యునైటెడ్ కింగ్‌డమ్‌లో హిందూమతం
యునైటెడ్ కింగ్‌డమ్‌లో క్రైస్తవం, ఇస్లాం తర్వాత హిందూమతం మూడవ అతిపెద్ద మత సమూహం. దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు 1.5% మంది ఈ మతాన్ని అనుసరిస్తున్నారు. [2] 19వ శతాబ్దం ప్రారంభం నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌లో[గమనిక 1] హిందువుల ఉనికి ఉంది. ఆ సమయంలో భారతదేశం బ్రిటిషు సామ్రాజ్యంలో భాగంగా ఉంది. బ్రిటిషు ఇండియన్ ఆర్మీలో చాలా మంది భారతీయులు, ఎక్కువగా హిందువులు, యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. [3] 2011 జనాభా లెక్కల ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్ లో 8,17,000 హిందువులు (జనాభాలో 1.5%) ఉన్నారు. [4] భారతీయ మూలాలు కలిగిన వారిలో, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందువులు (27%) అవిభక్త భారతదేశంలోని ముస్లింల (57%) తర్వాత రెండవ అతిపెద్ద సమూహంగా ఉన్నారు. 2011 యునైటెడ్ కింగ్‌డమ్ జనాభా లెక్కల ప్రకారం హిందువులు సిక్కులను (14%) మించిపోయారు. [5]
మొత్తం జనాభా | |
---|---|
10,21,000 (2017) ; దేశ జనాభాలో 1.6% | |
మతాలు | |
హిందూమతం | |
గ్రంథాలు | |
భగవద్గీత, పురాణాలు, వేదాలు | |
భాషలు | |
Related ethnic groups | |
సిక్క్లు, బౌద్ధులు |
బ్రిటిషు హిందువులలో ఎక్కువ మంది ప్రధానంగా భారతదేశం నుండి వచ్చిన వలసదారులు. [6] శ్రీలంక (ప్రధానంగా తమిళులు ), [7] నేపాల్ నుండి కూడా గణనీయమైన సంఖ్యలో హిందూ వలసదారులు ఉన్నారు. [8] [9] కొద్ది సంఖ్యలో హిందువులు పాకిస్తాన్, [10] ఆఫ్ఘనిస్తాన్, [11] బంగ్లాదేశ్, [12] [13] భూటాన్ ల నుండి వచ్చారు . [14] ఇటీవలి కాలంలో, ఇస్కాన్, BAPS, ఇతర హిందూ మిషనరీల సమూహాల ప్రయత్నాల కారణంగాను, యోగా, ధ్యానం తదితర హిందూ అభ్యాసాలను సామూహికంగా అనుసరించడం వల్లనూ, అనేక మంది ప్రముఖ అధికారులు, ప్రముఖులతో సహా చాలా మంది బ్రిటిషు పౌరులు హిందూ మతాన్ని స్వీకరించారు. [15] [16]
సంవత్సరం | శాతం | పెంచు |
---|---|---|
1971 | 0.25% | |
1981 | 0.49% | +0.24% |
1991 | 0.69% | +0.20% |
2001 | 0.95% | +0.26% |
2011 | 1.32% | +0.37% |
2017 | 1.60% | +0.23% |
చరిత్ర
మార్చుబ్రిటిషు హిందూ జనాభాలో భారత ఉపఖండం నుండి నేరుగా వచ్చిన వారు, గతంలో ఇతర దేశాలకు వలస వెళ్లి, ఆ తరువాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో పునరావాసం పొందిన హిందువుల వారసులూ, UKలో పుట్టి పెరిగిన వారూ ఉన్నారు. UKలో మూడవ లేదా నాల్గవ తరం హిందువులు కనిపించడం అసాధారణం కాదు.
UKలో హిందువుల వలసల్లో మూడు ప్రధాన తరంగాలు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా వరకు హిందూ వలసలు జరిగాయి. [17] 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం, దేశ విభజన సమయంలో మొదటి తరంగం వచ్చింది. అలాగే, 1960ల ప్రారంభంలో కన్జర్వేటివ్ ఆరోగ్య మంత్రి Rt హాన్ ఎనోచ్ పావెల్ భారత ఉపఖండం నుండి పెద్ద సంఖ్యలో వైద్యులను నియమించాడు. [18] రెండవ తరంగం 1970లలో ప్రధానంగా తూర్పు ఆఫ్రికా నుండి, ముఖ్యంగా ఉగాండా నుండి, ఆసియన్లను బహిష్కరించడం వలన సంభవించింది. [17] [19] ఆ తరువాత గయానా, ట్రినిడాడ్ టొబాగో, మారిషస్, ఫిజీకి చెందిన వారు కూడా వచ్చారు. వలసల మూడవ తరంగం 1990లలో ప్రారంభమైంది. యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క ఇమ్మిగ్రేషన్ విధానం ఫలితంగా ఇది ఏర్పడింది. ఇది UK లో చదువుకోడానికి వచ్చే వలసలను సులభతరం చేసింది. ఈ తరంగంలో శ్రీలంక నుండి తమిళ శరణార్థులు, భారతదేశానికి చెందిన వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లతో సహా నిపుణులు కూడా ఉన్నారు. [17]
జనాభా వివరాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1961 | 30,000 | — |
1971 | 1,38,000 | +360.0% |
1981 | 2,78,000 | +101.4% |
1991 | 3,97,000 | +42.8% |
2001 | 5,58,810 | +40.8% |
2011 | 8,35,394 | +49.5% |
2017 | 10,21,000 | +22.2% |
ఇంగ్లండ్ జనాభాలో 1.5% మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. హిందువులు స్కాట్లాండ్‌లో 0.31%, [20] వేల్స్‌లో 0.34% ఉన్నారు. [21] డయాస్పోరా కారణంగాను, సగటు కంటే ఎక్కువ సంతానోత్పత్తి వలన, హిందూ మతంలోకి జరిగిన మతమార్పిడుల వలనా ఇంగ్లాండ్ & వేల్స్‌లో హిందూ జనాభా గణనీయంగా పెరిగింది.
