కర్లపాలెం (గుడ్లూరు)

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామం

ఇదే పేరుగల గ్రామం గుంటూరు జిల్లాలో ఉంది. చూడండి:- కర్లపాలెం

కర్లపాలెం,, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంగుడ్లూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08599 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 281 Edit this on Wikidata

లువా తప్పిదం: Coordinates not found on Wikidataపర్యాటకం

కర్లపాలెం వద్ద విశాలమైన సముద్రతీరం ఉంది. ఇక్కడ సముద్రంలో, 20 మీటర్ల వరకు ఎటువంటి లోతు ఉండదు. పర్యాటకులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సముద్రస్నానాలు చేయవచ్చునని మత్స్యకారుల కథనం. ఇక్కడి సముద్రతీరం ప్రశాంతతకూ ఆహ్లాదకర వాతావరణానికీ పేరొందినది.ఈ గ్రామం రామాయపట్నానికి రెండు కి.మీ.దూరంలో ఉంది. రామాయపట్నంలో వలె ఇక్కడ పడవలు ఎక్కువగా ఉండకపోవడంతో, ఇక్కడ పర్యాటకులకు వీలుగా ఉంటుంది. ఇంకొక ప్రధానమైన అనుకూల విషయం ఏమనగా, సముద్రం గ్రామానికి దగ్గరగా ఉండటంతో, ఇక్కడ వాహనాలు నేరుగా సముద్రపు అలల దగ్గరకు వెళ్ళే అవకాశం ఉండటం. ఎటువంటి రద్దీ లేకపోవడంతో తీరంలో ప్రశాంతంగా సేదదీరడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రామంలో సముద్రతీరానికి దగ్గరలోనే మంచినీటి బావులున్నవి. ఇవి పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతవి. ఇక్కడ కొద్దిపాటి వసతులు కలిగించినచో పర్యాటకులు అధికంగా విచ్చేయుటకు అవకాశం ఉంది. [1]

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు