నూనెలో ఐయోడిన్ విలువ

(ఐయోడిన్ విలువ నుండి దారిమార్పు చెందింది)

ఈ పరీక్షా విధానాన్ని నూనెగింజల నుండి నూనెతీయు మిల్లులలో, అలాగే అయిల్ కేకు (oil cakes) లనుండి నూనె తీయు సాల్వెంటు ప్లాంటు పరిశ్రమల్లోని ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు

నూనెను ఉత్పత్తి చెయ్యు పరిశ్రమల వారికి, నూనె యొక్క ఐయోడిన్ విలువ కూడా అవసరమైనదే.నూనె యొక్క ఐయోడిన్/అయోడిన్) విలువ అనగానే నూనెలో ఐయోడిన్ వుంటుందనే భావన కల్గు తుంది.అయితే నూనెలలో ఎటువంటి ఐయోడిన్ సహజంగా వుండదు.అయోడిన్ విలువ అనేది నూనెలోని కొవ్వు ఆమ్లాలలో, అసంతృప్త కొవ్వుఆమ్లాలలోని అసంతృప్త స్దాయిని తెలుపును.ఒక నూనెయొక్క ద్రవీభవన స్థానం దాని యొక్క ఐయోడిన్‌విలువ విలోమ అనుపాతం (inversely proportionate ) లో వుండును. అనగా నూనె ద్రవీభవస్థానం పెరిగే కొలది దాని ఐయోడిన్ విలువ తగ్గును. ద్రవీభవస్దానం తగ్గెకొలది ఐయోడిన్ విలువ పెరుగుతుంది .నూనెలలోని కొవ్వు ఆమ్లాలు హైడ్రోకార్బను సమ్మేళనాలు.అసంతృప్త కొవ్వుఆమ్లాలలో కార్బను-కార్బను మధ్య ద్విబంధాలుండును.సంతృప్త కొవ్వుఆమ్లాలలో ఏకబంధ ముండును. అందు చే అసంతృప్త కొవ్వుఆమ్లాలలో హైడ్రొకార్బను గొలుసులోని హైడ్రొజనుల సంఖ్య, సంతృప్త కొవ్వుఆమ్లాలకన్న తక్కువగా వుండును.హైడ్రోజన్, బ్రోమిన్, ఐయోడిన్ లాంటి హలోజన్ పదార్థాలను అసంతృప్త కొవ్వుఆమ్లాలతో తగు వుష్ణొగ్రతలో జతపరచిన.ఇవి కార్బను-కార్బను మధ్య వున్న ద్విబంధాన్ని తొలగించి ఆస్దానంలో ఇవి చేరిపోవును.నూనెలనుండి వనస్పతి, స్టియరిక్ ఆమ్లం ఉత్పత్తి చేయు వారికి ఐయోడిన్ విలువ తెలియడం చాలా అవసరం. ఐయోడిన్ విలువను బట్టి నూనెకు ఎంత హైడ్రొజను చేర్చాలో తెలుస్తుంది. ప్రయోగశాలలో నూనెకు ఐయోడిన్ చేర్చి ద్విబంధాలను తొలగించి, ద్విబంధాలను తొలగించుటకు అవసర మైన ఇయోడిన్‌ను లెక్కించెదరు. మొదట అసిటిక్ ఆసిడులో విలీనంచేసిన ఐయోడిన్ మోనోక్లొరైడును కావల్సిన దానికన్న అధికంగా నూనెకు చేర్చి, ఐయోడైజెసను చేయుదురు.ఐయోడైజెసను జరుగగా మిగిలిన ఐయోడి న్ మోనోక్లొరైడును 0.1 నార్మాలిటి సోడియం థయోసల్పైట్ నుపయోగించి తెలుసుకొని, దాని ద్వారా ఎంత ఐయోడిన్ చర్యలో వినియోగమైనది లెక్కించెదరు[1] .

ఐయోడిన్ విలువ

మార్చు

నిర్వచనం:వంద గ్రాములనూనె/కొవ్వు చే గ్రహింపబడిన/శోషింపబడిన ఐయోడిన్ గ్రాముల సంఖ్య ఆనూనె/కొవ్వు యొక్క ఐయోడిన్ విలువ.

