ఐర్లండ్‌లో హిందూమతం
ఐర్లాండ్‌లో హిందూ మతం మైనారిటీ మతం, దేశ జనాభాలో 0.4% మంది హిందువులు. [1] [2] ఇది ఐర్లాండ్‌లో శాతం ప్రకారం వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ మతం. [3] అయినప్పతికీ, దేశంలో గుర్తింపు పొందిన దేవాలయాలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నాయి.
జనాభా వివరాలు
మార్చుసంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
1991 | 0.03% | +0.08% |
2002 | 0.08% | +0.05% |
2006 | 0.14% | +0.06% |
2011 | 0.23% | +0.09% |
2016 | 0.30% | +0.07% |
2020 | 0.40% | +0.10% |
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1991 | 953 | — |
2002 | 3,099 | +225.2% |
2006 | 6,082 | +96.3% |
2011 | 10,688 | +75.7% |
2016 | 14,300 | +33.8% |
2020 | 20,000 | +39.9% |
2016 ఐరిష్ జనాభా లెక్కల ప్రకారం ఐర్లాండ్‌లో 14,300 మంది హిందువులున్నారు. ఇది జనాభాలో 0.30%. [4] [5] [1] ప్యూ రీసెర్చ్, ప్రకారం 2020 లో ఐర్లాండ్ లో 20,000 (0.4%) మంది హిందువులు ఉన్నారు. [6]
2016 ఐరిష్ సెన్సస్‌లో, హిందూ మతం 34% పెరిగి 14000 మందిని అధిగమించింది. ఇది ఇస్లాం కంటే (అదే సమయంలో ఇస్లాం పెరుగుదల 29%) వేగంగా పెరిగింది. [3] హిందూ మతం ఇప్పుడు జనాభాలో 0.3% ఉంది, 25 సంవత్సరాలలో (1991 జనాభా లెక్కల నుండి 2016 జనాభా లెక్కల వరకు) జనాభాలో 10 రెట్లు పెరిగింది. పెంటెకోస్టల్ ను దాటి, హిందూమతం ఇప్పుడు 7వ అతిపెద్ద మతంగా ఉంది. [1]
2016 జనాభా లెక్కల ప్రకారం, ఐర్లాండ్‌లో 87 హరే కృష్ణ అనుచరులు ఉన్నారు. [7] 2011 జనాభా లెక్కల ప్రకారం 91 ఉన్నారు. [8]
వయస్సు, లింగం
మార్చుసాధారణ జనాభాతో పోలిస్తే హిందువుల సగటు వయసు తక్కువ. హిందూ పురుషుల సగటు వయస్సు 29.5, స్త్రీలకు 27.3 ఉండగా, సాధారణ జనాభాలో 36.7, 38.0 గా ఉన్నాయి. 2016లో ప్రతి 100 మంది హిందూ స్త్రీలకు 132 మంది హిందూ పురుషులు ఉన్నారు, ఈ నిష్పత్తి పదేళ్ల క్రితం ఉన్న 157 నుండి పడిపోయింది. [9]
వృత్తి, సామాజిక తరగతి
మార్చుపనిచేసే హిందువుల్లో సగానికి పైగా (50.6%) విస్తృత వృత్తిపరమైన వర్గమైన 'ప్రొఫెషనల్' వర్గంలో ఉన్నారు. మొత్తం హిందూ కార్మికులలో 15.0 శాతం మంది ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నిపుణులు. ఉన్నత సామాజిక తరగతులలో హిందువులు (18.4%), సాధారణ జనాభా (8.1%) కంటే ఎక్కువగా ఉన్నారు, అయితే 40.5 శాతం మంది నిర్వాహక లేదా సాంకేతిక తరగతికి చెందిన వర్గాలలో ఉన్నారు. నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని వృత్తులలో (16.1%, 28.2%) సాధారణ జనాభా కంటే తక్కువ నిష్పత్తిలో హిందువులున్నారు. [9]
జాతీయత, జాతి
మార్చుమొత్తం 41.7 శాతం మంది హిందువులు భారతీయ జాతీయులు. ఇతర జాతులకు చెందిన హిందువుల్లో ఐరిష్ (41.6%), మారిషస్ (6.9%) నేపాలీస్ (3.0%) ఉన్నారు. ఐరిష్ జాతీయత కలిగిన హిందువులలో (5,676 మంది), 35.1 శాతం మంది ఐర్లాండ్‌లోనే జన్మించినవారు. [9]
2011లో 80.4 శాతం ఉన్న హిందువుల్లో 79.5 శాతం మంది ఆసియా (చైనాయేతర) జాతికి చెందిన వారమని చెప్పుకున్నారు.