2011 జనాభా లెక్కల ప్రకారం, UKలో నివసిస్తున్న 8,17,000 మంది హిందువులలో దాదాపు సగం మంది లండన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. [22] బ్రిటిషు హిందువుల్లో దాదాపు 3,00,000 మంది UKలో జన్మించినవారు. [17]
సంవత్సరం | హిందువుల సంఖ్య | ఇంగ్లాండ్, వేల్స్ జనాభా | హిందువులు
(జనాభాలో%) | |
---|---|---|---|---|
1961 | 30,000 | 4,61,96,000 | - | </img> |
1971 | 1,38,000 | 4,91,52,000 | 0.24% | |
1981 | 2,78,000 | 4,96,34,000 | 0.49% | |
1991 | 3,97,000 | 5,10,99,000 | 0.69% | |
2001 | 5,58,810 | 5,20,42,000 | 0.95% | |
2011 | 8,35,394 | 5,60,76,000 | 1.32% | |
2017 (అంచనా) | 10,21,000 | – | 1.60% |
UKలో హిందువుల జనాభా ప్రధానంగా పట్టణాల్లో ఉన్నారు. వృత్తిపరమైన, నిర్వాహక స్థానాల్లో సాపేక్షంగా వీరి సంఖ్య అధికంగా ఉంది. [23]
జీవితం, సంస్కృతి
మార్చుసంఘం, సామాజిక జీవితం
మార్చుయునైటెడ్ కింగ్‌డమ్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2011లో బ్రిటన్‌లో ఉన్న అన్ని జాతి మైనారిటీలలో, బ్రిటిషు హిందువులు అత్యధిక స్థాయి ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు, [24] 2006లో వీరి సగటు నికర సంపద GB£ 2,06,000 (బ్రిటిషు క్రైస్తవుల్లో ఇది GB£ 2,23,000 [25] సాధారణ జనాభా కంటే హిందూ పురుషులు వ్యాపారవేత్తలుగా ఉంటారు. ఉన్నత విద్యను కలిగి ఉన్న హిందూ పురుషులు, మహిళలు ఇద్దరూ కూడా సాధారణ జనాభా కంటే పై స్థాయిలో ఉన్నారు. [23] 20-సంవత్సరాల కాలంలో, బ్రిటిషు హిందువులు అత్యల్ప పేదరికంలో మూడవ స్థాయిలో (బ్రిటిషు క్రిస్టియన్, బ్రిటిషు యూదుల తర్వాత) ఉన్నారు. [26] అరెస్టులు, విచారణ లేదా జైలు శిక్షల్లో UK న్యాయ మంత్రిత్వ శాఖ ట్రాక్ చేసిన అన్ని జాతుల లోనూ హిందువులు రెండవ అత్యల్ప స్థాయిలో (0.5%) ఉన్నారు. [27] బ్రిటన్‌లోని మొత్తం జైలు జనాభాలో హిందువులు 0.5% కంటే తక్కువ ఉన్నారు (క్రైస్తవులు 48%, ముస్లింలు 15%). [28]
దేవాలయాలు, సంస్థలు
మార్చుయునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందువులలో గణనీయమైన భాషా, థియోసాఫికల్ వైవిధ్యాలు ఉన్నాయని డెర్బీ విశ్వవిద్యాలయ నివేదిక పేర్కొంది, అయినప్పటికీ వారు హిందూమతపు ప్రధాన నమ్మకాలు, ఆచారాలు, పండుగలను అందరూ జరుపుకుంటారు. [29]
UK-వ్యాప్త హిందూ సంస్థలలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హిందూ టెంపుల్స్, హిందూ కౌన్సిల్ UK, హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్-UKలోని హిందువుల కోసం జాతీయ ఛత్ర సంస్థలు ఉన్నాయి. [30] నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హిందూ టెంపుల్స్ UK, దేశ-వ్యాప్త హిందూ సంస్థ. దీనికి 300 పైగా హిందూ దేవాలయాలు, హిందూ విశ్వాస సంస్థలు ఉన్నాయి. [30] [31] హిందూ కౌన్సిల్ UK, దాదాపు 400 అనుబంధ సాంస్కృతిక, మత సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది [30] [32] హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్ కు దాదాపు 300 సభ్య సంస్థలున్నాయి . [30] [33]
UKలో ది హిందూ కౌన్సిల్ ఆఫ్ బర్మింగ్‌హామ్ వంటి కమ్యూనిటీ ఈవెంట్‌లు, సామాజిక వ్యవహారాలను నిర్వహించే ప్రాంతీయ సంస్థలు ఉన్నాయి. [34]
2012లో UKలో 150కి పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి [35] ఒక్క లండన్ ప్రాంతంలోనే 30 దేవాలయాలు ఉన్నాయి. [36] స్లౌ హిందూ దేవాలయాన్ని స్లౌ హిందూ కల్చరల్ సొసైటీ నిర్మించింది. దీన్ని 1981లో అధికారికంగా ప్రారంభించారు. ఇది బ్రిటిషు దీవులలో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయం. అయితే, UKలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని 1920ల చివరలో లండన్‌లోని ఎర్ల్స్ కోర్ట్ సమీపంలో ప్రారంభించారు. ఇది దాదాపు నాలుగు సంవత్సరాలు పనిచేసింది. [37] 2020లో, హిస్టారిక్ ఇంగ్లండ్ (HE) ఇంగ్లాండ్‌లో హిందువులు ఉపయోగించే భవనాల గురించి సమాచారాన్ని అందించే లక్ష్యంతో ఇంగ్లాండ్‌లోని హిందూ భవనాల సర్వేను ప్రచురించింది. తద్వారా ఇప్పుడూ భవిష్యత్తులోనూ ఆ భవనాలను మెరుగుపరచడానికీ, రక్షించడానికీ హిస్టారిక్ ఇంగ్లండ్, వివిధ సంఘాలతో కలిసి పని చేయవచ్చు. స్కోపింగ్ సర్వే ఇంగ్లాండ్‌లో 187 హిందూ దేవాలయాలున్నట్లు గుర్తించింది. [38]
