[[వర్గం:2008_తెలుగు_సినిమాలు]]

ఒక్క మగాడు
(2008 తెలుగు సినిమా)

One And Only
దర్శకత్వం వై.వి.ఎస్.చౌదరి
నిర్మాణం వై.వి.ఎస్.చౌదరి
రచన చింతపల్లి రమణ
తారాగణం నందమూరి బాలకృష్ణ,
సిమ్రాన్ బగ్గా,
అనుష్కా షెట్టి,
విషా కొఠారి,
అసుతోష్ రాణా,
కోట శ్రీనివాసరావు,
రవి కాలె,
సలీమ్,
సుబ్బరాజు
సంగీతం మణిశర్మ
గీతరచన చంద్రబోస్ (రచయిత)
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్.స్వామి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఒక్క మగాడు 2008లో విడుదలైన తెలుగు సినిమా. నందమూరి వంశ వీరాభిమాని వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోవడం, ఆ అంచనాలను అందుకునే రీతిలో చిత్రం లేకపోవడం వల్ల ఈ చిత్రం బాలకృష్ణకు మరొక పరాజయాన్ని మిగిల్చింది. మేకప్, గ్రాఫిక్స్, సాంకేతిక విలువలను పట్టించుకున్నంతగా కథను పట్టించుకోలేదు కాబట్టే ఈ చిత్రం పరాజయం పాలయ్యింది. ఈ చిత్రంలో హీరో పాత్ర నరసింహనాయుడు, భారతీయుడు అనే రెండు సినిమాల హీరో పాత్రల కలగలుపు అని పలువురు విమర్శించారు.

వెంకటాపురం గ్రామంలో వీరవెంకట సత్యనారాయణ స్వామి (స్వామి) ప్రజలకు ఆరాధ్యనాయకుడు. అతని తాత దేశం స్వరాజ్యం కోసం పోరాడి, బందీగా అయ్యి, తరువాత ఆచూకీ కానరాలేదు. అవినీతిపరులైన ఎందరో అధికారులు, ప్రముఖులు మరణించగా ఆందుకు స్వామిని అనుమానించడం మొదలు పెడతారు. కాని "ఒక్కమగాడు" అనబడే ముసలివాడు తానే ఈ శిక్షలను అమలుచేస్తున్నానని చెబుతుంటాడు. స్వామికి, ఒక్క మగాడికి పోలికలుంటాయి. ఇంకా స్వామికి నంబూద్రి అనబడే రాజకీయనాయకునితో వైరం ఉంది. ఈ స్థితిలో ఒక్కమగాడికోసం అన్వేషణ మొదలవుతుంది.ఈ చిత్రంలో ఒక్క మగాడు (బాల కృష్ణ) ఒక చేతితో కరెంటు తీగను పట్టుకుని మరొక చేతితో ముగ్గురు వ్యక్తులను పట్టుకుంటాడు కురెంటు షాకు వల్ల ఆ ముగ్గురూ చనిపోయినా ఒక్క మగాడికి మాత్రం ఎమీ కాకపోగా ఆయన నవ్వుతూ కనిపిస్తాడు. ఈ సన్నివేశం అసహజంగా అనిపించినా బాలకృష్ణ లాంటి కమర్షియల్ హీరోకి ఆ మాత్రం ఉండాలి.

ఇతర సాంకేతిక వర్గం
  • నిర్వాహక నిర్మాత - కొమ్మినేని వెంకటేశ్వరరావు
  • సహ నిర్మాత - యలమంచిలి యుక్త
  • ఛాయాగ్రహణం - మధు నాయుడు
  • కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు
  • కోరియోగ్రఫీ - బృంద, తార, అమ్మ రాజశేఖర్
  • పోరాటాలు - విజయన్
  • సంభాషణలు - చింతపల్లి రమణ

పాటలు

మార్చు
  • ఒక్క మగాడు - రీటా, భార్గవ - రచన:చంద్రబోస్
  • దేవాది దేవా - విజయ్ యేసుదాస్, రంజిత్ - రచన:చంద్రబోస్
  • అమ్మతో - నవీన్, అనుష్క - రచన:చంద్రబోస్
  • అ.. ఆ .. ఇ.. ఈ.. -రాహుల్ నంబియార్, జే - రచన:చంద్రబోస్
  • నను పాళించగా - రీటా, మల్లికార్జున - రచన:చంద్రబోస్
  • రే - ఎస్.పి.బాలసుబ్రహ్మణియన్, చిత్ర - - రచన:చంద్రబోస్

విశేషాలు

మార్చు
 
ఒక్కమగాడు చిత్రం విడుదల సందర్భంగా గన్నవరంలో అభిమానుల పోస్టరు. వెనుక ఉన్న టాక్సీ స్టాండులోని కార్లను బట్టి ఈ పోస్టరు సైజును ఊహించుకోవచ్చును

అంతకు కొద్దికాలం ముందే వచ్చిన చిరుత వంటి సినిమాలతో ఆరంభమైన అభిమానుల పోస్టర్ల సంరంభం ఒక్కమగాడు చిత్రం విడుదల సందర్భంగా బాగా కనిపించింది. బాలకృష్ణ అభిమానుల పోస్టర్లు పెద్దయెత్తున ఊరూరా వెలిశాయి. ఈ పోస్టర్లలో సినిమా అభిమానం, స్థానిక రాజకీయ వర్గ సూచన, కులాభిమానం ఛాయలు కనిపించడం విశేషం.

 
ఒక్కమగాడు చిత్రం విడుదల సందర్భంగా దుగ్గిరాలలో అభిమానుల పోస్టరు.

బయటి లింకులు

మార్చు