కరీంనగర్ జిల్లాలో సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో(సిల్వర్ పిలిగ్రి) నాణ్యమైంది.వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే ఈ కళకు కరీంనగర్‌ జిల్లా పుట్టినిల్లు . దారం నమూనాలో ఉండే వెండి, బంగారు తీగెలతో గృహోపకరణాలను తయారు చేసే పద్ధతినే సిల్వర్‌ ఫిలిగ్రీ అంటారు. సామాన్యంగా జనం వాడుకలో ఉండే ప్లేటులు, చెవిరింగులు, మెడను అలకరించే ఆభరణాలు, గిన్నెలు, కీచైన్స్‌, చెంచాలు లాంటివి ఈ ఫిలిగ్రీ కళలో రూపొందిస్తారు.[1]

విశేషాలుసవరించు

ఇది అతి ప్రాచీనమైన చేతిపని,అతి సన్నని వెండి తీగల అల్లికలతో డిజైన్లు తయారు చేస్తారు. యాష్‌ట్రేలు (గాజుతో), తమలపాకుల పెట్టెలు, చేతిబొత్తాలు, భరిణెలు, పతకాలు, గుండీలు, ఫొటోఫ్రేమ్‌లు మొదలైన అనేక రకాల వస్తువులను తయారు చేస్తారు

చరిత్రసవరించు

సుమారు 200 ఏళ్ల కిందట ఒకప్పటి జిల్లా కేంద్రం ఎలగందులలో ఈ కళ పురుడు పోసుకుంది. కడార్ల పనయ్య (మునయ్య) అనే స్వర్ణకారుడు ఈ కళకు ఆద్యుడు. 1905లో జిల్లా కేంద్రం కరీంనగర్‌కు చేరుకున్న ఇతని వారసులు ఇప్పటికీ ఈ కళను కాపాడుతూ వస్తున్నారు.[2]

మూలాలుసవరించు