ఓలా క్యాబ్స్ భారతదేశానికి చెందిన బహుళజాతి ప్రయాణసేవల సంస్థ. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇది క్యాబ్ సేవలు, ఆర్థిక సేవలు, క్లౌడ్ కిచెన్ రంగాల్లో కూడా వ్యాపారం చేస్తుంది.

ఓలా
రకంప్రైవేటు సంస్థ
పరిశ్రమప్రయాణ సేవలు
స్థాపన3 డిసెంబరు 2010; 13 సంవత్సరాల క్రితం (2010-12-03)
స్థాపకుడు
  • భవీష్ అగర్వాల్
  • అంకిత్ భాటి
ప్రధాన కార్యాలయం
బెంగళూరు, కర్ణాటక
Number of locations
250+ నగరాలు
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
ఆస్ట్రేలియా
న్యూజీలాండ్
యునైటెడ్ కింగ్‌డమ్
కీలక వ్యక్తులు
  • భవీష్ అగర్వాల్ (CEO)
  • అంకిత్ భాటి (CTO)
ఉత్పత్తులుమొబైల్ ఆప్, వెబ్‌సైట్
సేవలు
  • అద్దె వాహనాలు
  • ఆర్థిక సేవలు
  • ఫుడ్ డెలివరీ[1]
రెవెన్యూమూస:Up 2,799 crore (US$350 million) (FY23)[2]
మూస:Positive decrease −772 crore (US$−97 million) (FY23)[2]
ఉద్యోగుల సంఖ్య
~3,000 (2020)
మాతృ సంస్థANI Technologies[3]
వెబ్‌సైట్www.olacabs.com Edit this on Wikidata

సాఫ్ట్ బ్యాంక్ లాంటి వెంచర్ క్యాపిలిస్టులు ఇందులో పెట్టుబడులు పెట్టారు.[4] జనవరి 2018 లో ఆస్ట్రేలియా లో సేవలు ప్రారంభించడంతో మొదటిసారిగా విదేశాల్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2018 న్యూజీలాండ్ లో సేవలు మొదలుపెట్టింది.[5] మార్చి 2019 నాటికి యూకేలో కూడా తన కార్యకలాపాలు ప్రారంభించింది.[6]

చరిత్ర

మార్చు

2010 లో భవీష్ అగర్వాల్ ఢిల్లీ కేంద్రంగా olatrip.com అనే పేరుతో ఒక ట్రిప్ మేనేజ్‌మెంట్ సంస్థను ప్రారంభించాడు. జనవరి 2011 నాటికి ఎక్కడి నుంచైనా సులభంగా అందుబాటులో ఉండే క్యాబ్ సేవల కోసం డిమాండు పెరగడంతో భవీష్ అగర్వాల్, తన స్నేహితుడైన అంకిత్ భాటితో కలిసి ఓలాక్యాబ్స్ ని ప్రారంభించాడు.[7] మొదట్లో ఒక ఫోన్ కాల్ ద్వారా క్యాబ్ ని ముందుగా బుక్ చేసుకునే సదుపాయం మాత్రమే ఇందులో ఉండేది. జూన్ 2012 లో మొబైల్ ఆప్ ని అభివృద్ధి చేశారు.[8] 2015 ప్రారంభంలో ఓలా అతిపెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉంది. దాని తర్వాత ట్యాక్సీ ఫర్ ష్యూర్, మేరు క్యాబ్స్, ఇంకా 2013 లో ప్రారంభించిన ఉబర్ ఉన్నాయి.[9]

మార్చి 2015 లో ఓలా పోటీదారు అయిన ట్యాక్సీ ఫర్ ష్యూర్ ని 1237 కోట్ల రూపాయలకు (200 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది.[10] జూన్ 2015 నాటికి ట్యాక్సీ ఫర్ ష్యూర్ సేవలను ఓలా ఆప్ లో పొందుపరిచింది.[11] ఆగస్టు 2015 నాటికి 100 నగరాలకు పైగా పనిచేస్తూ ఆప్ ద్వారా మాత్రమే బుకింగ్స్ స్వీకరించేది.[12]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Ola's losses accumulate to Rs 17,453 Cr as revenue shrinks 63% in FY21". 3 November 2021.
  2. 2.0 2.1 Sil, Debarghya (10 January 2024). "Ola Cabs Parent ANI Tech's FY23 Revenue Crosses INR 2,500 Cr Mark, Loss Declines To INR 772 Cr". Inc42 Media (in ఇంగ్లీష్). Retrieved 16 January 2024.
  3. Bhalla, Tarush (2 November 2021). "Ola posts operating profit in FY21 ahead of likely share sale". mint (in ఇంగ్లీష్). Retrieved 15 November 2021.
  4. "Would an Ola-Uber Merger in India Get the Competition Commission's Approval?". The Wire. 29 April 2018. Retrieved 19 March 2019.
  5. "India's Ola forays into New Zealand in latest overseas push". Reuters. 18 September 2018. Retrieved 18 September 2018.
  6. Shrivastava, Aditi. "Next pickup is London for Ola". The Economic Times. Retrieved 1 January 2022.
  7. "Ola: Taking India On A Ride". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 12 January 2024.
  8. SN, Vikas (13 June 2012). "Olacabs Offers Real-Time Cab Booking On Mobile; Single Click; Our Take". MediaNama. Retrieved 12 January 2024.
  9. "How Ola and Uber are making other taxi companies irrelevant in India". Business Today (in ఇంగ్లీష్). 12 August 2015. Retrieved 12 January 2024.
  10. "Ola buys TaxiForSure for Rs 1,237 crore in a cash-and-stock deal". The Economic Times. 3 March 2015. Retrieved 12 January 2024.
  11. Mandal, Suchayan (25 June 2015). "Ola cabs app and Taxi For Sure get into a relationship. Twitter trolls prove how complex it is". Business Insider India.
  12. Dalal, Mihir (29 July 2015). "Ola to shut website, turn into app-only platform starting August". mint (in ఇంగ్లీష్). Retrieved 12 January 2024.