.[36] ఇందులో రియాక్టరు, నీటి ట్యాంకు, కంట్రోల్ రూము, ఆక్జిలరీ కంట్రోల్ రూము ఉన్నాయి.[37] ప్రోటోటైప్ రియాక్టరు 2003 నవంబరు 11 న క్రిటికల్ స్థితికి చేరింది. 2006 సెప్టెంబరు 22 న అది ఆపరేషన్‌కు సిద్ధమైందని ప్రకటించారు.[15] మూడేళ్ళ పాటు ఈ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పని చేయించాక, అరిహంత్ కోసం రియాక్టరును తయారు చేసారు.[38][39] రియాక్టరు ఉప వ్యవస్థలను విశాఖపట్నం లోని యంత్ర పరీక్షా కేంద్రంలో పరీక్షించారు.[40] జలాంతర్గాములలో ఇంధనాన్ని ఎక్కించడానికి, పాత ఇంధనాన్ని తీసేసేందుకు అవసరమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసారు.[15]
జలాంతర్గామి డిజైను సవివరమైన ఇంజనీరింగును ఎల్ & టి వారి హజీరా నౌకా నిర్మాణ కేంద్రంలో చేసారు.[41] జలాంతర్గామి నియంత్రణ వ్యవస్థలను టాటా పవర్ నిర్మించింది.[42] స్టీమ్ టర్బైన్లు, దానికి సంబంధించిన వ్యవస్థలను వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ సరఫరా చేసింది.[43] 2009 జూలైలో ప్రారంభించాక, మొదటి నౌక, అరిహంత్ అనేకానేక పరీక్షలకు లోనైంది.[44] ప్రొపల్షన్, పవర్ వ్యవస్థలను హై ప్రెషర్ స్టీమ్‌తో పరీక్షించారు. అనేక హార్బరు పరీక్షలు కూడా జరిపారు.[45] 2013 ఆగస్టు 10 న INS అరిహంత్ రియాక్టరు క్రిటికల్ స్థితికి చేరింది.[46][47][48]
ఈ తరగతి లోని నౌకలు
మార్చుఈ తరగతిలో ఎన్ని జలాంతర్గాములను నిర్మిస్తారనేది ఇదమిత్థంగా తెలీదు. మీడియా రిపోర్టుల ప్రకారం 3 నుండి 6 వరకూ నిర్మిస్తారని తెలుస్తోంది.[49][50][51][52][53][54][55] ఈ తరగతిలోని మొదటి జలాంతర్గామి INS అరిహంత్, 2016 ఆగస్టులో కమిషన్ అయింది.[56][57][58] 2018 నవంబరు 5 న అది తన మొదటి నిఘాను పూర్తి చేసింది.[59][60]
2014 డిసెంబరులో రెండవ న్యూక్లియర్ రియాక్టరుపై పని మొదలైంది. 2017 లో ఐఎన్‌ఎస్ అరిఘాత్ తన సముద్ర పరీక్షలను మొదలుపెట్టింది. 2024 ఆగస్టు 29 న దీన్ని నావికా దళానికి అప్పగించారు.[61]
మూడవ జలాంతర్గామి INS అరిదమన్ (S4) ను 2021 నవంబరులో మొదలుపెట్టారు.[62][63] 2024 ఆగస్టు 30 న వెలువడ్డ వార్తల ప్రకారం, మరో ఆరు నెలల్లో దీన్ని కమిషను చేస్తారని వార్తలు వచ్చాయి.[64] ఈ తరగతి లోని నాలుగో జలాంతర్గామిని 2024 అక్టోబరు 16 న జలప్రవేశం చేయించారు.[65]
అరిహంత్ తరువాత తయారయ్యే మూడు నౌకలు అరిహంత్ కంటే పెద్దవి, 8 కె-4 క్షిపణులను మోసుకుపోగలిగే సామర్థ్యంతో, మరింత శక్తివంతమైన అణు రియాక్టరును కలిగి ఉంటాయి.0
అరిహంత్ తరగతి తరువాత మరింత పెద్ద తరగతి నౌకలను తయారు చెయ్యాలనే ప్రణాళిక కూడా ఉంది. ఈ తరగతి జలాంతర్గాములు 12 నుండి 16 బాలిస్టిక్ క్షిపణులను మోహరించగలవు.[66][67]
పేరు | పతాక | నీటిపైకి తేలినపుడు డిస్‌ప్లేస్‌మెంటు | నిర్మాణం మొదలు | జలప్రవేశం | సముద్ర పరీక్షలు
మొదలు |
సముద్ర పరీక్షల
ముగింపు |
కమిషన్ | స్థితి |
---|---|---|---|---|---|---|---|---|
ఐఎన్‌ఎస్ అరిహంత్ | SSBN 80[68] | 6000 టన్నులు | 2004[69] | 2009 జూలై 26 | 2014 డిసెంబరు 13 [70] | 23 February 2016[71] | 2016 ఆగస్టు | పనిలో ఉంది |
ఐఎన్‌ఎస్ అరిఘాత్ | SSBN 81 | 2009[69] | 2017 నవంబరు 19[72][73] | 2018 జనవరి 8[74] | March 2021[75] | 2024 ఆగస్టు 29[76][77] | ||