హిందూ దేవాలయాలు
మార్చురిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లోని ప్రసిద్ధ హిందూ దేవాలయాల జాబితా ఇది.
డొనెగల్
మార్చు- హిందూ దేవాలయం, ఇండియన్ కమ్యూనిటీ సెంటర్, లెటర్‌కెన్నీ, కో. డొనెగల్ [11]
డబ్లిన్
మార్చు- నివేదిత హౌస్ ( రామకృష్ణ మఠం ), డబ్లిన్ [12]
- హరే కృష్ణ కల్చరల్ సెంటర్ ( ఇస్కాన్ ), డబ్లిన్ 1. [13]
- వినాయక దేవాలయం, కింగ్స్‌వుడ్, డబ్లిన్ 24. [14]
- వైదిక్ హిందూ కల్చరల్ సెంటర్ ఐర్లాండ్ టెంపుల్ [15]
మీత్
మార్చు- స్వామినారాయణ్ సంస్థ, ఎన్ఫీల్డ్, కౌంటీ మీత్. [16]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "8. Religion" (PDF). Population 2017. Central Statistics Office. Archived from the original (PDF) on 2017-04-08. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "CSO2017" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Religions in Ireland". globalreligiousfutures.org. Archived from the original on 2019-08-07. Retrieved 2021-12-12.
- ↑ 3.0 3.1 Ghoshal, Arkadev (April 7, 2017). "Hinduism one of the fastest growing religions in Ireland, outpacing Islam". International Business Times, India Edition. Archived from the original on November 1, 2020. Retrieved December 31, 2021.
- ↑ Patsy McGarry (30 March 2012). "Ireland remains overwhelmingly Catholic" (in ఇంగ్లీష్). Dublin. ISSN 0791-5144. Archived from the original on 2012-07-19. Retrieved 2015-06-02.
- ↑ Gillmor, Desmond A. (2006). "Changing religions in the Republic of Ireland, 1991–2002". Irish Geography. 39 (2): 111–128. doi:10.1080/00750770609555871. Archived from the original on 2017-08-31.}}
- ↑ "Religions in Ireland". globalreligiousfutures.org. Archived from the original on 2019-08-07. Retrieved 2021-12-12.
- ↑ "Census finds 2,000 devotees to Star Wars 'Jedi' religion". Independent.ie. Archived from the original on 2021-11-18. Retrieved 2021-12-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-12-31. Retrieved 2022-01-26.
- ↑ 9.0 9.1 9.2 "Religion - Non-Christian". cso.ie/en. Central Statistics Office, Government of Ireland. Archived from the original on 17 October 2017. Retrieved 20 October 2019. Material was copied from this source, which is available under a Creative Commons Attribution 4.0 International License "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-16. Retrieved 2022-01-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link). ఉల్లేఖన లోపం: చెల్లని<ref>
ట్యాగు; "auto" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Diagram". statbank.cso.ie. Archived from the original on 2021-12-31. Retrieved 2021-12-31.
- ↑ "INDIAN COMMUNITY CENTRE - Letterkenny, Co. Donegal". Archived from the original on 28 February 2012. Retrieved 30 August 2017.
- ↑ "Éire Vedanta Society". rkmireland.org (in ఇంగ్లీష్). Retrieved 22 August 2018.
- ↑ "History - Krishna Ireland Dublin Temple". Dublin Krishna Temple (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2017. Retrieved 30 August 2017.
- ↑ "Ireland Ananda Sidhi Vinayaka Temple". www.ivt.ie. Archived from the original on 6 September 2017. Retrieved 30 August 2017.
- ↑ "Essence of Hinduism | Hindu". Hindu.ie. Archived from the original on 2015-05-30. Retrieved 2015-06-02.
- ↑ "BAPS Shri Swaminarayan Mandir". Archived from the original on 2013-06-11.