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్), నీస్డెన్ (గ్రేటర్ లండన్)లోని స్వామినారాయణ్ (BAPS) , చిన్మయ మిషన్, రామకృష్ణ మిషన్, సాయి ఆర్గనైజేషన్ వంటి అనేక హిందూ సంస్థలు UKలో ఉన్నాయి. వీటికి పెద్దయెత్తున అనుచరులు ఉన్నారు. శ్యామ్ అనే హిందూ విద్యా సంస్థ భగవద్గీత, రామాయణం, శ్రీమద్ భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులను బోధిస్తుంది. [39] UKలో కనిపించే ప్రధానమైన హిందూ విశ్వాసాలలో దాని వేదాంత, వేదాంత ఏకేశ్వరవాదం, వివిధ సంప్రదాయాలూ ఉన్నాయి. [40] UKలోని హిందువులలో 1% కంటే లోపే తాము డివైన్ లైఫ్ సొసైటీ, హరే కృష్ణ, ఇతర సంస్థలకు చెందిన వారిగా చెప్పారు. [41]
పండుగలు, సామాజిక కార్యక్రమాలు
మార్చుయునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందువులు దీపావళి వంటి ప్రధాన పండుగలను జరుపుకుంటారు. [42] గృహాలు, వ్యాపారాలను దీపాలతో అలంకరిస్తారు. హిందువులు లడ్డూ, బర్ఫీ వంటి స్వీట్లను బహుమతిగా అందిస్తారు. నృత్యాలు, పార్టీలు వంటి కమ్యూనిటీ ఈవెంట్‌లు హిందువులను, హిందువేతరులను ఏకతాటిపైకి తీసుకువస్తాయి. భారతదేశం వెలుపల జరిగే అతిపెద్ద దీపావళి వేడుక, లీసెస్టర్లో ఏటా జరుగుతుంది. [43]
హిందూ పండుగ దీపావళి, పెద్దయెత్తున బ్రిటిషు కమ్యూనిటీ ఆమోదం పొందడం ప్రారంభించింది. [44] [45] నీస్డెన్‌లోని స్వామినారాయణ దేవాలయం వంటి కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాలలో జరిగిన దీపావళి వేడుకలకు ప్రిన్స్ చార్లెస్ హాజరయ్యాడు. [46] [47] [48] 2009 నుండి, దీపావళిని ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో జరుపుకుంటారు. [49] [50]
హిందూ కౌన్సిల్ UK
మార్చుహిందూ కౌన్సిల్ UK యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్న హిందువుల కోసం ఒక ఛత్ర సంస్థ. జాతీయ స్థాయిలో ప్రభావశీలురైన హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక సమూహాలలో ఇది ఒకటి. [51] [30] దీన్ని 1994లో ఏర్పాటు చేసారు. కౌన్సిల్ యొక్క అప్పటి ప్రధాన కార్యదర్శి ప్రకారం, దీన్ని స్థాపించినప్పుడు అది సంఘ్ పరివార్ నుండి వ్యతిరేకతను ఎదుర్కొంది. [51] UKలో కులం ప్రజా జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో అన్వేషించడానికి ఇది డిపార్ట్‌మెంట్ ఫర్ కమ్యూనిటీస్ అండ్ లోకల్ గవర్నమెంట్‌తో కలిసి పనిచేసింది. [51] దాని వెబ్‌సైట్‌లో మత మార్పిడిపై జరిగిన చర్చ, హిందూ జాతీయవాద దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వహిందూ పరిషత్ కు చెందినవారు ఇందులో పాల్గొన్నారు. [51]
జాతి
మార్చుజనాభా లెక్కల ప్రకారం, ఇంగ్లాండ్, వేల్స్‌లోని హిందువుల్లో 95.6% మంది జాతిపరంగా ఆసియావారు, మిగిలిన వారిలో 4.4% మంది ఈ క్రింది విధంగా ఉన్నారు: తెలుపు 1.47%, మిశ్రమ 1.19%, నలుపు 0.67%, ఇతర జాతులు 1% (0.13% అరబ్బులతో సహా ) [52]
ఆసియా
మార్చుయునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందువులలో చాలా ఎక్కువ భాగం ఆసియాకు చెందినవారు, ప్రధానంగా భారతీయులు. వీరు ఉపాధి కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌కు వలస వచ్చినవారు లేదా పేదరికం, వివక్ష, హింస కారణంగా ఆశ్రయం పొందినవారు. [53]
హిందూమతం లోకి మతమార్పిళ్ళు
మార్చుహిందూ మతంలోకి మారిన ప్రసిద్ధ వ్యక్తులు:
- బ్రిటిషు సెలబ్రిటీ, రస్సెల్ బ్రాండ్ హిందూ మతంలోకి మారాడు. [54]
- బీటిల్స్ యొక్క ప్రధాన గిటారిస్ట్, జార్జ్ హారిసన్ 1960ల మధ్యలో హిందూ మతంలోకి మారాడు. 2001లో ఆయన మరణించిన తర్వాత, ఆయన హిందూ సంప్రదాయాల ప్రకారం దహనం చేసారు. అతని చితాభస్మాన్ని గంగా నదిలో కలిపారు. [55]
- తత్వవేత్త జాన్ లెవీ కూడా హిందూ మతంలోకి మారాడు.
