కన్నెగంటి మధు
కన్నెగంటి మధు ప్రముఖ రంగస్థల నటులు.
కన్నెగంటి మధు | |
---|---|
జననం | నవంబర్ 6, 1955 తెనాలి, గుంటూరు జిల్లా |
ఇతర పేర్లు | కన్నెగంటి మధు |
వృత్తి | రంగస్థల కళాకారులు |
ప్రసిద్ధి | తెలుగు రంగస్థల నటుడు. |
తండ్రి | కన్నెగంటి నాసరయ్య |
తల్లి | సీతాకుమారి |
జననం
మార్చుమధు గుంటూరు జిల్లా తెనాలిలో కన్నెగంటి నాసరయ్య, సీతాకుమారి దంపతులకు 1955 నవంబర్ 6న జన్మించారు. నాసరయ్య, సీతాకుమారిలు రంగస్థల కళాకారులు.
రంగస్థల ప్రస్థానం
మార్చుతల్లిదండ్రులిద్దరు రంగస్థల కళాకారులు అవడంతో వారి వారసత్వం మధు అబ్బింది. 11 సంవత్సరాల వయస్సులో ఇదా ప్రపంచం నాటకంలో ప్రప్రథమంగా పాత్రధారణ చేసారు. తర్వాత సమాజం మారాలి, పల్లెపడుచు మొదలైన నాటకాలలో పాల్గొన్నారు. జనతా ఆర్ట్ ధియేటర్ లో చేరి, వారు ప్రదర్శించిన నాటకాలలో ప్రధాన పాత్రలు ధరించారు. 1978 నుండి తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో కార్యనిర్వహక సభ్యులుగా పనిచేశారు.
దేవిశెట్టి కృష్ణారావుతో కలిసి JJ & NVR ఆర్ట్ థియేటర్ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ పేరుమీద అనేక పరిషత్తులలో పాల్గొని, ప్రథమ, ద్వితీయ బహుమతులు అందుకున్నారు.
నటించిన నాటకాలు
మార్చు- ఇదా ప్రపంచం
- సమాజం మారాలి
- పల్లెపడుచు
- భయం
- చీకటి తెరలు
- రాజీనామా
- రైలు ప్రమాదం
- అడ్రసు లేని మనుష్యులు
- అతిథి దేముల్గొస్తున్నారు
- హిమజ్వాల
- కుక్క
- క్షణం
- నీరు పోయ్
- పద్మవ్యూహం
రేడియో నాటకాలు
మార్చుఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1980 నుండి క్యాజువల్ ఆర్టిస్ట్ గా చేశారు.
- ఇదే నా సంప్రదాయం
- న్యాయం నెగ్గింది
- చీకటిలోంచి వెలుగులోకి
- అరుణకాంతి
- శాపం
- ఈ దేశం ఏం కావాలి
- దేశం పిలుస్తోంది
- గోడ మీద బొమ్మ
ఇతర వివరాలు
మార్చుమధు మంచి ఫొటోగ్రాఫర్ గా ప్రసిద్ధి చెందారు. మధు తీసిన ఫోటోలు అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. కొన్ని సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు.
మూలాలు
మార్చు- కన్నెగంటి మధు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 320.