కమల్ రణదివె

భారతదేశ కణ జీవ శాస్త్రవేత్త

కమల్ రణదివె (నవంబరు 11, 1917 - 2001) భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు.[1] ఈమె భారత మహిళా శాస్త్రవేత్తల సంఘానికి స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి టిష్యూ కాన్సర్ పరిశోధనా ప్రయోగశాలను బొంబాయిలో నెలకొల్పారు [2]

కమల్ రణదివె
జననం1917
పుణె, మహారాష్ట్ర
మరణం2001
జాతీయతభారతీయులు
రంగములుకణ జీవ శాస్త్రం

బాల్యం-విద్యాభ్యాసం మార్చు

ఈమె 1917 నవంబరు 11మహారాష్టలో జన్మించారు. ఈమె "పూణె" లోని బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఈమె "ఫెర్గుస్సన్ కాలేజీ" నుండి బోటనీలో గ్రాడ్యుయేషన్ చేశారు. కణ జీవశాస్త్రంలో ఎం.యస్సీని పూణే లోని వ్యవసాయ కాలేజీలో చదివిన తర్వాత బొంబాయి యూనివర్శిటీ నుంచి కణజీవశాస్త్రంలో పి.హె.డి. చేశారు. ఈమె ప్రత్యేకంగా ఎక్స్ పెరిమెంటల్ బయాలజీలో పరిశోధనలు నిర్వహించారు. ఈమె ఇండియన్ కాన్సర్ పరిశోధనా కేంద్రంలో పాథాలజిస్ట్ వి.ఆర్.ఖనోల్కర్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేశారు. రణదివే పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయుటకు విదేశాలు వెళ్లారు.[3]

పరిశోధనలు మార్చు

డాక్టర్ కమల బ్రెస్ట్ కేన్సర్ మీద యూరోపియన్ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ తో కలసి అధ్యయనం (1955) చేశారు. సెల్ టిష్యూ, ఆర్గాన్ కల్చర్ మీద 1972 లో పరిశోధనలు చేశారు. భారత ప్రభుత్వ ప్లానింగ్ కమిషన్ వారి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఏకైక మహిళా శాస్త్రవేత్తగా (1985) గుర్తింపు పొందారు. మహారాష్ట్ర కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుల కమిటీలో సభ్యురాలిగా (1989) ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ కమిటీ సభ్యురాలిగా (1991) ఉన్నారు. దాదాపు 250 పరిశోధనా పత్రాలను, గ్రంథ రచనలు వెలువరించిన డాక్టర్ కమల టాటా మెమోరియల్ సెంటర్ (ముంబై) వారి కేన్సర్ రీసెర్చ్ సెంటర్ లో ఎమిరిటస్ సైంటిస్ట్ గా చిరకాలం పనిచేసి పదవీవిరమణ చేసి 2001 లో మరణించారు.

అవార్డులు మార్చు

డాక్టర్ కమల తాను సాధించిన పరిశోధన విజయాలకు పలు గౌరవ పురస్కారాలు అందుకున్నారు. 1982 లో బనారస్ హిందూ యూనివర్శిటీ మహిళా మహా విద్యాలయం వారి డిస్టింగ్విష్డ్ హ్యూమన్ అవార్డ్, 1991 లో అద్వితీయ పరిశోధనకు గాను టాటా మెమోరియల్ గోల్డెన్ జూబ్లీ అవార్డ్ అండ్ మెమెంటోను, 1992 లో భారత ప్రభుత్వం వారి పద్మభూషణ్ గౌరవ పురస్కారాలు పొందారు.

సూచికలు మార్చు

  1. Mody, Rekha (1999). A Quest For Roots. Gurgaon, Haryana: Shubhi Books. Archived from the original on 2013-08-17. Retrieved 2013-08-29.
  2. Bhisey, Rajani (2008). Lilavati's Daughters: The Women Scientists of India (PDF). Bangalore: Indian Academy of Sciences. pp. 24–26.
  3. Bhisey, R. "Obsessed with excellence" (PDF). Indian Academy of Sciences. Retrieved 20 October 2012.
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.

వెలుపలి లింకులు మార్చు