INS అరిదమన్ (S4) | 7,000 టన్నులు | 2021 నవంబరు 23[78] | 2025 ఫిబ్రవరి (అంచనా.)[79][80] | సముద్ర పరీక్షలు[81] | ||||
S4* (codename)[82] | 2024 అక్టోబరు 16[83] | 2025 (అంచనా.) [79] | జలప్రవేశమైంది | |||||
పేరుపెట్టలేదు (S4**) | ప్రణాళికలో[84] |
టైమ్‌లైన్
మార్చుతేది | ఘటన |
1998 మే 19 | ATV ప్రాజెక్టును అప్పటి రక్షణ మంత్రి ధ్రువీకరించాడు |
2003 నవంబరు 11 | ప్రోటోటైప్ అణు రియాక్టరు క్రిటికల్ అయింది |
2006 సెప్టెంబరు 22 | అణు రియాక్టరు ఆపరేషనుకు సిద్ధమైందని ప్రకటన |
2009 జూలై 26 | INS అరిహంత్ ప్రారంభం |
2013 ఆగస్టు 10 | అరిహంత్ అణు రియాక్టరు క్రిటికల్ అయింది |
2014 డిసెంబరు 13 | INS అరిహంత్ సముద్ర, ఆయుధ పరీక్షలు ప్రారంభం |
2015 నవంబరు 25 | INS అరిహంత్ డమ్మీ B5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. |
2016 మార్చి 31 | క్షిపణిని కె 4 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది |
2016 ఆగస్టు | INS అరిహంత్ కమిషనైంది.[85] |
2017 నవంబరు 19 | INS అరిఘాత్ జలప్రవేశం |
2018 జనవరి 8 | INS అరిఘాత్ సముద్ర పరీక్షలు[86] |
2018 నవంబరు 5 | INS అరిహంత్ తొలి నిఘా పర్యటన ముగించింది[87] |
2021 మార్చి | INS అరిఘాత్ సముద్ర పరీక్షలు ముగిసాయి |
2021 నవంబరు | S4 జలప్రవేశం అయిందని కబుర్లు వచ్చాయి.[88] |
2024 ఆగస్టు 29 | INS అరిఘాత్ అధికారికంగా కమిషనైంది.[89] |
2024 అక్టోబరు 16 | S4* జలప్రవేశం[90] |
2025 ఫిబ్రవరి | S4 కమిషనింగు అయ్యే అవకాశం[91] |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు వనరులు
మార్చు- ↑ "Contract worker killed in accident at navy ship building centre". The Hindu. 8 March 2014. Retrieved 17 March 2016.
- ↑ "Why India needs submarines". The Diplomat. May 2016. Archived from the original on 17 May 2016. Retrieved 17 May 2016.
- ↑ "India reaches milestone with launch of n-powered submarine". DNA. 26 July 2007. Archived from the original on 13 June 2016. Retrieved 24 January 2011.
- ↑ 4.0 4.1 4.2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;India Today3
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 5.0 5.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;NuclearArm
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "H I Sutton - Covert Shores".
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;toi-ntriad
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 8.0 8.1 Pike, John (27 July 2009). "Advanced Technology Vessel (ATV)". globalsecurity.org. Archived from the original on 29 August 2011. Retrieved 24 January 2011.
- ↑ "INS Arihant not to feature at International Fleet Review". The Economic Times. 5 February 2016. Archived from the original on 9 ఫిబ్రవరి 2016. Retrieved 5 February 2016.
- ↑ "India's first nuclear submarine INS Arihant ready or operations, passes deep sea tests". The Economic Times. 23 February 2016. Retrieved 23 February 2016.