- నవలా రచయిత క్రిస్టోఫర్ ఇషెర్‌వుడ్, హిందూమతంలోకి మారాడు. మరణించే వరకు హిందువుగానే ఉన్నారు. [56]
- హిందూ పండితుడు కృష్ణ ధర్మ (గతంలో కెన్నెత్ ఆండర్సన్), 1979లో హిందూ మతంలోకి మారాడు.
- సెప్టెంబర్ 2006లో, రెవ. డేవిడ్ ఆనంద హార్ట్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో పూజారిగా ఉంటూనే హిందూ మతంలోకి మారినప్పుడు ముఖ్యాంశాలుగా నిలిచాడు. [57]
రాజకీయం
మార్చు2017 సాధారణ ఎన్నికలలో ఎనిమిది మంది హిందూ ఎంపీలు (ఐదుగురు కన్జర్వేటివ్, ముగ్గురు లేబర్ ) పార్లమెంటుకు ఎన్నికయ్యారు. [58]
వివాదాలు
మార్చువివక్ష, స్టీరియోటైపింగ్
మార్చుయునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందూ సమూహాలు, సంస్థలు ఒక క్రమబద్ధమైన ప్రతికూలతను వివక్షనూ ఎదుర్కొంటున్నాయని రన్‌నిమీడ్ ట్రస్ట్‌కు చెందిన రాబర్ట్ బర్కిలీ రచించిన నివేదిక పేర్కొంది. [23] వారు రోజువారీ జీవితంలోను, మీడియా ద్వారానూ అసమానతను, లక్ష్యంగానూ, మూస విమర్శనూ ఎదుర్కొంటారు. దీనివలన హిందూ సమాజం ఒంటరై పోయి, ఇతర వర్గాలతో కలవడానికీ లేదా వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోడానికీ సామర్థ్యం వారికి లేకుండా పోయింది. [23] [59]
యునైటెడ్ కింగ్‌డమ్ లోను, యూరప్‌లోనూ హిందూ సమాజం స్థానిక ప్రభుత్వాలు అనుసరించే వలస విధానాలలో వివక్షను ఎదుర్కొంటోందని పండితులు పేర్కొన్నారు. [60] [61] స్థానిక కౌన్సిల్‌లలో, హిందూ దేవాలయాలు, కమ్యూనిటీ కేంద్రాల నిర్మాణ లేదా విస్తరణ అనుమతులు సంవత్సరాల పాటు తిరస్కరించబడుతూ ఉంటాయి. అదే సమయంలో ముస్లిం మసీదులు, క్రైస్తవ చర్చిలు మాత్రం అదే కౌన్సిల్‌ల ఆమోదం పొంది నిర్మించబడుతూంటాయి. [62] బ్రిటన్‌లోని స్థానిక కౌన్సిల్ అధికారుల నుండి హిందూ సంఘాలు ఎదుర్కొంటున్న వివక్షను పాల్ వెల్లర్ ఈ విధంగా వివరించాడు,
“ | పరిసరాల్లోని ట్రాఫిక్, పార్కింగ్ అంశాలను సమస్యలుగా చెబుతూంటారు. ఉదాహరణకు, హిందూ సమాజానికి చెందిన ఒక నాయకుడు మాతో మాట్లాడుతూ, సంవత్సరంలో ఒకటి రెండు సార్లు జరిగే పండుగల సమయంలో కూడా ఆలయం వెలుపల పార్కింగ్ చేయడానికి తన ఆలయానికి అనుమతి గానీ, స్థలం గానీ ఇవ్వలేదని చెప్పాడు. దీనికి విరుద్ధంగా, స్థానిక మసీదు కోసం ప్రతి శుక్రవారం పార్కింగ్ పరిమితులను ఎత్తివేయడాన్ని మా దృష్టికి తీసుకువచ్చాడు. ఇది అన్యాయమని అన్నాడు. మరొక ఫీల్డ్ రీసెర్చ్ ప్రదేశంలో ఉన్న ఒక హిందూ మహిళ, తన స్థానిక దేవాలయం పొడిగింపుకు, కార్ పార్కింగ్‌ని నిర్మించడానికి ప్రణాళిక అనుమతిని పొందడంలో ఎదురైన సమస్యలను వివరించింది. "ప్రతీ రోడ్డు పక్కనా" మసీదు నిర్మించడానికి అనుమతులు పొందిన ముస్లింల అనుభవంతో ఆమె దీన్ని పోల్చి చెప్పింది. | ” |
బ్రిటిషు పాఠశాలల్లో దాదాపు 50% మంది హిందూ బాల బాలికలు, హిందువులైన కారణంగా బెదిరింపులకు గురవుతున్నట్లు చెప్పారు. [64] [65] అయితే, క్లైర్ మాంక్స్ అదితరులు. వివిధ జాతులు మతాలకు చెందిన పిల్లలు కూడా బ్రిటిషు పాఠశాలల్లో బెదిరింపులకు గురవుతున్నారని అన్నారు. [66]
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందూ సమాజం వివక్షకు, స్టీరియోటైపింగుకూ ప్రత్యేకమైనదేమీ కాదు. [23] యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చిన్న యూదు సంఘం, చాలా పెద్ద ముస్లిం సమాజం కూడా ఇటీవలి సంవత్సరాలలో ఇలాంటి ఆందోళనలను వ్యక్తం చేసాయి. మతపరమైన వివక్షను అర్థం చేసుకోవడానికి, ఎదుర్కోవడానికీ కొత్త చట్టం, సంస్థల అవసరం గురించి బ్రిటిషు రాజకీయ నాయకులు చర్చిస్తున్నారు. [23] [67]
