కడప నవాబులు, 18వ శతాబ్దంలో ప్రస్తుత కడప, అన్నమయ్య జిల్లాల ప్రాంతాన్ని పాలించిన ముస్లిం రాజవంశము. వీరిని మయానా నవాబులు అని కూడా వ్యవహరిస్తారు.

మొఘల్ చక్రవర్తి, ఆలంగీర్ ఔరంగజేబు కాలంలో గండికోట సీమను పాలిస్తున్న నేక్‌నాం ఖాన్, గండికోటలో మీర్ జుమ్లా పునాదులు వేసిన, జుమ్మా మసీదు నిర్మాణం పూర్తిచేసి. గండికోటకు ఆగ్నేయాన, పినాకిని, చిత్రావతి నదుల సంగమంలో ఒక గ్రామం స్థాపించి, ఆ గ్రామానికి తన పేరు మీద నేక్‌నామాబాద్ అని పేరు పెట్టాడు.[1]: 173 

అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు.[2] అప్పట్నుంచి కడప నవాబులు సిద్ధవటం కోట నుంచే పాలించేవారు. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా సిద్ధవటానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో పాలనాకేంద్రాన్ని కడపకు మార్చారు. ప్రస్తుతం కడప నగరానికి, పెన్నేటికి మధ్య దూరం దాదాపు 5 కిలోమీటర్లు.

నవాబుల జాబితా

మార్చు

కడపను పాలించిన మయానా పాలకుల జాబితా[3]

నవాబు పాలన ఆరంభం పాలన అంతం
నేక్నాం ఖాన్ 1645 1672
అబ్దుల్ మాజిద్ ఖాన్ 1711 1735
అబ్దుల్ మహమ్మద్ ఖాన్ (హమ్మూ మియా) - గుడ్డి నవాబు 1736 1747
అబ్దుల్ నబీ ఖాన్ 1714 1732
మహజిద్ ఖాన్ 1732 1740
అబ్దుల్ నబీ ఖాన్ 1740 1751
అబ్దుల్ మాజిద్ ఖాన్ 1751 1756
అబ్దుల్ హలీం ఖాన్[1] 1756 1780

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 V., mahalingam (1976). Mackenzie Manuscripts Vol 2. p. 141. Retrieved 16 September 2024.
  2. Brackenbury, C. F. District Gazetteer, Cuddapah. Asian Educational Services. p. 41. Retrieved 16 September 2024.
  3. "The Mayana Nawabs of Cuddappah". cbkwgl. Retrieved 15 September 2024.