బెల్లంపల్లి రెవెన్యూ డివిజను

బెల్లంపల్లి రెవెన్యూ డివిజను తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. మంచిర్యాల జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం బెల్లంపల్లిలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.[3]

బెల్లంపల్లి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన మార్చు

మంచిర్యాల డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం బెల్లంపల్లి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 కాసిపేట మండలం 20 రెవెన్యూ గ్రామాలు
2 బెల్లంపల్లి మండలం 12 రెవెన్యూ గ్రామాలు
3 వేమనపల్లి మండలం 30 రెవెన్యూ గ్రామాలు (7 నిర్జన గ్రామాలు)
4 నెన్నెల్ మండలం 21 రెవెన్యూ గ్రామాలు
5 తాండూర్ మండలం 20 రెవెన్యూ గ్రామాలు
6 భీమిని మండలం 21 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
7 కన్నేపల్లి మండలం 24 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-02-25.
  3. Andhra Jyothy (23 August 2016). "జిల్లాలు.. 27". m.andhrajyothy.com. Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  4. "REVENUE DIVISION | Mancherial District | India". www.mancherial.telangana.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-28. Retrieved 2022-02-25.
  5. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-02-25. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)