కరౌలి జిల్లా
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో కరౌలి జిల్లా ఒకటి. కరౌలి పట్టణం ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. జిల్లాలో ప్రబల " హిందూస్థాన్ రెడ్‌స్టోన్ స్లేట్ ఫ్యాక్టరీ " ఉంది. జిల్లా వైశాల్యం 1,458,248 చ.కి.మీ.జిల్లా జనసాంధ్రత 264.
కరౌలి జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
విభాగం | భరత్‌పూర్ విభాగం | ||||||
ప్రధాన పరిపాలనా కేంద్రం | కరౌలి | ||||||
Government | |||||||
• జిల్లా కలెక్టర్ | ఎస్ఎచ్. సిద్ధార్థ్ సిహాగ్, ఐఎఎస్ | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 5,043 కి.మీ2 (1,947 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• మొత్తం | 14,58,248[1] | ||||||
జనాభా | |||||||
• అక్షరాస్యత | 66.22 | ||||||
• లింగ నిష్పత్తి | (పురుషులు) 1000:861 (స్త్రీలు) | ||||||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
భౌగోళికం
మార్చుకరౌలి జిల్లా వైశాల్యం 5530 కి.మీ. జిల్లా తూర్పు సరిహద్దులో ధౌల్‌పూర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో భరత్‌పూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో దౌస జిల్లా, పశ్చిమ సరిహద్దులో సవై మధోపూర్ జిల్లా ఉన్నాయి. జిల్లా ఆగ్నేయ సరిహద్దులో చంబల్ నది ప్రవహిస్తుంది. జిల్లా మొత్తం కొండలు, ఉపనదులతో నిండి ఉంది. జిల్లాలో గంభీరమైన శిఖరాలు మాత్రం లేవు.జిల్లా సముద్రమట్టానికి 1400 కి.మీ ఎత్తులో ఉంది. జిల్లాలో నాణ్యమైన పాలరాతి గనులు, ఇనుప గనులు ఉన్నాయి.
చరిత్ర
మార్చుఆరంభకాలంలో కరౌలి ప్రాంతం మత్స్య రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. 11వ శతాబ్దం తరువాత ఈ ప్రాంతాన్ని 1947 వరకు రాజపుత్రులు పాలించారు.జిల్లాలో 4 ప్రధాన ఆలయాలు ఉన్నాయి ( శ్రీమహావీర్జీ హింద్యాన్, శ్రీ అంజనీ మాతాజీ, మెహందీపూర్ బాలాజీ ). జిల్లాలో తిమంగర్, మంద్రయల్, రావల్ మహల్, సౌత్ మహల్, హింద్యాన్, నరసింగ్‌జి హింద్యన్ అనే ప్రముఖ కట్టడాలు ఉన్నాయి.
కరౌలి స్థావరాలు
మార్చు- హిందౌన్
- కరౌలి
- తొదభిం
- నదొతి
- సపొత్ర
- మంద్రైల్
ఆర్ధికం
మార్చు2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కరౌలి జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
చారిత్రిక జనాభా
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 2,98,215 | — |
1911 | 2,95,899 | −0.08% |
1921 | 2,66,079 | −1.06% |
1931 | 2,92,829 | +0.96% |
1941 | 3,30,914 | +1.23% |
1951 | 3,70,984 | +1.15% |
1961 | 4,43,169 | +1.79% |
1971 | 5,57,132 | +2.31% |
1981 | 7,18,715 | +2.58% |
1991 | 9,24,715 | +2.55% |
2001 | 12,05,888 | +2.69% |
2011 | 14,58,248 | +1.92% |
source:[3] |
2011 లో గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,458,459, [4] |
ఇది దాదాపు. | స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 340వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 264 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.57%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 858:1000 [4] |
జాతీయ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 67.34%.[4] |
జాతీయ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రజలు | మీన, గుర్జర్[7] |
మూలాలు
మార్చు- ↑ "Name Census 2011, Rajasthan data" (PDF). censusindia.gov.in. 2012. Retrieved 28 Feb 2012.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Swaziland 1,370,424
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-03. Retrieved 2014-11-14.