బ్రిటన్‌లోని ప్రైవేట్ గోల్ఫింగ్, కంట్రీ క్లబ్‌లు, ఇతర సామాజిక క్లబ్‌లు సాధారణంగా హిందువులతో పాటు సిక్కులు, ముస్లింలు, మహిళలు, ఆఫ్రికన్‌లు, ఇతర మైనారిటీల పట్ల పట్ల వివక్ష చూపుతున్నాయి, ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి. [68] దీన్ని నివారించేందుకు 1998లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో చట్టాన్ని ఆమోదించారు. [69] [70] 2005 జూలై 7 లండన్ బాంబు దాడుల తర్వాత వచ్చిన బ్యాక్‌లాష్‌లో, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సిక్కులతో పాటు హిందువులను ముస్లింల కంటే ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారు. [71]
2018 అక్టోబరులో, కన్జర్వేటివ్ పార్టీ (UK) లండన్ మేయర్ అభ్యర్థి షాన్ బెయిలీ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ కోసం నో మ్యాన్స్ ల్యాండ్ అనే కరపత్రాన్ని వ్రాసినట్లు నివేదించబడింది. అందులో, హిందువుల ఉనికి "బ్రిటన్ కమ్యూనిటీని ఆక్రమిస్తోంది" అని దేశాన్ని "నేర పూరితమైన పెంటదిబ్బ"గా మారుస్తోందనీ బెయిలీ వాదించాడు. దక్షిణాసియన్లు "తమతో పాటు తమ సంస్కృతిని, తమ దేశాన్ని, అక్కడ ఏవైనా సమస్యలుంటే వాటినీ తీసుకువస్తార"ని, నల్లజాతి సమాజంలో ఇది సమస్య కాదనీ ఎందుకంటే "తామంతా ఒకే మతాన్ని, చాలా సందర్భాల్లో ఒకే భాషనూ ఆచరిస్తామనీ" కూడా అతను పేర్కొన్నాడు. [72] కరపత్రంలో, బెయిలీ హిందూ మతాన్ని, హిందీ భాషనూ కలగలిపి గందరగోళపరిచాడు: "ఏం చేయాలో తెలియకుండా పోతోంది. మీరు మీ పిల్లలను పాఠశాలకు తీసుకొస్తారు.. వాళ్ళేమో క్రిస్మస్ కంటే ఎక్కువగా దీపావళి గురించి నేర్చుకుంటారు. నేను బ్రెంట్ కు చెందిన వ్యక్తులతో మాట్లాడుతున్నాను.., వారు హిందీ (sic) రోజుల్లో సెలవు తీసుకుంటారు." అని రాసుకుపోయాడు. [73] కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ ఛైర్మన్, జేమ్స్ క్లవర్లీ, బెయిలీని సమర్థించాడు. అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నారనీ నల్లజాతి అబ్బాయిలు "వారి స్వంత క్రైస్తవ సంస్కృతి" కంటే ఎక్కువగా హిందూ మతం గురించి నేర్చుకోవడం వల్ల నేరాలలోకి కూరుకుపోతున్నారని బెయిలీ సూచిస్తున్నాడనీ అతడు నొక్కి చెప్పాడు. [74] అయితే, జాత్యహంకార వ్యతిరేక <i>హోప్ నాట్ హేట్</i> ప్రచార బృందం బెయిలీ వ్యాఖ్యలను "వికృతమైనవి" అని పేర్కొంది. [75] ఈ వ్యాఖ్యలను యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందూ కౌన్సిల్ ఖండించింది. బెయిలీ "మా మతాన్ని తప్పుగా సూచించడం పట్ల నిరాశ" వ్యక్తం చేసింది. [76]
బ్రిటిషు ఓవర్సీస్ టెరిటరీలు
మార్చుభూభాగం | శాతం | Ref. |
---|---|---|
అంగీలా | 0.42% | [77] |
బెర్ముడా | 0.2% | [78] |
బ్రిటిషు వర్జిన్ దీవులు | 1.88 % | [79] |
కేమాన్ దీవులు | 0.8% | [80] |
జిబ్రాల్టర్ | 2% | [81] |
మోంట్సెరాట్ | 0.8% | [82] |
టర్క్స్, కైకోస్ దీవులు | తెలియదు | [83] |
ఇవి కూడా చూడండి
మార్చుగమనిక
మార్చు- ↑ యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లండ్‌లో నాలుగు దేశాలు భాగంగా ఉన్నాయి - ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లండ్, ఉత్తర ఐర్లండ్. ఐదు వందల ఏళ్ళ పాటు జరిగిన వివిధ విలీనాలతో ఈ సామ్రాజ్యం ఏర్పడింది. 1536 లో ఇంగ్లాండ్, వేల్స్ కలిసి ఒకే రాజ్యంగా - "కింగ్‌డం ఆఫ్ ఇంగ్లండ్"గా రూపొందాయి. ఆ తరువాత, 1707 లో స్కాట్లండ్ కూడా కలిసి మూడు దేశాలతో "కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్" ఏర్పడింది. 1901 లో ఐర్లండ్ కూడా కలిసి "యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లండ్" ఏర్పడింది. అయితే, 1922 లో ఐర్లండ్ రెండు ముక్కలై ఒక భాగం స్వతంత్ర ఐర్లండ్ దేశంగా ఏర్పడగా, రెండవ భాగమైన ఉత్తర ప్రాంతం - ఉత్తర ఐర్లండు - యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగంగానే ఉండిపోయింది. అప్పుడు దేశం పేరు "యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లండ్" గా మారింది. ఇదే ప్రస్తుత రూపం.
మూలాలు
