కరీంనగర్ పోలీస్ కమీషనరేట్

కరీంనగర్ జిల్లాలో చట్టాన్ని అమలుచేయడానికి, నేర దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న నగర

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో చట్టాన్ని అమలుచేయడానికి, నేర దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న నగర పోలీసు విభాగం.[1][2] దీనికి పోలీస్ కమిషనర్ నేతృత్వం వహిస్తాడు. వి.బి.కమలాసన్ రెడ్డి (ఐపిఎస్) ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పోలీస్ కమీషనర్ గా ఉన్నాడు.[3] కరీంనగర్ జిల్లా పరిధి మొత్తం జిల్లా పోలీసు కమిషనరేట్ కార్యాలయం ద్వారా నిర్వహించబడుతుంది.[4]

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్
మామూలుగా పిలిచే పేరుకరీంనగర్ నగర పోలీస్
Agency overview
ఉద్యోగులుకమీషనర్ ఆఫ్ పోలీసు
డిప్యూటి కమీషనర్
అడిషినల్ డిప్యూటి కమీషనర్స్
పోలీసు ఇస్స్పెక్టర్స్
అసిస్టెంట్ పోలీసు ఇస్స్పెక్టర్స్
సబ్ ఇస్స్పెక్టర్స్
Jurisdictional structure
Operations jurisdictionతెలంగాణ, భారతదేశం
Legal jurisdictionకరీంనగర్ జిల్లా
Governing bodyతెలంగాణ ప్రభుత్వం
General nature
ప్రధాన కార్యాలయంకరీంనగర్, తెలంగాణ,  India
Agency executive
  • అభిషేక్ మహంతి (ఐపిఎస్), కమీషనర్ ఆఫ్ పోలీస్
Parent agencyతెలంగాణ రాష్ట్ర పోలీస్

చరిత్ర మార్చు

ఇక్కడి ప్రజలు కరీంనగర్ జిల్లాను మొదట ఎలగందల అని పిలిచేవారు. ఈ జిల్లా వేద అభ్యాసానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. శాతవాహన సామ్రాజ్యపు ప్రధాన కేంద్రం ఇది. నిజాం రాజు కాలంలో కరీంనగర్ గా పేరు మార్చబడింది. జిల్లా విస్తీర్ణం 11,823 చదరపు కిలోమీటర్లు కాగా, ఇక్కడ 38,96,033 లక్షలమంది నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 57 మండలాలు, 1103 గ్రామాలు ఉన్నాయి. ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లా, ఈశాన్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, దక్షిణాన హన్మకొండ జిల్లా, నైరుతిలో మెదక్ జిల్లా, పశ్చిమాన నిజామాబాద్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.[5]

సంస్థాగత నిర్మాణం మార్చు

ఐపిఎస్ అధికారైన పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. ఇందులో సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజనులో సర్కిల్స్ ఉంటాయి. ప్రతి సర్కిల్ లో నిర్దిష్ట సంఖ్యలో పోలీస్ స్టేషన్లు ఉంటాయి. కరీంనగర్ జిల్లాలో 70 పోలీస్ స్టేషన్లు, 19 సర్కిళ్ళు, 6 – సబ్ డివిజన్‌లు ఉన్నాయి. జిల్లాలో సుమారు 5000 మంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు.

పోలీస్ స్టేషన్లు మార్చు

ఈ కమీషనరేట్ పరిధిలో కరీంనగర్ (I) టౌన్, కరీంనగర్ (II) టౌన్, కరీంనగర్ (III) టౌన్, కరీంనగర్ రూరల్, చింతకుంట, గన్నేరువరం, ఎల్ఎమ్డి కాలనీ, మానకొండూర్, చొప్పదండి, గంగాధర, రామడుగు, హుజురాబాద్, సైదాపూర్, కేశవపట్నం, జమ్మికుంట, ఎల్లంతకుంట, వీణవంక, చిగురుమామిడి మొదలైన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.

