కంచర్ల రామకృష్ణా రెడ్డి
కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నాడు.[1]
కంచర్ల రామకృష్ణారెడ్డి | |||
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018- ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 25 డిసెంబర్ 1954 దత్తప్పగూడెం, మోత్కూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | సిపిఐ |
జననం, విద్యాభాస్యంసవరించు
కంచర్ల రామకృష్ణారెడ్డి 1954 డిసెంబరు 25న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం, దత్తప్పగూడెం గ్రామంలో కంచర్ల నరసింహారెడ్డి, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1969లో పదవతరగతి పూర్తిచేశాడు.
రాజకీయ జీవితంసవరించు
కంచర్ల రామకృష్ణారెడ్డి విద్యార్థి దశ నుండే విద్యార్థి ఉద్యమాలలో పాల్గొంటూ ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శిగా పనిచేస్తూ సీపీఐ పార్టీలో చేరి మోత్కూరు మండల సీపీఐ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా 2000 సంవత్సరం వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 1995 నుండి దత్తప్పగూడెం సింగల్ విండో చైర్మన్‌గా, మోత్కూరు సింగల్ విండో చైర్మన్‌గా సుదీర్ఘకాలంపాటు పనిచేశాడు. రామకృష్ణారెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితుడై 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2001లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
కంచర్ల రామకృష్ణారెడ్డి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామన్నపేట నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించాడు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా తెరాసకు పోటీచేసే అవకాశం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. ఆయన తరువాత పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాడు. 2017లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. కంచర్ల రామకృష్ణారెడ్డి 2018 జూన్ లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడై, అనంతరం 2020 - 21లలో చైర్మన్ పదవి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడగించడంతో రెండోసారి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
కంచర్ల రామకృష్ణారెడ్డి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2021 జులై 27న పొడగించడంతో మూడోసారి చైర్మన్‌గా నియమితుడయ్యాడు. 2022 జనవరి 26న యాదాద్రి భువనగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2][3][4]
మూలాలుసవరించు
- ↑ Namasthe Telangana (27 July 2021). "ఆయిల్‌ఫెడ్ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
- ↑ Andhrajyothy (27 January 2022). "డబుల్ ధమాకా". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
- ↑ Andhrajyothy (27 January 2022). "టీఆర్‌ఎస్‌కు జిల్లా సారథులు". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
- ↑ Namasthe Telangana (27 January 2022). "కంచర్లకు కారు స్టీరింగ్". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.