మార్చు- ↑ "Archived copy" (PDF). media.johnwiley.com.au. Archived from the original (PDF) on 20 October 2013. Retrieved 12 January 2022.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "CT0341 2011 Census - Religion by ethnic group by main language - England and Wales". ONS. National Archives, Government of the United Kingdom. Archived from the original on 5 January 2016. Retrieved 10 June 2021.
- ↑ Tong, Junie T. (2016-04-15). Finance and Society in 21st Century China: Chinese Culture versus Western Markets (in ఇంగ్లీష్). CRC Press. pp. 151–152. ISBN 978-1-317-13522-7.
- ↑ UK Government (27 March 2009). "Religion in England and Wales 2011". Office of National Statistics (11 December 2012). Retrieved September 7, 2014.
- ↑ "2011 Census: KS209EW Religion, local authorities in England and Wales (Excel sheet 270Kb)" (xls). Office for National Statistics. Retrieved 7 July 2014.
- ↑ "UK-based Hindu groups call upon Prime Minister Boris Johnson to act against persecution of Hindus in Pakistan". The Times of India (in ఇంగ్లీష్). 13 January 2021. Retrieved 2021-06-10.
- ↑ Aspinall, Peter J. (2019-01-02). "The Sri Lankan community of descent in the UK: a neglected population in demographic and health research". South Asian Diaspora. 11 (1): 51–65. doi:10.1080/19438192.2018.1505065. ISSN 1943-8192.
- ↑ "From Kathmandu to Kent: Nepalis in the UK". Himal Southasian (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2014-12-26. Retrieved 2021-06-10.
- ↑ Pariyar, Mitra (2020-06-01). "Caste, military, migration: Nepali Gurkha communities in Britain". Ethnicities (in ఇంగ్లీష్). 20 (3): 608–627. doi:10.1177/1468796819890138. ISSN 1468-7968.
- ↑ Payne, J. D. (2012-09-02). Strangers Next Door: Immigration, Migration and Mission (in ఇంగ్లీష్). InterVarsity Press. p. 184. ISBN 978-0-8308-6341-9.
- ↑ Jan 13, Yudhvir Rana; 2019; Ist, 15:05. "UK government to obtain inputs from Afghan Sikh and Hindu's for processing their asylum applications". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-10.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Bangla Stories - Bengali Hindu Migrant: Ashim Sen - Bradford". www.banglastories.org. Retrieved 2021-06-10.
- ↑ "London Kalibari – London Kalibari" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-10.
- ↑ "The ethnic cleansing hidden behind Bhutan's happy face-World News, Firstpost". Firstpost. 2013-07-01. Retrieved 2021-06-10.
- ↑ Berg, Travis Vande; Kniss, Fred (2008). "ISKCON and Immigrants: The Rise, Decline, and Rise Again of a New Religious Movement". The Sociological Quarterly. 49 (1): 79–104. doi:10.1111/j.1533-8525.2007.00107.x. ISSN 0038-0253. JSTOR 40220058.
- ↑ "At 47%, Hinduism biggest gainer in religious conversion in Kerala". The New Indian Express. Retrieved 2021-06-10.
- ↑ 17.0 17.1 17.2 17.3 Fredman, Sandra (2011). Discrimination law. Oxford England New York: Oxford University Press. p. 81. ISBN 978-0-19-958442-0.
- ↑ 'Enoch Powell was not an out-and-out racist'
- ↑ "Uganda: The Legacy of Idi Amin's Expulsion of Asians in 1972". International Business Times. 2012-03-13. Retrieved 2021-06-10.
