కప్పగంతుల మల్లికార్జునరావు

కప్పగంతుల మల్లికార్జునరావు ( డిసెంబరు 23, 1936 - నవంబరు 11, 2006) కథా, నవలా, నాటక రచయిత.

కప్పగంతుల మల్లికార్జునరావు
Kappaganthula Mallikarjunarao.JPG
కప్పగంతుల మల్లికార్జునరావు
జననండిసెంబరు 23, 1936
కారుమంచి, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా
మరణంనవంబరు 11, 2006
ప్రసిద్ధికథా, నవలా, నాటక రచయిత
తండ్రిఆంజనేయశాస్త్రి
తల్లిమల్లికాంబ

జీవిత విశేషాలుసవరించు

ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన కారుమంచి గ్రామంలో 1936, డిసెంబరు 23వ తేదీన జన్మించాడు.[1] ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక సాహిత్యం - విమర్శనాత్మక పరిశీలన అనే ఎం.ఫిల్ పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెలమల సిమ్మన్న పర్యవేక్షణలో జరిగింది.

రచనలుసవరించు

  1. కత్తుల పంజరం
  2. కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -2
  3. కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -3
  4. కప్పగంతుల మల్లికార్జునరావు నాటికలు నాలుగు
  5. ప్రపంచ నాటకరంగ ధోరణులు-చారిత్రక నేపథ్యం
  6. నాటక సమీక్ష
  7. మునపటి కథకులు ముప్ఫయ్ ముగ్గురు
  8. వ్యాసమాలిక (ఆధునిక నాటకరంగం, తెలుగు సాహిత్యంపై వ్యాసాలు)
  9. ది నీడిల్ (నవల)
  10. అశోకుని ఆత్మవిచారము (ఏకపాత్ర రూపకం)
  11. ఉద్ధారకులు (నాటిక)
  12. పరిష్కృతి (నాటిక)
  13. సప్తపది (నాటకం)
  14. దూరపు కొండలు (నాటకం)
  15. తపస్విని (నవల)
  16. కాంతికిరణం (నవల)
  17. నీలినీడలు (నాటకం)
  18. కాంతిపథం
  19. యాచకులు (స్త్రీ పాత్ర లేని నాటకం)
  20. నూటపదహారు (నాటిక)
  21. మారని మనిషి (నాటకం)
  22. వైకుంఠపాళి (నవల)
  23. జ్వాల (స్త్రీపాత్ర లేని నాటిక)
  24. క్షంతవ్యులు (స్త్రీపాత్ర లేని నాటిక)
  25. సాలెగూడు (నాటిక)
  26. చరిత్రహీనులు (నాటిక)
  27. దాగుడు మూతలు (నాటిక)
  28. సిగరెట్లు త్రాగరాదు (నాటిక)
  29. మబ్బు వీడింది (నాటిక)
  30. వెలుగు (నాటిక)
  31. ఆదర్శాలు ఆవలి అంచున (నాటిక)
  32. నయనతార (నాటిక)

మూలాలుసవరించు

  1. "ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- నాగభైరవ కోటేశ్వరరావు, జూన్ 1971 - పేజీ 91". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-05.