కడ్డీ వాయిద్యం
‘కడ్డీ వాయిద్యం’ అనేది ఒక రకమైన సంగీత వాయిద్యం. ఇది వీణ మాదిరిగా ఉంటుంది.
విశేషాలు
మార్చుమిత్తుల అయ్యవార్లనీ, దాసరులనీ పిలువబడే వీరు, ఈ కడ్డీ వాయిద్యంలో ప్రవీణులు. వీణ మాదిరే దీనిని కూడా చేతి వ్రేళ్ళతోనే వాయిస్తారు. వీరు ముఖ్యంగా ఈ వాయిద్యం మీద భగవన్నామ సంకీర్తనలు వాయిస్తూ వుంటారు.
ఈ కడ్డీ వాయిద్యాన్ని ముందు నిల బెట్టుకుని రెండు సన్నని పుల్లలతో జలతరంగ్ వాయిద్యాన్ని వాయించినట్లు వాయిస్తారు. ఈ స్వర మాధుర్యం ఎంతో మధురంగా వుంటుంది. వీరి వృత్తికి ప్రాణప్రదమైంది ఈ వాయిద్యమే. అయితే ఈ వాయిద్యాన్ని అందరూ వాయించలేరు. దీనికి ప్రత్యేకమైన శిక్షణ తోనూ, సాధన తోనూ సాధించ వలసిందే. అందువల్లనే ఈ వాద్య కాండ్రలో ప్రవీణులు చాల తక్కువ. తెలంగాణలో ఈ వాయిద్యంలో ప్రసిద్ధు లైన వారు కరీంనగర్ జిల్లా మెట్టుపల్లి తాలూకాలో ఉన్నారు. ఈ కళా రూపాన్ని శిథిలం కాక ముందే రక్షించు కోవడం అవసరం.[1]
మూలాలు
మార్చు- ↑ తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.
బాహ్య లంకెలు
మార్చు- Aksharala Thera By Varala Anand (2020-08-20), ‘కడ్డీ వాయిద్యం’ 'KADDEE VAAYIDYAM', retrieved 2024-10-16