ఐనంపూడి చక్రధర్

ఐనంపూడి చక్రధర్ (1919 - 1998) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యసభ సభ్యులు.

వీరు తెనాలి తాలూకా నేలపాడు లో జన్మించారు. తెనాలిలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడనుండి బర్మా వెళ్ళి 1930 ప్రాంతంలో భారతదేశానికి తిరిగివచ్చి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో చేరారు..

వీరు వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా మొదలైన స్వాతంత్ర్యోద్యమ కార్యక్రమాలలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు.

1945 లో జైలునుండి విడుదలై ఎం. అన్నపూర్ణమ్మ, కె.ఎస్.తిలక్, కోటా జనార్ధనరావు, రత్న సభాపతి, ఎం.వి.సుబ్బారెడ్డి మొదలైన వారితో కలిగి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని బలోపేతం చేశారు. 1950 లో ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ గా ఎన్నికయ్యారు. 1955 లో ఆ పార్టీ చీలిపోయినప్పుడు డాక్టర్ రామమనోహర్ లోహియా పక్షాన నిలిచారు. 1956లో ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కొద్దికాలం అనంతరం వీరు ప్రభునారాయణ సింగ్, జగదీష్ జోషి మొదలైన వారితో కలసి కాంగ్రెస్ లో చేరారు. 1977 లో జనతా పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్లో దాని వ్యాప్తికి కృషిచేశారు. 1979లో జనతా పార్టీ చీలిపోయినప్పుడు చక్రధర్ లోక్ దళ్ లో చేరారు. మాధవరెడ్డి, సత్యనారాయణ రెడ్డి మొదలైన వారితో కలసి తెలుగుదేశం పార్టీ స్థాపనకై ఎన్టీయార్ ను ప్రోత్సహించారు.

దత్తపుత్రిక, అల్లుడితో నివసిస్తూ 1998 అక్టోబరు 2 తేదీన హైదరాబాద్లో పరమపదించారు.