కందుకూరు
కందుకూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం.
పట్టణం | |
Coordinates: 15°13′N 79°54′E / 15.22°N 79.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | కందుకూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 33.06 కి.మీ2 (12.76 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 57,246 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 999 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8598 ) |
పిన్(PIN) | 523105 |
Website |
చరిత్ర
మార్చుశ్రీకృష్ణ దేవరాయ కాలంలో ఈ ప్రాంతాన్ని స్కంధ పూరి అనేవారు. కాలక్రమంలో కందుకూరు గా మారింది.
భౌగోళికాంశాలు
మార్చుకందుకూరు 15.217°N 79.917°E వద్ద, సముద్రమట్టానికి 632 మీటర్ల (2,073 అడుగులు) ఎత్తులో ఉంది. జిల్లా కేంద్రమైన నెల్లూరుకు ఉత్తరదిశగా 103కి.మీ. దూరంలో, సమీప నగరమైన ఒంగోలుకు ఆగ్నేయంగా 46 కి.మీ దూరంలో వుంది.
జనగణన వివరాలు
మార్చుకందుకూర్ 1,50,084 జనాభా ఉంది.జనాభాలో పురుషుల సంఖ్య 49%,51% మహిళలు ఉన్నారు.కందుకూర్ 63% సగటు అక్ష్యరాస్యత,59.5% యొక్క జాతీయ సగటు కన్నా ఎక్కువ:పురుషుల అక్షరాస్యత 72%, మహిళల అక్షరాస్యత 55% ఉంది., కందుకూర్ లో, జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ.
పరిపాలన
మార్చుఈ గ్రామ వాసులయిన దివి కొండయ్య చౌదరి తొలుత కందుకూరు సర్పంచిగా నర్రా రామారావునాయుడు పై పోటీచేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. కందుకూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సదుపాయాలు
మార్చుజాతీయ రహదారి 167బి (భారతదేశం) మార్గంలో కందుకూరు వుంది. సమీప రైలు స్టేషన్ శింగరాయ కొండ లో వుంది.
విద్యా సౌకర్యాలు
మార్చు- కందుకూర్ పఠాభిరామిరెడ్డి రామిరెడ్డి ( టిఆర్ఆర్ ) ప్రభుత్వ కళాశాల అనే చాలా పెద్ద ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ఉంది. 100 ఎకరాల ( 0.40km 2 ) ప్రాంత ప్రాంగణం వుంది.
- ప్రకాశం ఇంజినీరింగ్ & MBA కళాశాల: విస్తీర్ణం: 40 ఎకరాలు
- మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ & ఎంబీఏ, ఎంసీఏ కళాశాల: 1999 లో స్థాపించబడినది.
- 3 B.E.D కళాశాలలు కందుకూరులో ఉన్నాయి .
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- జనార్ధన స్వామి ఆలయం: శ్రీ స్కంధ పురి జనార్ధన స్వామి (కృష్ణుడు).
- పొలేరమ్మ గుడి (గ్రామ దేవత)
- అంకమ్మ దేవాలయం
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018