కన్నెగంటి తిరుమలదేవి
కన్నెగంటి తిరుమలదేవి, తెలంగాణకు చెందిన మహిళా శాస్త్రవేత్త. ఇమ్యునాలజిస్ట్ గా, రోజ్ మేరీ థామస్ ఎండోడ్ చైర్ గా, ఇమ్యునాలజీ విభాగం వైస్ చైర్ గా, సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.[1] ఆరోగ్యం, వ్యాధిలో ఎన్ఎల్ఆర్ ప్రోటీన్లు, ఇన్‌ఫ్లమేసమ్‌ల పాత్రపై ప్రాథమిక దృష్టితో సహజమైన రోగనిరోధక శక్తి, తాపజనక కణాల మరణం వంటి అంశాలలో పరిశోధనలు చేసింది.[1]
కన్నెగంటి తిరుమలదేవి | |
---|---|
జననం | కొత్తగూడెం, భద్రాద్రి, తెలంగాణ | 1972 అక్టోబరు 18
నివాసం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
రంగములు | ఇమ్యునాలజిస్ట్ |
చదువుకున్న సంస్థలు | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | స్టెమ్ సెల్ థెరపీపై పరిశోధన |
జననం, విద్య
మార్చుతిరుమలదేవి 1972, అక్టోబరు 18న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో జన్మించింది.[2] కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ మహిళా కళాశాల నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం) పూర్తిచేసింది.[3][4] ఆ తరువాత హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ, పిహెచ్.డి. పూర్తిచేశాడు.[4]
వృత్తిరంగం
మార్చుతిరుమలదేవి పిహెచ్‌డి విద్యార్థిగా మొక్కల వ్యాధికారక కారకాలు, ఫంగల్ టాక్సిన్‌లను అధ్యయనం చేసే పరిశోధన ప్రారంభించింది.[5] తరువాత విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, ఒహియో రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌లు చేసి శిలీంధ్ర జన్యుశాస్త్రం, మొక్కల సహజమైన రోగనిరోధక శక్తిని అధ్యయనం చేసింది.[3][4] మిచిగాన్ విశ్వవిద్యాలయంలో క్షీరదాల సహజమైన రోగనిరోధక శక్తిని అధ్యయనం చేసింది.[3][4] 2007లో సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌లో ఇమ్యునాలజీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ మెంబర్‌గా చేరింది, అక్కడ ఇన్‌ఫ్లమేసమ్‌లు-సెల్ డెత్‌పై అధ్యయనం చేయడంపై దృష్టి సారించింది.[1][4] 2013లో పూర్తి సభ్యురాలిగా పదోన్నతి పొందింది. 2016లో ఇమ్యునాలజీ విభాగానికి వైస్ చైర్‌గా మారింది, 2017లో రోజ్ మేరీ థామస్ ఎండోడ్ చైర్‌ను పొందింది.
సన్మానాలు
మార్చు- అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇమ్యునాలజీ-BD బయోసైన్సెస్ ఇన్వెస్టిగేటర్ అవార్డు (2015) [6]
- విన్స్ కిడ్ మెమోరియల్ మెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2015)[1]
- సొసైటీ ఫర్ ల్యూకోసైట్ బయాలజీ అత్యుత్తమ మాక్రోఫేజ్ పరిశోధకుడు డాల్ఫ్ ఓ. ఆడమ్స్ అవార్డు (2017)[7][8]
- అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ ఎలి లిల్లీ అండ్ కంపెనీ-ఎలాంకో రీసెర్చ్ అవార్డ్ (2017)[8]
- ఇంటర్‌ఫెరాన్, సైటోకిన్ రీసెర్చ్ సేమౌర్ & వివియన్ మిల్‌స్టెయిన్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ (2018)[1][5]
- క్లారివేట్స్/వెబ్ ఆఫ్ సైన్స్ లిస్ట్ ఆఫ్ హైలీ సైటెడ్ పరిశోధకుల (2017, 2018, 2019, 2020, 2021)[1][9][10][11][12]
- ఎన్ఐహెచ్ ఆర్35 అత్యుత్తమ ఇన్వెస్టిగేటర్ అవార్డు (2020)[13][14]
- అమెరికన్ అకాడమీ ఆఫ్ మైక్రోబయాలజీలో ఫెలోషిప్‌కి ఎన్నిక, అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ (2021)[15]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Thirumala-Devi Kanneganti, PhD". www.stjude.org. Retrieved 2022-03-29.
- ↑ "కరోనాపై పోరులో.. తెలుగు బిడ్డ". m.andhrajyothy.com. 2020-11-22. Archived from the original on 2022-03-29. Retrieved 2022-03-29.
- ↑ 3.0 3.1 3.2 Olsen, Patricia R. (2017-10-27). "After Witnessing Illness in India, She Seeks Ways to Fight It". The New York Times. ISSN 0362-4331. Retrieved 2022-03-29.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 "Thirumala-Devi Kanneganti: Immersed in Immunology". The Scientist Magazine. Retrieved 2022-03-29.
- ↑ 5.0 5.1 "Thirumala-Devi Kanneganti". The Milstein Awards. 2018-06-29. Archived from the original on 2022-05-26. Retrieved 2022-03-29.
- ↑ "AAI-BD Biosciences Investigator Award". The American Association of Immunologists. Retrieved 2022-03-29.
- ↑ "Dolph O. Adams Award". Society for Leukocyte Biology. Retrieved 2022-03-29.
- ↑ 8.0 8.1 Geiger, Terrence (2017-10-19). "Thirumala-Devi Kanneganti, PhD, honored for discoveries in immunology". St. Jude Progress. Retrieved 2022-03-29.
- ↑ "Highly Cited Researchers".
- ↑ "St. Jude researchers among the most highly cited in 2019". www.stjude.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.
- ↑ "St. Jude researchers are among the most highly cited scientists in the last decade". www.stjude.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.
- ↑ Kumar, Ruma. "St. Jude scientists make prestigious list of Highly Cited Researchers". www.stjude.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.
- ↑ "St. Jude immunologist Thirumala-Devi Kanneganti, Ph.D., receives NCI Outstanding Investigator Award". www.stjude.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.
- ↑ "NCI Outstanding Investigator Award Recipients - National Cancer Institute". www.cancer.gov (in ఇంగ్లీష్). 2015-10-14. Retrieved 2022-03-29.
- ↑ "65 Fellows Elected into the American Academy of Microbiology". ASM.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.