కన్నేపల్లి మండలం
కన్నేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా లోని ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన బెల్లంపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామం.
కన్నేపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, కన్నేపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | కన్నేపల్లి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
పిన్‌కోడ్ | 504219 |
వివరాలు
మార్చుతెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, కన్నేపల్లి ఆదిలాబాదు జిల్లా, భీమిని మండలంలో భాగంగా ఉండేది. భీమిని, వేమన్‌పల్లి మండలాల నుండి గ్రామాలను విడదీసి కన్నేపల్లి మండలాన్ని ఏర్పరచారు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 169 చ.కి.మీ. కాగా, జనాభా 18,549. జనాభాలో పురుషులు 9,257 కాగా, స్త్రీల సంఖ్య 9,292. మండలంలో 4,917 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.