కంచర్ల (ఇంటి పేరు)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కంచర్ల వారి ఛరిత్ర
విజయనగర సామంత రాజులకు శ్రీ కృష్ణ గంధర్వుడు 9 పాళెములకు 6 గ్రామాలకు పాళెగాడు. ఆయన రాజధాని శ్రీ కృష్ణ గంధర్వపురం. కారణాంతరాల వలన పల్నాటి బాలచంద్రుడు, చిన్న నాయకుడు శ్రీ కృష్ణ గంధర్వుని మీద యుద్దమొనర్చి, ఆతనిని సంహరించి శ్రీ కృష్ణ గంధర్వ పురము శిధిలమొనర్చి, దానిని దున్నించి ఆముదాలు వేయించాడు. ఆయన ఆస్థానములో ప్రధానిగా, విద్యాధికారులుగా ఉన్న కంచర్ల.రామకృష్ణయ్య.కంచర్ల.చెన్న కృష్ణయ్య కవులు శ్రీ కృష్ణ గంధర్వ పురానికి పడమరగా గడ్డనెత్తి ఒక నగరమును నిర్మించారు. దానికి కంచర్ల అని నామకరణం చేశారు. తన ఇంటి పేరు వారిని కులాలకు అతీతంగా పిలిపించి ఉద్యోగాలు ఇచ్చారు. గ్రామానికి ఆనుకొని చెన్నకేశ్వరాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే నేడు విష్ణు ఆలయంగా మార్చబడి,నేటికి పూజలు అందుకుంటున్నది. కంచర్ల రామకృష్ణ కవి త్యాక్షరధీ శతకము, కృష్ణ గంధర్వ ఛరితం అను పంభ కథ వ్రాసి, దానిని కనిగిరి నుంచి జముకుల వారిని పిలిపించి, ఆ కథ వారికి నేర్పి, వారు దానిని గ్రామగ్రామాలలో ప్రచారం చేయునట్లు, దానికి పిట్టమళ్ళ, ఉమ్మడివరం గ్రామాలలో వారికి గృహ,భూ వసతి కల్పించారు. వారు గత 20 యేండ్ల క్రితం వరకు, గ్రామాలలో తిరిగి,పంభ కథ చెప్పేవారు. కంచర్ల రామకృష్ణ కవి, తన కుమారులు 5 గురునూ 5 గ్రామాలకు కరణాలుగా చేశారు. తూర్పు-యేనుగుపాలెం,పడమర-పెరుమాళ్ళపల్లె,ఉత్తరం-పెదకంచర్ల,మతకమల్లి గ్రామాలకు కరణాలుగా నియమించారు. వారిని ఆశ్రయించిన దమ్మళము,వామరాజు వారికి, జంగాలపల్లె, పిట్టమళ్ళ, విఠంరాజుపల్లె గ్రామలకు కరణాలుగా నియమించారు. కాలక్రమేణా పెదకంచర్ల గ్రామ కరణం వెంకట్రావు గారి కాలంలో కరణం, మునసబు, వెట్, మోతాదు, తోటి వీరందరూ కంచర్ల వారే. బ్రిటీషు వారి కాలంలో కలెక్టర్ జమాబంది సమయంలో, కరణాన్ని, గ్రామ నౌకర్లను పిలిపించుటలో అందరూ కంచర్ల వారగుటచే ఆయన నవ్వుతూ మీరందరూ అన్నదమ్ములా? అని అడిగాడు. దానికి కరణం గారు కించపడి, ఇల్లుజేరి, యెట్టి, తోటి, మోతాదులను పిలిచి, మీ ఇంటి పేరు మార్చుకొమ్మని అడిగాడు. దానికి వారందరూ ఆయన ఏర్పాటు చేసిన కానుకలకు అధికారానికి తల ఒగ్గి, తమ ఇంటి పేరుని మార్చుకున్నారు. అలాగే మాదిగ పల్లె లోని పెద్దలను పిలిచి, ఇంటికి ఒక ఆవు, ఎకరం పొలం ఇస్తాను, ఇంటి పేరు మార్చుకొమ్మాన్నాడు. కరణం గారు పాడినిచ్చినందువలన (ఆవు పాలు అమ్మృతంతో సమానం కనుక) వారి ఇంటి పేరును "అమ్మృతపూడి"గా నిర్ణయిస్తూ మార్చారు. మాదిగపల్లె లోని ఒక కుటుంభం వారు మాత్రం, దానికి నిరాకరించారు. కాలక్రమమున అధికారపు ఒత్తిడితో వారు తట్టుకోలేక,అక్కడినుంచి నుదురుపాడు దగ్గర,మునగపాడు (అత్తగారి ఇల్లు) చేరి, అక్కడ నుండి గుంటూరు జిల్లా పెదకూరపాడు చేరి అక్కడ కంచర్ల వారిగానే చలామణి అయినారు. ఇప్పటికి అక్కడే ఉన్నారు. పెదకంచర్ల నుండి వీడిపోయిన అనేక కుటుంభాలవారు వివిధ ప్రాంతాలలో నేటికీ, కంచర్లవారిగానే ఛలామణీ అగుచూ నివసిస్తున్నారు.