కన్యాదానం (1955)
కన్యాదానం 1955 లో విడుదలైన నలుపు-తెలుపు చలన చిత్రం. ఇది కాంతారావు కథానాయకునిగా బి.విఠలాచార్య నిర్మించిన తొలిచిత్రం. జానపద చిత్రాలలో ఒరవడి సృష్టించిన ఈ జంట తొలిచిత్రం సాంఘికం కావటం విశేషం. ఈ చిత్రం విజయవంతం కాలేదు. ఈ చిత్రం తర్వాత కాంతారావుని కథానాయకునిగా 'జయ విజయ' అనే జానపద చిత్రాన్ని తొలిసారిగా విఠలాచార్య నిర్మించారు. అది విజయవంతమయ్యింది. విఠల్ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను బి.విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. షాపుకారు జానకి నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]
కన్యాదానం (1955) (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గంసవరించు
- నిర్మాత,దర్శకుడు: బి.విఠలచార్య
- స్టూడియో: వైటల్ ప్రొడక్షన్స్
- నిర్మాత: బి. విట్టలచార్య;
- స్వరకర్త: రాజన్-నాగేంద్ర
- విడుదల తేదీ: జూలై 14, 1955
- IMDb ID: 0280823
పాటలుసవరించు
- అంతా మోసమురా బాబు అంతా మోసమురా ఈ జగమంతా - జిక్కి
- ఓరోరి తెలుగువాడ వయ్యారి తెలుగువాడా దేశమంటే - జిక్కి
- మురళీధరుని ముఖము కంటినే మది మురసిపోయి - పి.లీల
- వన్నియలో లేదు విలువ కన్నియ గుణమే కనుచలువ - ఎ.ఎం. రాజా
మూలాలుసవరించు
- ↑ "Kanyadhanam (1955)". Indiancine.ma. Retrieved 2020-08-23.