చాందిని చౌదరి తెలుగు చలనచిత్ర నటి. లఘుచిత్రాలలో నటించిన చాందిని, కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

చాందిని చౌదరి
Chandini Chowdary.jpg
జననం
చాందిని చౌదరి

(1991-10-23) 23 అక్టోబరు 1991 (వయస్సు 29)
ఇతర పేర్లుచాందిని
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసంసవరించు

చాందిని చౌదరి 1991, అక్టోబరు 23న విశాఖపట్టణంలో జన్మించింది. విద్యాభ్యాసమంతా బెంగళూరులో పూర్తిచేసింది.[1]

సినీరంగ ప్రస్థానంసవరించు

బెంగళూరులో చదువుతున్న సమయంలోనే లఘచిత్రాలలో నటించింది. కొన్ని ముఖాముఖీలలో తను ఎమన్నదంటే తను వేసవి సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు యమ్.ఆర్ ప్రొడక్షన్స్ వారి 'ది వీక్' అనే లఘు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, రోమియో జూలియట్ మొదలగు లఘు చిత్రాలు చాందినికి గుర్తింపునిచ్చాయి. మొదట్లో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తో కలిసి చాలా లఘు చిత్రాలలో నటించి విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు అందులో ఒకటి 'ది బ్లైండ్ డేట్'. వారు అన్ని లఘు చిత్రాలు చేసినప్పటికీ ఒక్క చలనచిత్రంలో కూడా కలిసి నటించకపోవడం గమనార్హం. [1]

2013లో వచ్చిన మధురం లఘచిత్రంలో చాందిని నటనను చూసిన ముళ్ళపూడి వరా, కె.రాఘవేంద్రరావులు కుందనపు బొమ్మ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది.[2]2015లో కేటుగాడు చిత్రంతో తెలుగు చలన చిత్ర తెరకు పరిచయం అయ్యింది. అంతకుముందు తను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలలో చిన్న పాత్రలు పోషించింది. ఆ తరువాత కేటుగాడు సినిమాలో కధానాయికగా నటించిన చాందిని బ్రహ్మోత్సవం, శమంతకమణి సినిమాలలో కూడా నటించింది. 2018లో వచ్చిన మను సినిమాలో తన పాత్రకు ప్రశంసలు అందుకుంది. 2020లో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమాలో నటించింది.

నటించిన చిత్రాల జాబితాసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2012 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తెలుగు
2013 ప్రేమ ఇష్క్ కాదల్ తెలుగు
2015 కేటుగాడు అకిరా తెలుగు
2016 బ్రహ్మోత్సవం[3] ఆనంద వల్లి తెలుగు ప్రత్యేక పాత్ర
2016 కుందనపు బొమ్మ సుచి తెలుగు
2017 శమంతకమణి[4] మధు తెలుగు
2017 లై పెళ్లిచూపులోని అమ్మాయి తెలుగు ప్రత్యేక పాత్ర
2018 హౌరా బ్రిడ్జ్ స్వీటీ తెలుగు
2018 మను నీలా తెలుగు మొట్టమొదటి జన నిర్మాణ చిత్రం
2020 కలర్ ఫోటో దీప్తి తెలుగు ఆహా ఆప్ లో విడుదలయ్యింది
2020 భోంభాట్ చైత్ర తెలుగు అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది
2021 సూపర్ ఓవర్[5] మధు తెలుగు ఆహా అప్ లో విడుదల అయ్యింది

టివి సిరీస్ జాబితాసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2019 గాడ్స్ ఆఫ్ ధర్మపురి స్వప్న తెలుగు జ్సీ5
2020 మస్తీస్ లేఖ తెలుగు ఆహా

మూలాలుసవరించు

  1. 1.0 1.1 justbollywood. "Chandini Chowdary". www.justbollywood.in. Archived from the original on 1 June 2017. Retrieved 16 June 2017.
  2. సినీజోష్. "సినీజోష్ ఇంటర్వ్యూ: చాందిని చౌదరి". www.cinejosh.com. Archived from the original on 10 October 2017. Retrieved 16 June 2017.
  3. టాలీవుడ్ టైమ్స్. "మహేష్ బాబుతో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్". www.tollywoodtimes.com. Archived from the original on 17 August 2018. Retrieved 16 June 2017.
  4. ఇండియా గ్లిట్జ్. "మల్టీస్టారర్ లో చాందిని చౌదరి..." /www.indiaglitz.com. Retrieved 16 June 2017.
  5. "Promo: Chandini Chowdary as Madhu in Super Over, film to premiere on aha from Jan 22". ap7am.com. Retrieved 2021-02-11.