కడలి సత్యనారాయణ

కడలి సత్యనారాయణ తెలుగు కథా రచయిత్రి.

కడలి సత్యనారాయణ

జీవిత విషయాలు

మార్చు

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆగస్టు7 న జన్మించిన కడలి ఎం.ఏ (ఆంగ్ల సాహిత్యం) చదువుకుంది. తనను సాహిత్యం వైపు ప్రోత్సహించిన, ఆమె తాతగారైన సత్యనారాయణ పేరును తన పేరు పక్కన చేర్చుకొని, కడలి సత్యనారాయణగా మారింది. చిన్నప్పటి నుండి చలం రచనలు కడలిని బాగా ప్రభావితం చేశాయి. దీంతో మహిళల పట్ల సమాజపు పోకడలను ప్రశ్నించే ప్రయత్నానికి అవి నాంది పలికాయి. ఈ క్రమంలోనే చలం ప్రేమలేఖల తరహాలోనే తాను కూడా ప్రేమలేఖలు రాయాలని సంకల్పించుకున్న కడలి, తనకు ఎదురైన అనుభవాలు, తన కళ్లముందు కదలాడే జంటల కథలను ప్రేమ కథలుగా మలిచి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసింది. రచయితలు వెంకట్ సిద్దారెడ్డి, బెజవాడ మహితో పాటు పలువురి ప్రోత్సాహం, అన్వీక్షికి పబ్లికేషన్స్ వారి చొరవతో ఆ ప్రేమ కథలు 'లెటర్స్​ టు లవ్' పేరుతో విడుదల అయ్యాయి. నటి, నిర్మాత రేణు దేశాయ్ చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల అయ్యింది. [1]

లెటర్స్ టు లవ్ విశేషాలు

మార్చు

6 ఏళ్ల అమ్మాయి నుంచి 50 ఏళ్ల మహిళలపై వివిధ కోణాల్లో 40 ప్రేమ లేఖలను రచయిత్రి రాయడం ఈ పుస్తకం ప్రత్యేకత. "మనందరికీ ఒక పేరుంటుంది. అది మనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఈ పేరు మనం కాదు. అది కొన్ని అక్షరాల సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి. సరైన పదాలు లేవుగానీ, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రేమలేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్. కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ లెటర్స్ టు లవ్" అని రచయిత వెంకట్ సిద్ధారెడ్డి ఈ పుస్తకంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. [2]

మూలాలు

మార్చు
  1. "ఈటీవీ భారత్ వెబ్ సైటులో కడలి సత్యనారాయణ పై ప్రత్యేక కథనం".[permanent dead link]
  2. "గుడ్ రీడ్స్ వెబ్ సైటులో లెటర్స్ టు లవ్ పుస్తకంపై విశ్లేషణ".