- ↑ Marcus, Jonathan (10 August 2013). "Indian-built Arihant nuclear submarine activated". BBC. Retrieved 12 October 2013.
- ↑ "1971 War: How Russia sank Nixon's gunboat diplomacy". in.rbth.com. Archived from the original on 2016-06-13. Retrieved 2016-04-29.
- ↑ "US Fleet in Bay of Bengal: A game of deception". The Daily Star. 2013-12-15. Retrieved 2016-04-29.
- ↑ Krishnan Simha, Rakesh (20 December 2011). "US-Soviet Actions in 1971 Indo-Pakistani War". indrus.in. Indrus.in. Retrieved 22 April 2013.
- ↑ 15.0 15.1 15.2 "Arihant: the annihilator". Indian Defence Review. 25 October 2010. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 8 January 2012.
- ↑ Das, Premvir (30 July 2009). "Project 932". Business Standard. Retrieved 24 April 2013.
- ↑ "India's SNS Project Report". Fas.org. Retrieved 24 April 2013.
- ↑ "George defends position on China". Indian Express. 19 May 1998. Retrieved 24 February 2011.
- ↑ Pike, John. "Advanced Technology Vessel (ATV)". Globalsecurity.org. Archived from the original on 26 December 2010. Retrieved 24 January 2011.
- ↑ "First indigenous nuclear sub is inducted into the navy". DNA. 26 July 2009. Retrieved 24 January 2011.
- ↑ "India's nuclear sub still a distant dream". Rediff. 16 February 2001. Retrieved 24 January 2011.
- ↑ "Indian indigenous nuclear sub to be unveiled on 26 July: report". domain-b.com. 16 July 2009. Retrieved 24 January 2011.
- ↑ "India nuclear sub project near completion". Reuters. 12 February 2009. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 24 January 2011.
- ↑ "PM to launch indigenous nuke submarine by month-end". MSN. 16 July 2009. Retrieved 19 July 2009.[permanent dead link]
- ↑ "Indigenous nuclear submarine goes on trial". The Hindu. Chennai, India. 19 July 2009. Archived from the original on 22 జూలై 2009. Retrieved 19 July 2009.
- ↑ Sud, Hari (14 August 2009). "India's nuclear submarine and the Indian Ocean". upiasia.com. Archived from the original on 28 జూలై 2011. Retrieved 24 January 2011.
- ↑ "India's nuclear submarine dream, still miles to go". Reuters. 31 July 2009. Archived from the original on 25 మే 2011. Retrieved 24 January 2011.
- ↑ "Final test of K-15 ballistic missile on Tuesday". 25 February 2008. Retrieved 24 January 2012.
- ↑ "The secret undersea weapon". India Today. 17 January 2008. Retrieved 8 January 2012.
- ↑ "The secret 'K' missile family". India Today. 20 November 2010. Retrieved 8 January 2012.
- ↑ "Arihant – Advanced Technology Vessel (ATV)". Global Security. Retrieved 8 January 2012.
- ↑ "Leased Russian n-submarine to set sail for India this month end". 15 December 2011. Retrieved 8 January 2012.
- ↑ Pandit, Rajat (17 July 2009). "India set to launch nuclear-powered submarine". Times Of India. Archived from the original on 24 అక్టోబరు 2012. Retrieved 17 March 2016.
- ↑ "High fissile fuel in nuclear submarine lasts long". The Hindu. Chennai, India. 5 November 2009. Archived from the original on 5 నవంబరు 2012. Retrieved 17 March 2016.
- ↑ "INS Arihant is an Indian design: Anil Kakodkar". The Hindu. Chennai, India. 16 August 2009. Archived from the original on 19 ఆగస్టు 2009. Retrieved 17 March 2016.
- ↑ Shekhar, G.C. (3 August 2009). "Unveiled: Arihant's elder brother". Telegraph India. Calcutta, India. Retrieved 17 March 2016.
- ↑ Subramanian, T.S. (2 August 2009). "PWR building shows indigenous capability". The Hindu. Chennai, India. Archived from the original on 8 ఆగస్టు 2009. Retrieved 17 March 2016.
- ↑ Venkatesh, M.R. (2 August 2009). "Arihant propulsion reactor unveiled". Hindustan Times. Retrieved 17 March 2016.[permanent dead link]
- ↑ "Naval Research Board". DRDO. Archived from the original on 16 మార్చి 2016. Retrieved 17 March 2016.
