కపిలగిరి యోగానంద నరసింహస్వామి

కపిలగిరి యోగానంద నరసింహ స్వామి జన్మనామం కొండెబోయిన సుబ్బారాయుడు. ఈయన కొండెబోయిన గురుమూర్తి, లక్ష్మమ్మ దంపతులకు 1886 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా[1] మార్కాపురం[2] పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని తోకపల్లి గ్రామంలో జన్మించాడు. భగవంతుని ఆదేశంపై భువిపై జన్మించిన యోగులలో ఒకరుగా ఈయనను భక్తులు భావిస్తారు.[3]

కపిలగిరి యోగానంద నరసింహ స్వామి
జననం1986
ప్రకాశం జిల్లా,ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
నిర్యాణము1960 డిసెంబర్ 30 (1882 శార్వరి పుష్య శుద్ద త్రయోదశి )
తండ్రికొండెబోయిన గురుమూర్తి
తల్లిలక్ష్మమ్మ

బాల్యం విద్యాభ్యాసం

మార్చు

ఇతని తల్లి దండ్రులు కుమారుడికి బడిఈడు రాగానే వీధిబడిలో వేసారు కానీ అతనికి బడి చదువులు ఏమాత్రం నచ్చలేదు. మిత్రులతో పాటు పశువులను కాయడం కోసం వెళ్లి, అక్కడి కొండకోనలు, చెట్లూ పుట్టలూ పకృతి పరిశీలిస్తూ పులకించి పోయేవాడు. అక్కడ పశువులు కాసే సహచరులను శిష్యులుగా కూర్చోబెట్టుకునే అనేక పౌరాణిక దైవిక ఆధ్యాత్మిక కథలను చెపుతూ వుండేవాడు. ఇతనికి చక్కగా పాటలు పాడటం కూడా వచ్చు. ఇతని పాటలను మిత్రులు మంత్రముగ్ధలై వింటూ వుండే వారు. భక్తి పాటలు పాడుతూ పరవశుడై నాట్యం చేసేవాడు. వీధి నాటికలు వేయడం కూడా బాగా ఇష్టం. యక్షగానం కొన్నాళ్ళు సాధన చేసాడు. సుబ్బారాయుడు రంగస్థలంపై చేస్తున్న చక్కటి నటనను చూసి ముచ్చట పడిన ఒక వైష్ణవ పండితుడు అతడిని తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చి విద్యాబుద్దులు చెప్పసాగాడు. వేదాంతం, ఉపనిషత్తులు శ్రద్ధగా వినేవాడు. మంత్రాలను బాగా వల్లెవేసి మనసుకు పట్టించుకునేవాడు.

ఇల్లు వదలుట

మార్చు

యోగిగా పరివర్తన

మార్చు

రచనలు

మార్చు

పరమహంస యోగానంద నరసింహ మహర్షి తన శిష్యుడు గురుదత్త బ్రహ్మర్షి నారాయణ స్వామికి చేసిన ప్రభోదం గురుశిష్య సంవాదం లేదా పరమహంస ప్రదీపిక అనే పేర్లు గల ఆధ్యాత్మిక గ్రంధం గా రూపొందించి. ఇది నారాయణ స్వామి చేతి వ్రాతలో వున్నది. దీనిలో మొదటి గురువంశావళి జన్మ చరిత్ర వుంది.

  • ప్రధమ భాగంలో : ఆత్మ రామాయణం ఇది వాల్మీకి రామాయణానికి యోగపరమైన వివరణ
  • ద్వితీయ బాగం : సద్గురువు లక్షణాలు, జ్ఞానం సత్యం, భక్తి పరోపకారం వంటి విషయాలు
  • తృతీయ భాగం : మహాభారత సౌరభం ఇది ప్రధమ భాగం రామయణం వలెనే భారతానికి యోగపరమైన వివరణ
  • చతుర్ధ భాగం : గురుధ్యాన రూప రత్నాలు

నిర్యాణం

మార్చు

తన వారసునిగా శిష్యుడు నారాయణ దాసును ప్రకటించి భావికార్యక్రమాలను నిర్వహించవలసినదిగా ఆధేశించినాడు. తన ఫీఠానికి వారసుడిగా అభిషేకించి అవతారం చాలించే సమయం ఆసన్నం అయినది అని చెప్పాడు. శాలివాహన శకం 1882 శార్వరి పుష్య శుద్ద త్రయోదశి శుక్రవారం అంటే గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం 30వ తారీఖు డిసెంబరు 1960 పగలు సమాధి స్థితులై వుండగా బ్రహ్మరంద్రం చేదించుకుని విశ్వాత్మలో కలిసిపోయాడు. శ్రీ నారాయణ దాసు విధి విధానోక్తంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి, దూర ప్రాంతాల నుంచి వచ్చే శిష్యుల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని శుక్ర, శని వారాలు అట్లే వుంచి ఆదివారం నాడు కపిలగిరి సోఫానం సమీపాన ఈశాన్యంలో సమాధి చేసినారు. అప్పటి నుంచి ప్రతి ఏటా గురుసమారాధనలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "అధికారిక జాలస్థలి, ప్రకాశం జిల్లా". Archived from the original on 2019-04-18. Retrieved 2019-07-23.
  2. "మార్కాపురం చెన్నకేశవస్వామిని దర్శించుకోండి - వెబ్‌దునియా". Archived from the original on 2016-03-04. Retrieved 2014-09-28.
  3. బిరుదరాజు, రామరాజు. ఆంధ్రయోగులు ప్రధమభాగం (1988 ed.). నవోదయ బక్ హౌస్. p. 391-397.

బయటి లంకెలు

మార్చు