- ↑ "2011 Census: Key Results from Releases 2A to 2D". Scotland's Census (in ఇంగ్లీష్). Retrieved 2021-06-11.
- ↑ ONS (2010-07-02). "Release Edition Reference Tables". webarchive.nationalarchives.gov.uk. Archived from the original on 2016-01-07. Retrieved 2021-04-24.
- ↑ "Home - Office for National Statistics". www.ons.gov.uk. Retrieved 2021-04-24.
- ↑ 23.0 23.1 23.2 23.3 23.4 23.5 Robert Berkeley, Connecting British Hindus - An enquiry into the identity and public policy engagement of British Hindus Archived 2016-04-14 at the Wayback Machine Runnymede Trust, Hindu Forum of Britain (2006)
- ↑ Full story: What does the Census tell us about religion in 2011?
- ↑ Karen Rowlingson, Policy Commission on the Distribution of Wealth University of Birmingham (2012)
- ↑ Anthony Heath and Yaojun Li (2015), Review of the relationship between religion and poverty Archived 2015-05-05 at the Wayback Machine, Nuffield College, Oxford and University of Manchester
- ↑ Gavin Berman & Aliyah Dar (July 2013), Prison Population Statistics 1991-2012, Social and General Statistics, Ministry of Justice, ONS, UK Government
- ↑ https://researchbriefings.files.parliament.uk/documents/SN04334/SN04334.pdf
- ↑ Weller, Paul (2008). Religious diversity in the UK : contours and issues. London u.a: Continuum. ISBN 978-0-8264-9898-4.
- ↑ 30.0 30.1 30.2 30.3 30.4 Zavos, John (2012). "Chapter 6. Hindu Organisation and the Negotiation of Public Space in Contemporary Britain". In John Zavos; et al. (eds.). Public Hinduisms. New Delhi: SAGE Publ. India. ISBN 978-81-321-1696-7.
- ↑ [1] National Council of Hindu Temples UK, accessed 3 August 2009
- ↑ Affiliates Archived 2013-02-12 at the Wayback Machine Hindu Council UK, accessed 4 August 2009
- ↑ About us Archived 2018-05-20 at the Wayback Machine About us, accessed 12 December 2008
- ↑ Weller, Paul (2011). Religions in the UK 2007-2010. Derby: Multi-Faith Centre at the University of Derby. ISBN 978-0-901437-30-3.
- ↑ LIST OF HINDU TEMPLES IN THE UK National Council of Hindu Temples (UK), accessed 3 May 2015
- ↑ [2] 30 Temples in the London area
- ↑ Bimal Krishnadas (edited by), Directory of Hindu Temples in the UK, 2004-2006, page 7, published by the National Council of Hindu Trmples (UK), Leicester.
- ↑ Singh, Jasjit; Tomalin, Emma (2020). "A Survey of Hindu Buildings in England. historic England Research Report 203/2020". research.historicengland.org.uk. Archived from the original on 2020-06-16. Retrieved 2020-06-16.
- ↑ [3]
- ↑ Paul Weller, Hindu Origins and Key Organisations in the UK Archived 2015-07-16 at the Wayback Machine University of Derby, United Kingdom
- ↑ Paul Weller, Some ‘Other’ Religious Groups in the UK: Key Information[dead link] University of Derby, United Kingdom
- ↑ 42.0 42.1 Leicester Diwali celebrations draw large crowds BBC News (3 November 2013)
- ↑ "Diwali – The Festival of Light". Leicester City Council. Archived from the original on 2018-12-25. Retrieved 2022-01-20.
- ↑ Roy, Amit (25 October 2011). "Dazzle at downing, colour at commons". Mumbai Miday. Retrieved 3 November 2013.
- ↑ "Transcript of the Prime Minister's Diwali reception speech". Gov.UK. Government of the United Kingdom. Retrieved 3 November 2013.
- ↑ PTI (10 November 2007). "Prince Charles, Camilla celebrate Diwali in UK". The Times of India. Archived from the original on 4 November 2013. Retrieved 3 November 2013.
- ↑ "Their Royal Highnesses The Prince of Wales and The Duchess of Cornwall Celebrate Diwali at BAPS Shri Swaminarayan Mandir, London". www.mandir.org. BAPS Swaminarayan Sanstha. Archived from the original on 14 November 2012. Retrieved 3 November 2013.
- ↑ Thompson, Jessica Cargill. "Seven wonders of London: BAPS Shri Swaminarayan Hindu Mandir". Time Out London. Time Out Group. Archived from the original on 14 మార్చి 2014. Retrieved 3 November 2013.
- ↑ PTI (17 October 2009). "Brown celebrates Diwali at 10, Downing Street, in a 'historic' first". The Times of India. Archived from the original on 4 November 2013. Retrieved 3 November 2013.
- ↑ Roy, Amit (25 October 2011). "Dazzle at downing, colour at commons". Mumbai Miday. Retrieved 3 November 2013.
- ↑ 51.0 51.1 51.2 51.3 Zavos, John (2010). "Situating Hindu nationalism in the UK: Vishwa Hindu Parishad and the development of British Hindu identity". Commonwealth & Comparative Politics. 48 (1): 2–22. doi:10.1080/14662040903444475. ISSN 1466-2043.
