స్కాట్లండ్‌లో హిందూమతం

స్కాట్లాండ్‌లో హిందూమతం మైనారిటీ మతం. స్కాటిష్ హిందువులలో ఎక్కువ మంది 20వ శతాబ్దపు ద్వితీయార్ధంలో అక్కడ స్థిరపడినవారే. 2001 UK జనాభా లెక్కల సమయంలో, 5,600 మంది హిందువులున్నట్లు గుర్తించారు, ఇది స్కాట్లండు[గమనిక 1] జనాభాలో 0.1%కి సమానం. ఇది వేల్స్‌లోని హిందువుల సంఖ్య కంటే కొంచెం ఎక్కువ. [1] 2011 UK జనగణనలో, స్కాట్‌లాండ్‌లో హిందువుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగి 16,000 మందికి పైగా ఉంది. [2]

మూల స్థానాలు

మార్చు

చాలా మంది స్కాటిష్ హిందువులు భారత సంతతికి చెందినవారు లేదా పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందినవారు. 1970లలో ఉగాండా నుండి ఇడి అమిన్ బహిష్కరించినపుడు వీరిలో చాలా మంది వచ్చారు. కొందరు దక్షిణాఫ్రికా నుండి కూడా వచ్చారు. ఇండోనేషియా, ఆఫ్ఘన్ మూలాలున్నవారు కూడా కొందరు ఉన్నారు.

వీరిలో చాలా మంది భారతదేశంలోని పంజాబ్ ప్రాంతానికి చెందినవారు. వారు మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ కాకుండా పంజాబీ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, నేపాలీ ఉన్నాయి.

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
20015,564—    
201116,379+194.4%
సంవత్సరం శాతం మార్పు
2001 0.11% -
2011 0.31% +0.20%

జనాభా వివరాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, 47 మంది హరే కృష్ణ అనుయాయిలు 17 మంది బ్రహ్మ కుమారీలతో సహా 16,327 మంది హిందూమతస్థులున్నారు. [3]

దేవాలయాలు

మార్చు

దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. గ్లాస్గో లోని వెస్ట్ ఎండ్ లో ఒక ఆలయం 2006 లో ప్రారంభమైంది [4] అయితే, 2010 మే లో జరిగిన అగ్ని ప్రమదంలో తీవ్రంగా దెబ్బతింది [5] ఇస్కాన్ సౌత్ లానార్క్‌షైర్‌లోని లెస్మహాగోలో పనిచేస్తుంది. ఎడిన్‌బరో, డూండీలలో కూడా ఆలయాలు ఉన్నాయి. 2008లో అబెర్‌డీన్‌లో దేవాలయం కోసం నిర్మాణ ప్రణాళికలు ప్రకటించారు. [6]

గమనిక

మార్చు
  1. యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లండ్‌లో నాలుగు దేశాలు భాగంగా ఉన్నాయి - ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లండ్, ఉత్తర ఐర్లండ్. ఐదు వందల ఏళ్ళ పాటు జరిగిన వివిధ విలీనాలతో ఈ సామ్రాజ్యం ఏర్పడింది. 1536 లో ఇంగ్లాండ్, వేల్స్ కలిసి ఒకే రాజ్యంగా - "కింగ్‌డం ఆఫ్ ఇంగ్లండ్"గా రూపొందాయి. ఆ తరువాత, 1707 లో స్కాట్లండ్ కూడా కలిసి మూడు దేశాలతో "కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్" ఏర్పడింది. 1901 లో ఐర్లండ్ కూడా కలిసి "యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లండ్" ఏర్పడింది. అయితే, 1922 లో ఐర్లండ్ రెండు ముక్కలై ఒక భాగం స్వతంత్ర ఐర్లండ్ దేశంగా ఏర్పడగా, రెండవ భాగమైన ఉత్తర ప్రాంతం - ఉత్తర ఐర్లండు - యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగంగానే ఉండిపోయింది. అప్పుడు దేశం పేరు "యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లండ్" గా మారింది. ఇదే ప్రస్తుత రూపం.

మూలాలు

మార్చు
  1. ANALYSIS OF RELIGION IN THE 2001 CENSUS: Summary Report www.scotland.gov.uk, accessed 3 Dec 2009
  2. "Hinduism - Testimony". Archived from the original on 2012-10-04.
  3. "2011 Census: Key Results from Releases 2A to 2D" (PDF).
  4. New Hindu temple opens in Glasgow BBC News, 19 July 2006
  5. Fire severely damages Hindu temple in Glasgow news.bbc.co.uk, 30 May 2010
  6. Hindu temple planned for Aberdeen BBC News, 22 September 2008.