కనకలత (మలయాళ నటి)

 

కనకలత
జననం(1960-08-24)1960 ఆగస్టు 24
కొల్లాం, కేరళ, భారతదేశం
మరణం2024 మే 6(2024-05-06) (వయసు 63)
తిరువనంతపురం, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1981–2024
తల్లిదండ్రులు
  • పరమేశ్వరన్ పిళ్ళై
  • చిన్నమ్మ

కనకలత (1960 ఆగస్టు 24 - 2024 మే 6) ప్రధానంగా మలయాళ సినిమాలో పనిచేసిన భారతీయ నటి.[1][2] ఆమె మలయాళం, తమిళ భాషల్లో 360కి పైగా చిత్రాలు చేసింది. ఈ రెండు భాషల్లో ఆమె టెలివిజన్ ధారావాహికలలో కూడా ఎక్కువగానే నటించింది. ఆమె ప్రామాణి, ఇందులెఖ, స్వాతి తిరునాల్ వంటి నాటకాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

కేరళ కొల్లాంలో పరమేశ్వరన్ పిళ్ళై, చిన్నమ్మ దంపతులకు 1960 ఆగస్టు 24న జన్మించింది. ఆమె కొల్లాంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదివింది.[3] సినీ నటి కావడానికి ముందు ఆమె రంగస్థల నటిగా పనిచేసింది. 22 ఏళ్లకే వివాహం చేసుకున్న ఆమె 16 ఏళ్ల తరువాత భర్తతో విడాకులు తీసుకుంది.[4] పిల్లలు లేరు.

ఆమె 2024 మే 6న, 63 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో మరణించింది.[5] ఆమె చాలా కాలంగా పార్కిన్సన్స్, మతిమరుపుతో బాధపడుతున్నది.[6]

మూలాలు

మార్చు
  1. "Kanakalatha Death News: Mollywood actress Kanakalatha passes away at 63 after battle with Parkinson's and Dementia: Report". The Times of India. 6 May 2024. Retrieved 8 May 2024.
  2. "അനുഭവങ്ങള്‍ പാളിച്ചകള്‍... | mangalam.com". Archived from the original on 7 December 2013. Retrieved 21 February 2014.
  3. "CiniDiary".
  4. "അനുഭവങ്ങള്‍ പാളിച്ചകള്‍... - Page 2 | mangalam.com". Archived from the original on 5 November 2013. Retrieved 21 February 2014.
  5. "Actress Kanakalatha passes away; death at home in Thiruvananthapuram". Kerala Kaumudi. 6 May 2024. Retrieved 6 May 2024.
  6. "సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత | Malayalam Actress Kanakalatha Passes Away at 63 | Sakshi". web.archive.org. 2024-12-19. Archived from the original on 2024-12-19. Retrieved 2024-12-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)