- ↑ 52.0 52.1 http://www.ons.gov.uk/ons/about-ons/business-transparency/freedom-of-information/what-can-i-request/previous-foi-requests/population/ethnicity-and-religion-by-age/dc2201ew---ethnic-group-and-religion.xls
- ↑ Robinson, Lena (2005-09-01). "South Asians in Britain: Acculturation, Identity and Perceived Discrimination". Psychology and Developing Societies (in ఇంగ్లీష్). 17 (2): 181–194. doi:10.1177/097133360501700206. ISSN 0971-3336.
- ↑ Carey, Jesse (2017-10-08). "The Second Coming of Russell Brand". RELEVANT (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-10.
- ↑ Tillery, Gary (2011). Working class mystic : a spiritual biography of George Harrison. Quest Books/Theosophical Pub. House. pp. 91–148. ISBN 978-0-8356-0900-5.
- ↑ "About Christopher Isherwood". www.isherwoodfoundation.org. Archived from the original on 2017-06-27. Retrieved 2021-06-06.
- ↑ "British priest in Kerala in conversion debate". The Hindu (in Indian English). 2006-09-13. ISSN 0971-751X. Retrieved 2021-06-06.
- ↑ "Record number of Muslim MPs elected". The Muslim News. Retrieved 2021-06-06.
- ↑ Dias, Nuno (2010). Westin, Charles (ed.). Identity processes and dynamics in multi-ethnic Europe. Amsterdam: Amsterdam University Press. pp. 179–180. ISBN 978-90-8964-046-8.
- ↑ Skutsch, Carl (2005). Encyclopedia of the world's minorities. New York: Routledge. p. 554. ISBN 978-1-57958-470-2.
- ↑ Weller, Paul (2001). Religious discrimination in England and Wales. London: Home Office, Research, Development and Statistics Directorate. ISBN 978-1-84082-612-8.
- ↑ Paul Weller et al. (2015) (21 May 2015). Religion or Belief, Discrimination and Equality: Britain in Global Contexts. Bloomsbury Academic. pp. 178–180. ISBN 978-1474237512.
{{cite book}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Weller, Paul; Kingsley Purdam; Nazila Ghanea-Hercock; Sariya Contractor (2015). Religion or Belief, Discrimination and Equality: Britain in Global Contexts. Bloomsbury Academic. p. 161. ISBN 978-1474237512.
- ↑ Gelfand, Michele; et al. (2015). Handbook of Advances in Culture and Psychology, Volume 5. Oxford University Press. p. 175. ISBN 978-0-19-021897-3.
- ↑ E Nesbitt (1993), Gender and religious tradition: The role learning of British Hindu children, Gender and Education, 5(1): 81-91
- ↑ Monks, Claire P.; et al. (2008). "Peer victimization in multicultural schools in Spain and England". European Journal of Developmental Psychology. 5 (4): 507–535. doi:10.1080/17405620701307316.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;pi8
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Lindblom (2005). Non-governmental organisations in international law. Cambridge New York: Cambridge University Press. pp. 169–183. ISBN 978-0-521-85088-9.
- ↑ Thane, Pat (2010). Unequal Britain equalities in Britain since 1945. Continuum. pp. 58–68. ISBN 978-1-84706-298-7.
- ↑ Jacobsen, Knut (2004). South Asians in the diaspora histories and religious traditions. Leiden Boston: Brill. ISBN 978-90-04-12488-2.
- ↑ 7/7 backlash against Hindus and Sikhs, The Telegraph; Quote - "There have been 932 hate crimes against Indians, predominantly Hindus and Sikhs, compared with around 600 such instances against Pakistani and Bangladeshi Muslims".
- ↑ "Tory London mayoral candidate claimed celebrating Hindu and Muslim festivals has turned Britain into 'cesspool of crime'". The Independent (in ఇంగ్లీష్). 2018-10-04. Retrieved 2021-06-06.
- ↑ Sonwalkar, Prasun (4 October 2018). "Anti-Hindu, Muslim views return to haunt London mayor candidate Shaun Bailey". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 4 October 2018.
- ↑ Sabbagh, Dan (4 October 2018). "Tory deputy chairman admits concerns about Shaun Bailey remarks". The Guardian (in ఇంగ్లీష్). Retrieved 4 October 2018.
- ↑ "Tory London mayor candidate's comments 'Islamophobic'". BBC News (in ఇంగ్లీష్). 4 October 2018. Retrieved 4 October 2018.
- ↑ "Hindus in the UK". www.facebook.com (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.
- ↑ "Demographics of Anguilla". gov.ai. Archived from the original on 2007-11-24. Retrieved 2021-06-11.
- ↑ "Bermuda | Joshua Project". www.joshuaproject.net. Retrieved 2021-06-11.
- ↑ "Population Demographics of British Virgin Islands" (PDF). Statistic Depatment. Government of British Virgin Islands. Retrieved 11 June 2021.
{{cite web}}
: CS1 maint: others (link) - ↑ "The 2010 Caymon Islands Census" (PDF). ESO.ky. Retrieved 11 June 2021.
- ↑ Project, Joshua. "South Asian, general in Gibraltar". joshuaproject.net (in ఇంగ్లీష్). Retrieved 2021-06-11.
- ↑ "2000 Round of Population and Housing Census Sub-project" (PDF). Caricomstats.org. Archived from the original (PDF) on 2016-03-31. Retrieved 2015-05-20.
- ↑ "India - Turks and Caicos Islands Relations" (PDF). Ministry of External Affairs, Government of India. January 2015. Retrieved January 26, 2018.