కరేరి సరస్సు
కరేరి సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో గల ఒక మంచి నీటి సరస్సు.
కరేరి సరస్సు | |
---|---|
ప్రదేశం | కాంగ్రా జిల్లా,హిమాచల్ ప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 32°19′32″N 76°16′26″E / 32.325538°N 76.273818°E |
సరస్సు రకం | మంచినీటి సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల ఎత్తు | 2,934 మీ. (9,626 అ.) |
మూలాలు | Himachal Pradesh Tourism Dep. |
పేరు
మార్చుసరస్సుకి ఆగ్నేయ దిశలో 9 కిలోమీటర్ల దూరంలో కరేరి అనే గ్రామం ఉంది కాబట్టి ఈ సరస్సుకు కరేరి సరస్సు అని పేరు వచ్చింది.
భౌగోళికం
మార్చుకరేరి సరస్సు ధౌలాధర్ శ్రేణికి దక్షిణంగా ఉన్న లోతైన, నిస్సారమైన మంచినీటి సరస్సు. దీని ఉపరితలం సముద్ర మట్టానికి 2934 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ధౌలాధర్ శ్రేణి నుండి మంచు కరగడం వలన సరస్సు లోకి నీరు ప్రవహిస్తుంది.
ప్రత్యేకత
మార్చుకరేరి సరస్సు ధౌలాధర్ శ్రేణిలో ట్రెక్కింగ్ కు ప్రసిద్ది చెందింది. ఈ సరస్సు డిసెంబర్ ప్రారంభం నుండి మార్చి-ఏప్రిల్ వరకు మంచుతో గడ్డకట్టబడి ఉంటుంది. ఈ సరస్సు ఎదురుగా ఉన్న ఒక కొండపై శివుడు, అమ్మవారి ఆలయాలు ఉన్నాయి.[1]
మూలాలు
మార్చు- ↑ "హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ". hptdc. Archived from the original on 2019-03-15. Retrieved 2021-07-23.