పరికరాలు

మార్చు

1. ఐయోడిన్/ఎర్లెన్ ఫ్లాస్కు:స్టాపరు/బిరడా ఉంది.250లేదా 500 మి.లీ.పట్టు పరిమాణం ఉంది.

2.బ్యూరెట్:50 మి.లీ.కెపాసిటి ఉంది.

3. పిపెట్: బల్బు పిపెట్,25 మి.లీ.కెపాసిటి ఉంది.

4. కొలజాడి: 25 మి.లీ, 100 మీ.లి.ల కెపాసిటి ఉన్నాయి.

5. ఎనలైటికల్ బ్యాలెన్సు: 200 గ్రాం.ల వరకు తూచునది.0.01మి.గ్రాం.వరకు కచ్చితంగా తూచగల్గినది.

రసాయనాలు

మార్చు

1. సోడియం థయోసల్ఫెట్ ద్రావణం: 0.1 నార్మాలిటి ఉంది.దీని కచ్చితమైన నార్మలిటి పొటాషియం డైక్రోమేట్ చే ధ్రువీకరింపబడి వుండాలి.

2.పొటాషియం ఐయోడైడ్ ద్రావణం: 10 గ్రాం.ల పొటాషియం ఐయోడైడ్ ను 90 మి.లీ.ల డిస్టిల్‍వాటరులో కరగించి తయారు చేసింది.

3. స్టార్చ్ (పిండిపదార్థం) ఇండికెటరు ద్రావణం: 5 గ్రాం.ల శుద్ధమైన పిండి పదార్థం, 0.01 గ్రాం.ల మెర్కురిక్‍ ఐయోడైడ్‌ను 30 మి.లీ.ల చల్లని డిస్టిల్ వాటరులో కరగించి, మెల్లగా దీనిని మరుగుచున్న లీటరువాటరుకు చేర్చి తయారుచేసింది.

4.ఐయోడిన్ మోనోక్లొరైడ్ (విజ్.Wij's) ద్రావణం: 0.2 నార్మాలిటి ఉంది.అయోడిన్ మోనోక్లొరైడ్ ద్రావణాన్నే విజ్ సొల్యూసన్ అనికూడా అంటారు.0.2నార్మాలిటి విజ్ ద్రావంణం రడీమేడ్ గా కూడా ప్రయోగశాల పరికరాలను విక్రయించు వారి వద్ద లభిస్తుంది.లేదా 10 మి.లీ.గ్రాం.ల ఐయోడిన్ మోనోక్లొరైడును 1800 మి.లీ.ల శుద్ధ అసిటిక్‌కు కలిపిబాగా కరిగెలా కలియ పెట్టాలి.పిపెట్ ద్వారా ఈ ద్రావణాన్ని 5 మి.లీ.తీసుకొని దానికి 10 మి.లీ.ల పొటాషియం ఐయోడైడ్ ద్రావణాన్ని కలిపి స్టార్చు ఇండికెటరును కొన్ని చుక్కలు కలిపి 0.1నార్మాలిటి సోడియం థయోసల్పెట్ తో టైట్రెసను చెయ్యాలి.5 మి.లీ.ల విజ్ సొల్యూసన్‌ను టైట్రెసన్/తటస్థికరణం చెయ్యుటకు 9-10 మి.లీ.ల సోడియం థయోసల్ఫెట్ సరిపోవాలి.ఇంతకన్న తక్కువైన విజ్ సొల్యూసన్‌కు కొద్దిగా ఐయోడిన్ మోనోక్లొరైడు కలపాలి.ఎక్కువైనచో విజ్ సొల్యూసన్‌కు అసెటిన్‌ను కలపాలి.

5.కార్బను టెట్రాక్లొరైడు లేదా క్లోరోఫారం:రసాయనికంగా శుద్ధమైనది.

