కలర్ ఫోటో (2020 సినిమా)
కలర్ ఫోటో 2020, అక్టోబరు 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్, బెన్ని ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, 'కంచరపాలెం' సుబ్బారావు తదితరులు నటించారు.[1][2][3] 1990లలో మచిలిపట్నం నేపథ్యంలో, ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది.[4][5][6]
కలర్ ఫోటో | |
---|---|
దర్శకత్వం | సందీప్ రాజ్ |
రచన | సందీప్ రాజ్ |
కథ | సాయి రాజేష్ |
నిర్మాత | సాయి రాజేష్ బెన్ని ముప్పానేని |
తారాగణం | సుహాస్ చాందిని చౌదరి సునీల్ వైవా హర్ష దివ్య శ్రీపాద 'కంచరపాలెం' సుబ్బారావు |
ఛాయాగ్రహణం | వెంకట్ ఆర్ శాఖమూరి |
కూర్పు | కోదాటి పవన్ కళ్యాణ్ |
సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థలు | అమృతా ప్రొడక్షన్స్ లౌక్యా ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | ఆహా (ఓటిటి) |
విడుదల తేదీ | 23 అక్టోబరు 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
2020, అక్టోబరు 23న ఈ చిత్రం ఆహా (ఓటిటి)లో విడుదలయింది.[7]
కథ నేపథ్యం
మార్చుసినిమా కథంతా మచిలీపట్నంలో జరుగుతుంది. ఊళ్ళో జనాలకి పాలు పోస్తూ పూటగడిపే జయకృష్ణ (సుహాస్), మరోవైపు కాలేజీలో చదువుకుంటాడు. కాలేజీలో చేరిన కొన్ని రోజులకే దీప్తి (చాందినీ చౌదరి)ను చూసి ప్రేమలో పడతాడు కిట్టు అలియాస్ జయకృష్ణ. ఇక కిట్టు అందంగా లేనప్పటికీ అతని మంచి మనసుకి ఫిదా అయి ప్రేమలో పడుతుంది దీపు అలియాస్ దీప్తి. ఎవరికీ తెలియకుండా ప్రేమించుకునే కిట్టు-దీపు ఓ ఇన్సిడెంట్ కారణంగా కాలేజీ ప్రిన్సిపాల్ తోపాటు దీపు అన్నయ్య రామరాజు (సునీల్)కి చిక్కుతారు. ఊళ్ళో పోలీస్ గా ఉద్యోగం చేస్తూ ప్రేమ వివాహాలను వ్యతిరేకించే రామరాజు, దీపుకి కిట్టుని దూరం చేసి తన చెల్లికి అందంగా ఉండే వ్యక్తితో పెళ్లి చేయాలని భావిస్తాడు. రామరాజు కారణంగా కిట్టు, దీపు విడిపోతారు. అలా ప్రేమించిన కిట్టుకి దూరమైన దీపు ఓ ఎన్.ఆర్.ఐ.ని తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంది. ఇక దీపుకి దూరమైన కిట్టు చివరికి ఏమయ్యాడు..? అనేది సినిమా కథాంశం.
నటవర్గం
మార్చు- సుహాస్ (జయకృష్ణ)
- చాందిని చౌదరి (దీప్తి వర్మ)
- సునీల్ (ఇన్స్పెక్టర్ రామరాజు, దీప్తి అన్నయ్య)
- ఆదర్శ్ బాలకృష్ణ
- వైవా హర్ష (బాల యేసు)
- దివ్య శ్రీపాద
- 'కంచరపాలెం' సుబ్బారావు
- శ్రీ విద్య
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: సందీప్ రాజ్[8]
- నిర్మాణం: సాయి రాజేష్, బెన్నీ ముప్పానేని
- కథ: సాయి రాజేష్
- సంగీతం: కాల భైరవ
- ఛాయాగ్రహణం: వెంకట్ ఆర్ శాఖమూరి
- కూర్పు: కోదాటి పవన్ కళ్యాణ్
- కళ: క్రాంతి ప్రియం
- నిర్మాణ సంస్థ: అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్
- పంపిణీదారు: ఆహా (ఓటిటి)
పాటలు
మార్చుUntitled | |
---|---|
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్ పాటలు రాశారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[9]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తరగతి గది" | కిట్టు విస్సాప్రగడ | కాల భైరవ | 3:34 |
2. | "అరెరె ఆకాశం" | కిట్టు విస్సాప్రగడ | అనురాగ్ కులకర్ణి, కాల భైరవ | 3:23 |
. 3. ఏకాంతం. క్రిష్ణ చైతన్య రమ్య బెహ్ర
4.చెప్పాలంటే
చాలా కష్టం సాయికిరణ్ హేమ చంద్ర
స్పందన
మార్చుఈ చిత్రం "ఆకట్టుకునే ప్రేమకథ" అని ఈనాడు పత్రికలో రాశారు. శారీరక రంగు నేపథ్యంలో ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నందుకు దర్శకుడిని అభినందిస్తూ, ఆ కథని స్క్రీన్ ప్లేలోకి మలచడం సరిగాలేదని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించిన వారి నటన బాగుందని సమీక్ష పేర్కొంది.[10] కథాంశం, నటన, సంగీతం బాగుందని, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉందని సాక్షి పత్రికలో రాశారు.[11]
మూలాలు
మార్చు- ↑ Sangam, Sowmya. "Suhas to grip viewers with intense character". Telangana Today. Retrieved 2020-10-25.
- ↑ "It's an absolute pleasure and honour to be part of this film, says Colour Photo actor Suhas". The Times of India. April 21, 2020. Retrieved 2020-10-25.
- ↑ "Chandini Chowdary pens an emotional note after wrapping up the shoot of 'Colour Photo' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-25.
- ↑ Dundoo, Sangeetha Devi (2020-08-11). "'Colour Photo', the story of a 'below average' guy". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-10-25.
- ↑ "I can assure that Sunil Garu has a terrifying role in Colour Photo: Suhas - Times of India". The Times of India. Retrieved 2020-10-25.
- ↑ "Comedian Suhas turns into a hero for 'Colour Photo': Kala Bhairava to compose the music - Times of India". The Times of India. Retrieved 2020-10-25.
- ↑ "Colour Photo (2020) | Colour Photo Movie | Colour Photo Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat. Retrieved 2020-10-25.
- ↑ Eenadu (30 May 2021). "ఓటీటీలో ఓహో అనిపించారు! - Sunday Magazine". EENADU. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
- ↑ "Colour Photo". Wynk. Archived from the original on 2020-11-03. Retrieved 2020-10-25.
- ↑ "రివ్యూ: కలర్ ఫోటో" [Review: Colour Photo]. Eenadu. 2020-10-23. Retrieved 2020-10-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "కలర్ ఫొటో రివ్యూ". Sakshi. 2020-10-23. Retrieved 2020-10-25.
{{cite web}}
: CS1 maint: url-status (link)