- ↑ "Larsen and Toubro's Contribution to Arihant-class submarine"[permanent dead link] (PDF) (Press release). 26 July 2009.
- ↑ "India's first Indigenous nuclear submarine". Jeywin. Archived from the original on 17 ఫిబ్రవరి 2013. Retrieved 24 April 2013.
- ↑ "Private sector played a major role in Arihant". DNA. 27 April 2009. Retrieved 17 March 2016.
- ↑ "Nuclear submarine Arihant to be fitted with K-15 ballistic missiles". The Hindu. Chennai, India. 27 July 2009. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 17 March 2016.
- ↑ "Home-made nuke sub INS Arihant to be inducted in 2 years". Times of India. 3 December 2009. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 17 March 2016.
- ↑ "K-15 all set to join Arihant". The Hindu. 27 December 2012. Retrieved 17 March 2016.
- ↑ "India's nuclear submarine Arihant flagged off for sea trials". The Economic Times. 13 December 2014. Retrieved 15 December 2014.
- ↑ "INS Arihant sails out of harbour". The Hindu. 13 December 2014. Retrieved 15 December 2014.
- ↑ "Sea trials of Indian Navy's deadliest sub going 'Very Well'". The Diplomat. 31 May 2015. Retrieved 17 March 2016.
- ↑ Brewster, David. "Asia's coming nuclear nightmare". CFTNI. Retrieved 17 March 2016.
- ↑ "Was 2015 a good year for India's defence sector?". Business Standard. 31 December 2015. Retrieved 17 March 2016.
- ↑ "After Arihant, Indian Navy considering n-propulsion for Aircraft Carriers". indiastrategic.in. 31 December 2015. Archived from the original on 19 జనవరి 2016. Retrieved 17 March 2016.
- ↑ "SSBN Arihant Class Submarine". naval-technology.com. Retrieved 17 March 2016.
- ↑ "N-capable Arihant submarine successfully test-fires unarmed missile". Big News. Retrieved 17 March 2016.
- ↑ "Indian Navy soon to be the most formidable submarine force On The Planet". indiatimes.com. Retrieved 17 March 2016.
- ↑ "India to achieve N-arm triad in February". The Times of India. 2 January 2012. Archived from the original on 26 March 2013. Retrieved 17 March 2016.
- ↑ "India set to complete N-triad with Arihant commissioning". The Times of India. Archived from the original on 20 October 2016. Retrieved 2016-10-18.
- ↑ "Satisfied with nuclear sub Arihant trials: Navy Chief". Tribune India. Archived from the original on 4 March 2016. Retrieved 17 March 2016.
- ↑ "Prime Minister felicitates crew of INS Arihant on completion of Nuclear Triad". Press Information Bureau, Government of India. 5 November 2018. Retrieved 2019-09-15.
- ↑ "INS Arihant completes India's nuclear triad, PM Modi felicitates crew". The Economic Times. 2018-11-06. Retrieved 2019-09-15.
- ↑ "INS Arighaat: అణు జలాంతర్గామి.. 'INS అరిఘాత్' జాతికి అంకితం". EENADU. Archived from the original on 2024-08-29. Retrieved 2024-10-30.
- ↑ Unnithan, Sandeep (7 December 2017). "A peek into India's top secret and costliest defence project, nuclear submarines". India Today. Archived from the original on 11 December 2017. Retrieved 11 December 2017.
- ↑ "DRDO on long range Pralay, K5 to stalemate China soon". THE NEW INDIAN EXPRESS. Retrieved 15 December 2018.
- ↑ "Amid China standoff, India set to boost naval power with 3rd N-sub in 6 months". The Times of India. 2024-08-30. ISSN 0971-8257. Retrieved 2024-08-30.
- ↑ Gupta, Shishir (22 October 2024). "India Launches 4th nuclear-missile submarine". Hindustan Times. Retrieved 22 October 2024.
- ↑ "EXPRESS EXCLUSIVE: Maiden Test of Undersea K-4 Missile From Arihant Submarine". The New Indian Express. Archived from the original on 2016-04-08. Retrieved 2016-04-09.
- ↑ Diplomat, Saurav Jha, The. "India's Undersea Deterrent". The Diplomat. Retrieved 2016-04-09.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "20 years after Pokhran II, India makes giant nuclear leap". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-11-06. Retrieved 2018-11-25.
