ఓలేటి వేంకటరామశాస్త్రి
ఓలేటి వేంకటరామశాస్త్రి (నవంబరు 15, 1883 - డిసెంబరు 3, 1939) ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు.
ఓలేటి వేంకటరామశాస్త్రి | |
జననం: | నవంబర్ 15, 1883 పల్లిపాలెం |
---|---|
మరణం: | డిసెంబరు 3,1939 |
వృత్తి: | కవి |
Subjects: | తెలుగు |
తొలి కృతి: | నూటపదియార్లు ,ఆంధ్ర కథా సరిత్సాగరము |
జననం
మార్చుఇతడు తూర్పుగోదావరి జిల్లా, పల్లిపాలెంలో కామేశ్వరమ్మ, నారాయణశాస్త్రి దంపతులకు 1883, నవంబరు 15 వ తేదీన జన్మించాడు.[1][2] తన మేనత్త కుమారుడైన వేదుల రామకృష్ణశాస్త్రితో కలిసి వేంకట రామకృష్ణ కవులు పేరుతో జంటగా కవిత్వం చెప్పాడు. ఈ జంటకవులు చర్ల నారాయణశాస్త్రి వద్ద సాహిత్యము, రామడుగుల వీరేశ్వరశాస్త్రి వద్ద శబ్దశాస్త్రము, విశ్వపతిశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము నేర్చుకున్నారు.
రచనలు
మార్చుస్వీయ రచనలు
మార్చు- నూటపదియార్లు
- ఆంధ్ర కథా సరిత్సాగరము (6లంబకములు) - వేదుల రామకృష్ణశాస్త్రి మరణించిన తర్వాత గుణాఢ్యుడి కథాసరిత్సాగరాన్ని తెలుగులోనికి అనువదించడం మొదలు పెట్టి మొత్తం 18 లంబకములలో 6 లంబకములను మాత్రం అనువదించారు ఓలేటి వేంకట రామశాస్త్రి. (ఈ గ్రంథాన్ని ఒకరే రచించినప్పటికీ వేంకటరామకృష్ణ ప్రణీతము అని ప్రకటించి రామకృష్ణశాస్త్రిపై తనకు గల అభిమానాన్ని చాటుకున్నాడు.) ఓలేటి వేంకట రామశాస్త్రి ఇందు 5వ లంబకము వరకు పూర్తిగావించి 6వ లంబకములో 1,2,3 తరంగాలు వ్రాసినట్టుగా ఉవాచగా తెలుస్తున్నప్పటికి మూలం యెక్కడ లభ్యం కాలేదు.తదుపరి తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామం ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి (1909) 7వ లంబకము నుండి 18వ లంబకము వరకు అనువదించి 1963సం..లో వేంకటేశ్వరుని దివ్యదామమైన వైకుంఠము చేరితిరి. తదనంతరం వారి జ్యేష్ఠపుత్రుడైన ఓలేటి శ్రీనివాసశర్మ (1942) శ్రీ దంతులూకి వేంకటరాయపరాజోన్నత పాఠశాల కోలంకలో గ్రేడ్-1 తెలుగు పండితుడిగా రిటైరైతిరి (2000). పిదప 1-5, 7-18 లంబకములు పూర్తియైనవి 6వ లంబకము పూర్తి గావించిన గ్రంథమునకు పూర్ణత్వము, పూర్వికులకు యశః కాయము లభించునన్న తలంపుతో 6వ లంబకము 2009నాటికి పూర్తిగావించితిరి. ఆంధ్ర కథా సరిత్సాగరము - ఓలేటి వేంకట రామశాస్త్రి (పల్లిపాలెం) 1-5లంబకములు, ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి (ఇంజరం) 7-18, ఓలేటి శ్రీనివాసశర్మ -6వ లంబకము ఈవిదమున ఓలేటి త్రయంచే పూర్తిగావింపబడింది.
వేదుల రామకృష్ణశాస్త్రి తో కలిసి జంటగా రచించినవి
మార్చు- శతఘ్ని
- రామకృష్ణ మహాభారతము[3]
- అట్టహాసము
- విశ్వగుణాదర్శము (అనువాదం)
- ఔచిత్య విచారచర్చ (అనువాదం)
- కవి కంఠాభరణము (అనువాదం)
- ఇందిరాదేవి (నవల)
- సుభద్ర (నవల)
- శకుంతల (నవల)
- దమయంతి (నవల)
- వ్యాసాభ్యుదయము
- దమయంతీ కల్యాణము (అచ్చతెలుగు కావ్యము)
- ఉత్తరరామచరిత్ర
- మదాలస (నాటకము)
- భోజచరిత్ర
- కాత్యాయన చరిత్ర
- సువృత్త తిలకము (అనువాదం)
- పాణిగృహీతి
- కొండవీటి దండయాత్ర
- అత్యద్భుత శతావధానము
- పరాస్తపాశుపతము
మరణం
మార్చుఓలేటి వేంకటరామశాస్త్రి 1939, డిసెంబరు 3 వ తేదీన మరణించాడు.