గుడ్లూరు

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని గ్రామం, మండలకేంద్రం


గుడ్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం.[1]., మండలకేంద్రము.

గుడ్లూరు
రెవిన్యూ గ్రామం
గుడ్లూరు is located in Andhra Pradesh
గుడ్లూరు
గుడ్లూరు
నిర్దేశాంకాలు: 15°04′22″N 79°54′04″E / 15.0729°N 79.9012°E / 15.0729; 79.9012Coordinates: 15°04′22″N 79°54′04″E / 15.0729°N 79.9012°E / 15.0729; 79.9012 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగుడ్లూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం4,376 హె. (10,813 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం8,989
 • సాంద్రత210/కి.మీ2 (530/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08598 Edit this at Wikidata)
పిన్(PIN)523281 Edit this at Wikidata

గ్రామ చరిత్రసవరించు

కవిత్రయంలోని వాడు, ఉభయకవిమిత్రుడు, ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్రాప్రగడ ఈ గ్రామానికి చెందినవాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఎఱ్ఱాప్రెగడ గుడ్లూరులోని నీలకంఠేశ్వరస్వామి వారి గురించి పద్యాలు రచించారు.

గ్రామ భౌగోళికంసవరించు

 

సమీప గ్రామాలుసవరించు

అమ్మవారి పాలెం 2.4 కి.మీ,బసిరెడ్డిపాలెం 2.6 కి.మీ,కొత్తపేట 2.5 కి.మీ,పొట్లూరు 5.7 కి.మీ,చినల త్రాపి 5.8 కి.మీ.ఆవులవారిపాలెం (గుడ్లూరు) 5.0 km

సమీప పట్టణాలుసవరించు

లింగసముద్రం 15.9 కి.మీ,ఉలవపాడు 19.4 కి.మీ,కందుకూరు 19.5 కి.మీ.

గ్రామానికి సాగునీటి సౌకర్యంసవరించు

ఈ మండలంలో మన్నేరు, ఉప్పుటేరు, ఎలికేరు అనే మూడు కాలువలు ప్రవహిస్థున్నవి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ అంకమ్మ దేవతసవరించు

ఈ గ్రామంలో అంకమ్మ దేవత గ్రామోత్సవం, 2014, ఆగస్టు-24, ఆదివారం అర్ధరాత్రి తరువాత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేసి, స్థానిక శివాలయం నుండి మేళతాళాలతో, బొల్లావులు, యువకుల నృత్యాలమధ్య, దేవాలయ ప్రవేశం చేయించారు. సుమారు 200 మందికిపైగా యువకులు, స్త్రీల వేషధారణలో చేటలు పట్టుకొని నృత్యాలు చేస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

మహాభారతం తెలుగు చేసిన కవిత్రయంలో ఒకరైన ఎఱ్రన్న ఈ గ్రామంలో జన్మించారు.

గ్రామ విశేషాలుసవరించు

2017,జూన్‌లో నిర్వహించిన ఐ.సి.డబ్లు.ఎ.ఐ చివరి పరీక్షలలో ఈ గ్రామానికి చెందిన చుండూరు శాంతకుమారి, 800 మార్కులకుగాను 450 మార్కులు సంపాదించి, అఖిల భారతదేశస్థాయిలో 19వ ర్యాంక్ సాధించినది. ఈమె తండ్రి శ్రీ మాలకొండయ్య. [3]

గణాంకాలుసవరించు

2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,153.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,194, స్త్రీల సంఖ్య 3,959, గ్రామంలో నివాస గృహాలు 1,884. గ్రామ విస్తీర్ణం 4,376 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2014,ఆగస్టు-26; 7వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2017,ఆగష్టు-25; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=గుడ్లూరు&oldid=2844167" నుండి వెలికితీశారు