- ↑ 69.0 69.1 Commodore Stephen Saunders, ed. (2016). "India". Jane's Fighting Ships 2016–2017 (119th ed.). Coulsdon: Jane's Information Group. p. 336. ISBN 978-0710631855.
- ↑ "INS Arihant sails out of harbor". The Hindu. 13 December 2014. Retrieved 22 December 2014.
- ↑ Pubby, Manu. "India's first nuclear submarine INS Arihant ready for operations, passes deep sea tests". The Economic Times. Retrieved 2021-09-09.
- ↑ Peri, Dinakar; Joseph, Josy (2017-10-15). "A bigger nuclear submarine is coming". The Hindu. Archived from the original on 3 March 2018. Retrieved 2017-10-15.
- ↑ Bedi, Rahul (2017-12-11). "India quietly launches second SSBN". IHS Jane's Defence Weekly. Archived from the original on 12 December 2017. Retrieved 11 December 2017.
- ↑ Joseph, Dinakar Peri & Josy (2018-01-08). "INS Arihant left crippled after 'accident' 10 months ago". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-09-09.
- ↑ "Vikrant, nuclear submarine commissioning to ring in 75th Independence anniversary celebrations". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-09-09.
- ↑ "Second Arihant-Class submarine 'INS Arighaat' commissioned into Indian Navy in the presence of Raksha Mantri in Visakhapatnam". Press Information Bureau. 2024-08-29. Retrieved 29 August 2024.
- ↑ "India commissions INS Arighat: Know all about Navy's 2nd nuclear-powered submarine". The Times of India. 2024-08-29. ISSN 0971-8257. Retrieved 2024-08-29.
- ↑ "India Quietly Launches 3rd Arihant-class Nuclear-powered Submarine, Can Carry 8 Ballistic Missiles: Report". News18 (in ఇంగ్లీష్). 2021-12-31. Retrieved 2021-12-31.
- ↑ 79.0 79.1 Pubby, Manu (2020-02-21). "India's Rs 1.2 lakh crore nuclear submarine project closer to realisation". The Economic Times. Retrieved 2020-02-23.
- ↑ "Amid China standoff, India set to boost naval power with 3rd N-sub in 6 months". The Times of India. 2024-08-30. ISSN 0971-8257. Retrieved 2024-08-30.
- ↑ "Maiden Test of Undersea K-4 Missile From Arihant Submarine". The New Indian Express. 9 April 2016. Archived from the original on 13 June 2016. Retrieved 1 June 2016.
- ↑ Saurav, Jha. "India's Undersea Deterrent". The Diplomat. Archived from the original on 8 April 2016. Retrieved 2016-04-09.
- ↑ Gupta, Shishir (22 October 2024). "India Launches 4th nuclear-missile submarine". Hindustan Times. Retrieved 22 October 2024.
- ↑ "India gets second nuclear-powered missile submarine, INS Arighaat commissioned". Mint. 29 August 2024. Retrieved 28 September 2024.
- ↑ "India set to complete N-triad with Arihant commissioning". The Times of India. Archived from the original on 20 October 2016. Retrieved 2016-10-18.
- ↑ Pubby, Manu (2017-08-24). "Exclusive: 'Aridaman', India's second nuclear-armed submarine, is ready for launch". ThePrint. Archived from the original on 25 August 2017. Retrieved 2017-08-24.
- ↑ "India's nuclear triad is complete with INS Arihant ending its first deterrence patrol". The Hindu (in Indian English). 2018-11-05. ISSN 0971-751X. Retrieved 2023-03-14.
- ↑ "India Quietly Launches 3rd Arihant-class Nuclear-powered Submarine, Can Carry 8 Ballistic Missiles: Report". News18 (in ఇంగ్లీష్). 2021-12-31. Retrieved 2021-12-31.
- ↑ "Second Arihant-Class submarine 'INS Arighaat' commissioned into Indian Navy in the presence of Raksha Mantri in Visakhapatnam". Press Information Bureau. 2024-08-29. Retrieved 29 August 2024.
- ↑ Gupta, Shishir (22 October 2024). "India Launches 4th nuclear-missile submarine". Hindustan Times. Retrieved 22 October 2024.
- ↑ "Amid China standoff, India set to boost naval power with 3rd N-sub in 6 months". The Times of India. 2024-08-30. ISSN 0971-8257. Retrieved 2024-08-30.