పరీక్షించు విధానం

మార్చు

తేమ మలినాలు తొలగించిన, ఫిల్టరు చెయ్యబడిన/వడకట్టబడిన, బాగా కలియబెట్టబడిన నూనె/కొవ్వును శుభ్రమైన 500 మి.లీ.ల ఐయోడిన్ ఫ్లాస్కులో తూచి తీసుకొవాలి.దానికి 25 మి.లీ.లటెట్రాక్లోరైడ్/క్లోరోఫారాన్ని కలిపి నూనెను అందులో కరగించాలి.ఈ మిశ్రమానికి పిపెట్ ద్వారా 25 మి.లీ.ల విజ్ ద్రావణాన్ని కలపాలి.విజ్ ద్రావణాన్ని కలిపిన వెంటనే పొటాషియం ఐయోడైడ్‌తో తడిపిన స్టాపరు/బిరడాను ఐయోడిన్ ఫ్లాస్కు మూతికి బిగించి.ఫ్లాస్కును వెలుతురులేని ప్రదేశంలో, నాన్ డ్రయింగ్ నూనెలయినచో 30 నిమిషాలు.డ్రయింగ్ నూనెలయినచో ఒకగంటసేపు వుంఛాలి.తరువాత ఫ్లాస్కును బయటకు తీసి ఐయోడిన్ ఫ్లాస్కుకు 10 మి.లీ.ల పొటాషియం ఐయోడైడ్ ద్రావణంను,100 మి.లీ.ల డిస్టిల్ వాటరును చేర్చాలి. అంతకు ముందే 0.1 నార్మాలిటి సోడియం థయోసల్ఫెట్ ద్రావణాన్ని బుడగలు లేకుండ బ్యూరెట్‌లో సున్న స్థానం వరకు నింపి వుంచాలి. అయోడిన్ ఫ్లాస్కును కుడి చేతితో కదుపుచూ, ఎడమచేతితో బ్యూరెట్ కాక్‌ను తిప్పుచూ సోడియం థయోసల్ఫేట్ ద్రావణంతో టైట్రెషను ప్రారంభించాలి. అయొడిన్ ఫ్లాస్కులోని ద్రావణం పసుపు రంగుకు మారే వరకు టైట్రెసను చెయ్యాలి. ఫ్లాస్కులోని ద్రవం పసుపురంగుకు మారగానే కొన్ని చుక్కల స్టార్చు ఇండికేటరును కలిపి మళ్ళి టైట్రెసను మొదలుపెట్టాలి. ఫ్లాస్కులోని ద్రవం నీలిరంగుకు మారగానే వెంటనే టైట్రెసనును ఆపి వేసి బ్యూరెట్ రిడింగును నమోదు చెయ్యాలి. ఇదేసమయంలో మరో ఐయోడిన్ ఫ్లాస్కులో 25 మి.లీ టెట్రాక్లోరైడ్+25 మి.లీ.ల.విజ్ సొల్యూసన్ కలిపి బిరడాబిగించి వెలుతురులేని ప్రదేశంలోవుంచాలి.ఈ అయోడిన్ ఫ్లాస్కులోని ద్రవానికి 10మి.లీ.పొటాషియం ఐయోడైడును,100 మి.లీ.ల డిస్టిల్ వాటరును, కలిపి పైవిధంగా టైట్రెసను చేసి దాని బ్యూరెట్ రీడింగును నమోదు చెయ్యాలి. ఈ రీడింగును బ్లాంక్ (కాలీ) రీడింగ్ అంటారు.

ఐయోడిన్ విలువ సమీకరణ

మార్చు
 

వివరణ

B = బ్లాంక్ టెస్టులో బ్యూరెట్ రిడింగ్, మి.లీ.లలో

S = టెస్ట్ సమయంలో బ్యూరెట్ రిడింగ్, మి.లీ.లలో

N = సోడియం థయోసల్పెట్ నార్మాలిటి

W = పరీక్షించుటకు తీసుకున్న నూనె/కొవ్వు బరువు.

/ =భాగహారపు గుర్తు

మూలాలు

మార్చు

  • B.S.684:1958 Methods of Anylysis Of Oils And Fats.British Standards Institution.