పనితీరు మార్చు

పోలీసులు చేసిన నిర్విరామ ప్రయత్నాల కారణంగా, నక్సలెట్స్ బెదిరింపులు తగ్గాయి. ఇతర పోలీసు శాఖలలో పోలీస్తే కరీంనగర్ పోలీస్ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకుంది. పరిపాలనా సౌలభ్యం కోసం, నేరాల నివారణ, గుర్తింపు, సమర్థవంతమైన, మెరుగైన పోలీసింగ్, పరిపాలనలో సమర్ధతను బలోపేతం చేయడానికి పోలీస్ ఫోర్స్ ప్రధానంగా దిగువ పేర్కొన్న అనేక ముఖ్యమైన విభాగాలుగా విభజించబడింది.[6]

  1. పరిపాలన
  2. సివిల్ పోలీసులు
  3. సాయుధ రిజర్వ్ పోలీసులు
  4. జిల్లా స్పెషల్ బ్రాంచ్
  5. నక్సలైట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
  6. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
  7. జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో
  8. జిల్లా రవాణా రికార్డు బ్యూరో
  9. ట్రాఫిక్ పోలీస్
  10. కమ్యూనికేషన్
  11. ఫింగర్ ప్రింట్స్ బ్యూరో
  12. క్లూస్ టీమ్
  13. బిందు జాబితా అంశం
  14. జిల్లా కాపలాదారులు
  15. సెంట్రల్ ఫిర్యాదు సెల్

సురక్ష యోజన మార్చు

కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ఆధ్వర్యంతో వృద్ధులపై పెరుగుతున్న దాడులను అరికట్టి, వృద్ధుల భద్రత - రక్షణ కల్పించడానికి 'సురక్ష యోజన' అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించబడింది. 60 ఏళ్ళు దాటిని వృద్ధులు పోలీస్ పోలీస్ కంట్రోల్ రూమ్‌ 9440900971 నంబర్‌లో సంప్రదించి, వారి పేర్లు-చిరునామాలతో సహా వారి వివరాలను నమోదు చేసుకోవాలి. సంబంధిత పోలీస్ స్టేషన్లకు వివరాలు పంపబడి, ఆ వివరాల ఆధారంగా, స్థానిక పోలీసు అధికారులు ప్రజలను సంప్రదించి వారి భద్రత, రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి అవగాహన కల్పిస్తారు.[7]

సేవలు మార్చు

  1. 'పౌరుల ఫీడ్‌బ్యాక్'లో 59 శాతం మంది ఫిర్యాదుదారులు పోలీసు సేవలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.[8]
  2. 2019, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ మహిళా పెట్రోలింగ్, బ్లూ కోల్ట్, క్విక్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటుచేసింది. తెలంగాణలో తొలిసారిగా మహిళా కమాండ్ ట్రూప్ ను ప్రవేశపెట్టింది.[9]

కమిషనర్లు మార్చు

మూలాలు మార్చు

  1. "Khammam made police commissionerate". 10 October 2016 – via www.thehindu.com.
  2. "Godavarikhani, Karimnagar Police Commissionerates to open". 10 October 2016 – via Business Standard.
  3. "Telangana's IPS officers transferred, V Satyanarayana appointed Karimnagar CP". The New Indian Express. Retrieved 2021-08-19.
  4. hansindia. "Karimnagar Police Commissionerate: Latest News, Videos and Photos of Karimnagar Police Commissionerate | The Hans India - Page 1". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-19.
  5. "About Us :: Karimnagar Police Commissionerate Official Website". www.karimnagarpolice.in. Archived from the original on 2021-08-19. Retrieved 2021-08-19.
  6. "POLICE | Karimnagar | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-19.
  7. "Karimnagar Police's 'Suraksha Yojana' for safety of elderly". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-11. Retrieved 2021-08-19.
  8. "Karimnagar cops most friendly, shows poll". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2018-05-13. Retrieved 2021-08-19.
  9. "Karimnagar Commissionerate Introduces Women Patrolling on IWD". www.uniindia.com. Retrieved 2021-08-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. The Hindu (27 July 2021). "V. Satyanarayana is new Karimnagar Police Commissioner" (in Indian English). Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.