కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్త్తగూడెం మండలం లోని పట్టణం

కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కొత్తగూడెం మండలానికి చెందిన పట్టణం.భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రం.కొత్తగూడెం మండలం పేరుతోనున్న మండలానికి ప్రధాన కేంద్రం.[3] ఇది 1971లో 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడి, 1995లో ఫస్ట్ గ్రేడ్ కొత్తగూడెం పురపాలకసంఘంగా మార్చబడింది.[4][5]

  ?కొత్తగూడెం
తెలంగాణ • భారతదేశం
కొత్తగూడెం రైల్వే స్టేషన్
కొత్తగూడెం రైల్వే స్టేషన్
కొత్తగూడెం రైల్వే స్టేషన్
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 16.10 కి.మీ² (6 చ.మై)[1]
జిల్లా (లు) ఖమ్మం జిల్లా
జనాభా
జనసాంద్రత
79,819[2] (2011 నాటికి)
• 4,958/కి.మీ² (12,841/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం కొత్తగూడెం పురపాలక సంఘము


గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 1,88,191 - పురుషులు 93,300 - స్త్రీలు 94,891,పిన్ కోడ్: 507101.

భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రం.

మార్చు

లోగడ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా భద్రాద్రి పేరుతో నూతన జిల్లాను, కొత్తగూడెం జిల్లా పరిపాలన కేంద్రంగా ఉండేలాగున, అలాగే మండల కేంద్రంగా రామవరం గ్రామంతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ తేది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[6]

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం

మార్చు

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2023, జనవరి 12న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7][8]

ప్రభుత్వం, రాజకీయాలు

మార్చు

పౌర పరిపాలన

కొత్తగూడెం పురపాలక సంఘము 1971 లో స్థాపించిబడింది. ఇది 33 వార్డులు కలిగి ఉన్న ఒక మొదటి గ్రేడ్ పురపాలక సంఘము. ఈ పట్టణ అధికార పరిధి 16.10 కి.మీ2 (6.22 చ. మై.).[1]

రవాణా సదుపాయాలు

మార్చు

కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను "భద్రాచలం రోడ్డు " అనే పేరుతో పిలుస్తారు. భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంట ప్రయాణము. పాల్వంచ పట్టణం మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణంలో చెప్పోకోదగ్గ ముఖ్య అంశము సింగరేణి సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరం అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది పాల్వంచ పట్టణంలో ఉంది. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా ఉంది.

భౌద్ధం ఆనవాళ్ళు

మార్చు

కొత్తగూడెం మండలం హేమచంద్రాపురంగ్రామంలోని కారుకొండగుట్ట లకు ఘనమైన చరిత్ర ఉంది. రాతితో బుద్ధుడు పద్మాసనంలో కూర్చొని ఉండటం.. ఇక్కడి ప్రత్యేకత. వీటితో పాటు ఈ గుట్టపై అతి పెద్ద సొరంగం కూడా ఉందని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ కొండకు ఆగ్నేయంగా రెండు బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకే రాయిపై 4 వైపులా బుద్ధుని ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ చరిత్ర నిక్షిప్తమై ఉన్నట్లు ప్రభుత్వం 1989లోనే గుర్తించి నిర్ధారించింది.

మండలంలోని పట్టణాలు

మార్చు

శాసనసభ నియోజకవర్గం

మార్చు

విశేషాలు

మార్చు

ఇక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణంగా పిలుస్తారు. కొత్తగూడెం, పాల్వంచలు జంట పట్టణాలు. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి.

విద్యాసంస్థలు

మార్చు

గ్రామ ప్రముఖులు

మార్చు
  1. కన్నెగంటి తిరుమలదేవి, మహిళా శాస్త్రవేత్త.[10]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
  2. "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 14–15, 40. Retrieved 2 January 2016.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "Basic Information of Municipality, Kothagudem Municipality". kothagudemmunicipality.telangana.gov.in. Archived from the original on 15 July 2019. Retrieved 3 May 2021.
  5. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived from the original on 2022-01-06. Retrieved 2022-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2017-11-15.
  7. "kcr inaugurates kothagudem collectorate office". Vaartha. 2023-01-12. Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-13.
  8. telugu, NT News (2023-01-12). "కొత్తగూడెం కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-13.
  9. "కొత్తగూడెం వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్.. నెరవేరిన చిరకాల స్వప్నం". T News Telugu. 2022-08-27. Archived from the original on 2022-09-08. Retrieved 2022-11-01.
  10. "కరోనాపై పోరులో.. తెలుగు బిడ్డ". m.andhrajyothy.com. 2020-11-22. Archived from the original on 2022-03-29. Retrieved 2022-03-29.

వెలుపలి లింకులు

మార్చు